చిన్ని చిన్ని ఆనందాలు -2
🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺
ప్రతి ఒక్కరూ తమను తాము దేహముగా భావిస్తూ దేహ సంబంధాలకు, వస్తువులకు, వైభవాలకు అత్యంత ప్రాముఖ్యత యిస్తున్నారు. దేహాన్ని నడిపించే చైతన్య శక్తి అయిన ఆత్మయే తానని తెలుసుకున్నప్పుడు, దైహిక సంపదతో పాటు ఆత్మ గుణాలైన శాంతి, సుఖము, ప్రేమ పెంపుదలకు కృషి చేస్తారు.
ఎవరైతే తిమనితాము నిజంగా అర్ధము చేసుకుంటారో, వారు తమ కాళ్ళపై తాము నిలబడగలరు. అన్ని పరిస్థితులలో నిశ్చలంగా వుండగలరు. ఇక్కడ తమని అంటే స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారో, వారు తమలోనే వున్న సర్వ గుణములను, సర్వ శక్తులను సదా జాగృతం చేసుకొని తమలోతాము ఆనందంగా రమిస్తూ వుంటారు. ఈ సంగమ యుగములో పరమాత్మ ద్వారా మనకు లభించిన యధార్థ జ్ఞానములో మొదటి విషయము, ఆత్మ, పరమాత్మ యొక్క సత్య పరిచయము. ఈ విషయానుభూతి ద్వారా అతీంద్రియ సుఖానుభూతిని అనుభవిస్తున్న మనము సౌభాగ్యశాలి ఆత్మలము...
.
జీవాత్మ భక్తితో అనంత అన్వేషణలో ఉన్నప్పుడు అనంతం వైపు మార్గంలో ఉన్నప్పుడు, ఈ మూడు రకాల బ్రాంతులు అనేక ఆటంకాలను ఎదుర్కోవాలి. నాకు సరిగ్గా హనుమంతుడు చేసినట్లుగా వ్యవహరించాలి.
- సత్వగుణ భ్రాంతికి వ్యతిరేకంగా ఎవ్వరూ వెళ్ళకూడదు. ఎందుకనగా వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదు దానికి బదులు గా దూరంగా ఉండి పని చేస్తూ పోవాలి.దాన్ని వదిలించుకోలేం అలాగని సంబంధం పెట్టుకోలేం, కనుక దానితో పాటే వెళ్తూ, అదే సమయంలో సూక్ష్మంగా భావించి దాని నుండి తొలగిపోవాలి. దాని ఉచ్చులో చిక్కుకోకూడదు. ఎందుకంటే ఈ రెండు రకాల ప్రవృత్తుల నుండి భక్తుడు దూరంగా ఉండాలి.
- తమోగుణ ప్రవక్తులు మన ప్రగతికి నష్టం కలిగించేలా ఉన్నాయి. కనుక వాటిని నిర్ధాక్షణ్యంగా చంపవచ్చు.
- రజోగుణ బ్రాంతిని సగం చచ్చిన దానిలా వదిలి వేయాలి. దాన్ని పూర్తిగా నాశనం చేస్తే మనం రక్షణ లేని వారమవుతాం.
సర్పము అహానికి గుర్తు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే.
దైవమనే బంగారమెలా వుంటుందో తెలియనిదే మన సద్గురువనే బంగారువుంగరం యొక్క విలువను గుర్తించలేము. తేనెయొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెతీగ మాత్రమే తేనెగల పువ్వులన్నింటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఆ పువ్వు యొక్క నామరూపాలను పట్టించు కొనకుండా దానిలో దాగియున్న తేనెను గుర్తించగలదు. అలాగే మన మాశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపం, లౌకికమైన నామముల మాటున దాగియున్న దైవత్త్వాన్ని గుర్తించగలగాలంటే, సద్గురువులందరి రూపంలోనూ ఒకే దైవమెలా ప్రకటయ్యాడో వారి చరిత్రలనుండి గమనించాలి.
వారు మనకు తెలిపిన సేవా విధానం తెలుసుకొని మనమనుసరించాలి. భాగవతం ఏకాదశ స్కంధంలో అవధూత గూడా తాను 24 మంది గురువులనుండి జ్ఞానమార్జించానని చెప్పారు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గూడా తత్త్వ దర్శనులైన గురువులను శరణుపొంది, సేవించి చక్కగా ప్రశ్నించమని, అలా చేస్తే అట్టి గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. ఇందులో యింకొక్క సూత్రం యిమిడి యున్నది. ఎందరు గురువులను మహనీయులనూ దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనమాశ్రయించిన సద్గురువుయొక్క కృపవల్లనే లభిస్తాయి ఉత్తమురాలయిన ఇల్లాలిని ఎందరు గౌరవించి ఆదరించినా, అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే గదా! ఈ సూక్ష్మం తెలియకుంటే, గుర్తించుకోకుంటే, అనేకమంది మహనీయులను దర్షించినా గూడా చిత్త చాంచల్యమే కలుగుతూంది.
.
“విజయం అనుకునేదాని కన్నా సాధారణంగా వైఫల్యంగా పరిగణింపబడేదే మీ జీవితానుభూతిని మరింత ప్రగాఢం చేస్తుంది...
.
మానవజన్మ - పరమార్థం
.
“విజయం అనుకునేదాని కన్నా సాధారణంగా వైఫల్యంగా పరిగణింపబడేదే మీ జీవితానుభూతిని మరింత ప్రగాఢం చేస్తుంది...
.
మానవజన్మ - పరమార్థం
మనిషి జీవితంలో,ప్రగతి అంటే ఉద్యోగంలోనూ,ఆస్తిలోను,అంతస్తు లోను కాదు.!
ఆ మనిషి జీవితంలో,ఆధ్యాత్మిక ప్రగతి ముఖ్యం...!!! మనిషి జీవితం,మిగతా జీవుల కంటే గొప్పది,భగవంతుడు,తనను చేరుకోవడానికి ఒక అవకాశంగా మనుష్య జన్మ నిస్తాడు..!
కావున ఈ జన్మలో, ఆ స్వామిని, చేరుకోవడానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలి....
అన్యధా..! శరణం నాస్తి...
త్వమేవ..! శరణం మమ.......
.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment