చిన్ని చిన్ని ఆనందాలు
🌺🍀🌺🍀🌺🌺
కొందరు వాస్తవంలో బతుకుతారు. ఇంకొందరు భావ ప్రియంగా జీవిస్తారు. ప్రకృతిని ఉన్నదున్నట్లుగా చూసేవారు కొందరైతే ఉన్నదానికి మాధుర్యాన్ని జోడించి ఆనందించేవారు మరికొందరు.
దృశ్య జగత్తులో అనుదినం పరిఢవిల్లే నవ్య దర్శన శోభను చూసి ఆనందం అనుభవించేందుకు
దృశ్య జగత్తులో అనుదినం పరిఢవిల్లే నవ్య దర్శన శోభను చూసి ఆనందం అనుభవించేందుకు
కొందరికి స్ఫూర్తి లభించగా విరుద్ధ కోణంలో దర్శించే వారికి చిన్న ఆనందాలు సైతం మృగ్యమై ఎండమావులవుతాయి.
ఆనందానుభవానికి తీర్థ యాత్రలు, విహార యాత్రలు తోడ్పడతాయి. ప్రయాణ సమయంలో తారసిల్లే ప్రతి క్షణమూ అణువణువూ ఆనందాన్ని ఇస్తుందని గ్రహించాలి. దారిలో కనిపించే కొండలు, గుట్టలు, చెట్లు, మహా వృక్షాలు, సెలయేళ్ళు, సస్యశ్యామలమైన పంటచేల దృశ్యాలు, లేళ్ళు, దుప్పులు, అలవోకగా ముంగురులను కదిలిస్తూ హాయిగొలిపే మలయ మారుతాలు ఇవన్నీ... అనుక్షణం చిన్న చిన్న ఆనందాలను పంచే అంశాలే.
వాతావరణంలోని ఓ చిలుక పలుకు, ఓ పసిబిడ్డ ఏడుపు, ఓ రైలు కూత, శునకపు అరుపు, అలల సవ్వడి అదాలుగా ఆలకించే వాడికి అన్నీ బాలకృష్ణుడి చిరు గజ్జెల మోతలే! చిదానంద స్వరాలే! ఆనందం నిర్వచనానికి అతీతమైనది. అది అనుభవంలోకి వచ్చినపుడు ఆస్వాదించి సొంతం చేసుకోవాలి. మలినమైన, నేరపూరితమైన మనసులో స్వచ్ఛమైన ఆనందాలు ప్రతిఫలించవు. వారు వేటిని ఆనందాలని భావించి అనుభవించేందుకు ఉత్సుకత చూపుతారో అవి హేయమైన, అప్రియమైన అనుభూతులు.తమోగుణ ప్రధానులైనవారికి సర్వజన మోదకమైన చిన్న ఆనందాలు లభించే అవకాశం దాదాపు మృగ్యమే!
రచనాభినివేశం, సంగీత ప్రియత్వం, క్రీడాసక్తి, దానగుణం, సేవా పరత్వం. ఇవన్నీ చిన్న ఆనందాలను పోగుచేసే అంశాలే! లలిత కళల అభ్యసనం, వాటిపట్ల ఆసక్తి సాధకుల్లో ఆనందానుభూతులను ప్రోది చేస్తాయి.
మనసు మహోత్కృష్టమైనది. అంతఃకరణకు మనసే కేంద్ర స్థావరం.మనసు కలుషితం కాకుండా చూసుకోవడం ఓ మంచిమనిషి కర్తవ్యం. మనసును ఆనందభరితం చేసుకోవాలంటే సత్య వర్తన, సత్య భాషణ, దైవ ప్రియత్వం, సోదర భావం వంటి విశేష గుణాలు తోడ్పడతాయి. ఆ దైవీ గుణాలు ఆధ్యాత్మికంగానే లభ్యమవుతాయి.
సంగీతాన్ని ఆలంబన చేసుకొని త్యాగరాజు, అన్నమయ్య భగవంతుని కీర్తించే దివ్యానందాన్ని అనుభవించారు. వారు రచించిన గీతాలు శ్రోతలకు ఆనందాన్ని పంచాయి. తన గురించి లోకులు అనే ఓ మంచి మాట చెవిన పడినప్పుడు మనిషికి కలిగే ఆనందం అనల్పమైనది. ఓ పేదవాడు, లేదా యాచకుడికి చేసిన చిన్నపాటి సాయం మంచి అనుభూతిని ఇస్తుంది.
చంటిబిడ్డను లాలించే తల్లిదండ్రులకు కలిగే మధుర భావన పరిమాణం అల్పమా, అనల్పమా కొలవలేనిది.ఆనందం ఓ అంబుధి. దైవ ప్రసాదితమైన ఆనందం ఓ మహాసాగరం. చిన్న చిన్న నీటి బిందువులు అపార పారావారంగా ఏర్పడినట్లు చిన్న చిన్న ఆనందాలు ప్రవర్ధమానమై ఆనందాంబుధి ఏర్పడుతుంది. అందుకు సాధన తోడ్పడుతుంది. వాస్తవంలో కష్టాలను ఖాతరు చేయక ముందుకు సాగే సాధకుడికి అనుభవంలో ప్రతిక్షణమూ ఓ చిన్న ఆనందమే.
ఎవరైతే తమను తాము యధార్ధంగా అర్థం చేసుకుంటారో, వారే తమ స్వశక్తి పై నిలబడ గలరు.
ఎవరైతే తమను తాము యధార్ధంగా అర్థం చేసుకుంటారో, వారే తమ స్వశక్తి పై నిలబడ గలరు.
సశేషం .. పార్ట్ 2 రేపటి కథలో
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment