🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀🌺🌺
ప్రత్యేక దర్శనాలు, అర్చన టిక్కెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరు బాలాజీ క్షేత్రం వినుతి కెక్కింది.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి. భాగ్యనగరంలోని చిలుకూరులో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి కొరినదే తడవుగా కొండంత వరాలు అనుగ్రహించినప్పటికీ, భక్తుల వద్ద నుండి వడ్డి కాసులు మాత్రం ఆశించడు.

ఇటీవలికాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరులో 10,12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది.

సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.
అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు.మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే.నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించి ,నన్ను సేవించి తరించు’.. అని చెప్పి మాయమయ్యాడట! నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.
అలా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్య పూజలందుకుంటు భక్తుల కొంగుబంగారంగా మారాడు. ఇక్కడ ఏకశిలలోనే శ్రీదేవి, భూరేవి. వేంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. చిలుకూరు స్వామి మహిమ అంతా ఇంతా కాదని ఆయన భక్తులు చెపుతారు. భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి, స్వామివారికి తమ కోరికను విన్నవించుకుంటారు. కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. భక్తుడు తన కోరిక సఫలమయ్యేవరకు ఆ కోరికను తనకు, స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. మూడో మనిషి చెవిన వెయ్యకూడదు అట ఇక్కడ దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు.

చిలుకూరు స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రమయ్యింది.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment