ఆధ్యాత్మికానందం
🌺🍀🌺🍀🌺🌺🍀
సంతృప్తిప్రశాంతత, మానసికానందం.ఇటువంటి గుణాలున్నవారి జీవితం పరిపూర్ణమవుతుందిఎవరికి వారే ఆధ్యాత్మికంగా ఎదిగితేనే అది సాధ్యపడుతుందిఆధ్యాత్మికత అనే పదానికి ఆత్మీయంగా దగ్గర కావడమని అర్థం. ఆ స్థితికి చేరాలంటే నిత్యజీవన సరళికి మానవీయ విలువలు జతపడాలి ఆలోచనల్లో వైరాగ్యం చోటుచేసుకోవాలి ఆచరణలో ఆదర్శం ఉండాలిఅలాగైతేనే ఇహంలో మానవుడికైనా, పరంలో మాధవుడికైనా దగ్గర కాగలుగుతారు. అలా కాకుండా ఎదుటివారు ఆపదలో ఉన్నాతమకేమీ పట్టనట్టు ప్రవచనాలు వింటూనో, స్తోత్రాలు చదువుకుంటూనో, జపమాల తిప్పుకొంటూ కూర్చోవడమో చేస్తే అది ఆధ్యాత్మికత అనిపించుకోదు.
బాధల్లో, కష్టాల్లో ఉన్నవాళ్లను తేరుకోలేని ఇబ్బందుల్లో ఉన్నవారిని చూస్తూ.అయ్యో పాపం అని జాలిపడటమో ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు.లాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి బదులు వాళ్లను ఆ స్థితి నుంచి తప్పించి స్వస్థత చేకూర్చడానికి పూనుకోవాలిరొట్టెను దొంగిలించి నవాడి నేరాన్ని చూసి నిందించడం, శిక్షించాలనుకోవడం సరైన పని కాదు. పని చెయ్యడానికి పురిగొల్పిన పరిస్థితుల్ని తెలుసుకుని సరిదిద్దగల గాలి ఇది సామాజిక ఆధ్యాత్మికత అంటారు ప్రవక్తలు.
అన్ని జన్మలకన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనదంటారుమాట్లాడగలగడం వల్లనే అలా అని ఉంటారు. కానీ తరచి చూస్తే పశుపక్ష్యాదుల్లోనూ ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాటి ప్రాణికి సాయపడటం, ఆపదలో ఆదుకోవడంఅండగా నిలబడటం, ఆసరా కావడం లాంటివిపశుపక్ష్యాదుల్లో జన్మతః వచ్చే లక్షణాలుఒక కాకి మరణిస్తే ఎన్నో కాకులు చుట్టూ చేరతాయి. ఒక చీమ చనిపోతే మరో చీమ మోసుకుపోతుంది. ఒక పక్షి పెట్టిన గుడ్డును మరో పక్షి పొదిగి పిల్లల్ని చేస్తుంది. అలా చేసినందుకు అవి ఏ ప్రతిఫలాన్ని ఆశించవుకానీ బుద్ధిజీవి అనిపించుకున్న మానవుడు అలాంటి సేవలు చెయ్యాలంటే ప్రత్యేకంగా అలవాటు చేసుకోవాలి. లేదా ఇతరులెవరైనా ప్రేరణ కలిగించాలిఈ రెండూ కాకపోతే ఆ పని చెయ్యడం వల్ల కొంత ప్రతిఫలమైనా ఉండాలి. ఇది ఎంతవరకు సమంజసమో ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలిఉత్కృష్టమైంది అనిపించుకున్న మానవజన్మ కలిగినందుకు అందరికీ ఉపయుక్తమైన పనులు చెయ్యడానికి శ్రద్ధ చూపాలిదీన్ని బాధ్యతాయుత ఆధ్యాత్మికత అంటారు.
చెల్లాచెదురుగా ఉన్నవాటిని క్రమపద్ధతిలోకి తేవడాన్ని సంస్కరించడం అంటారు. దాని రూపమే సంస్కృతి. అది కలిగి ఉండటం సంస్కారం. ప్రవర్తన, నడవడిక, ఆలోచనచేసే పని తదితరాలన్నింటినీ క్రమబద్ధీకరించడమే సంస్కృతికి నిదర్శనం.
భగవంతుడి నివేదన కోసం భక్ష్యాన్ని తీసుకుని వెళుతున్న వ్యక్తికిఆకలితో అలమటిస్తున్న ప్రాణి ఎదురైతే భక్ష్యాన్ని ఎలా వినియోగించాలో తేల్చుకోగలగడమే సంస్కారానికి ఉదాహరణ. దీన్ని స్థితప్రజ్ఞతో కూడిన ఆధ్యాత్మికత అంటారుఇలా. ఎవరికి వారు చేసే పనులు, వాటి స్థాయిని బట్టి మంచివారుగొప్పవారుమహానుభావులు, రుషుల యుగపురుషులుగా అలరారుతారుఎన్ని ఆటంకాలెదురైనా వారు స్థిరమైన మనసుతో పదిమందికీ పనికి వచ్చే పనులనే చేస్తారు. వారు పొందేది, వారు అందరికీ అందించేదీ ఆధ్యాత్మిక ఆనందం.
*సర్వేజనా సుఖినోభవంతు*
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment