Monday, 20 May 2024

వివేకానందుడు మౌనంగా ఉండిపోయారు (21-May-24, Enlightment Story)

వివేకానందుడు మౌనంగా ఉండిపోయారు 

🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀🌺🌺

ఒకరోజు రామకృష్ణ పరమహంస శిష్యుడైన స్వామి వివేకానంద రైలులో మొదటి తరగతిలో కూర్చుని ప్రయాణిస్తున్నారు. ఆ రోజుల్లో రైలులో మొదటి తరగతిలో ప్రయాణించడం చాలా ఖరీదైన విషయం. ఆ కంపార్ట్‌మెంట్‌లో సామాన్యులు కూర్చొనే అవకాశం లేదు. స్వామీజీ సన్యాసి తరహా దుస్తులు ధరించారు.


ప్రయాణంం మధ్యలో ఇద్దరు ఆంగ్లేయులు వచ్చి అతని పక్కన కూర్చున్నారు. రైలులో మొదటి తరగతిలో ఒక సన్యాసిని కూర్చోవడాన్ని చూసి వారిద్దరూ ఆశ్చర్యపోయారు.
సాధువులకు చదువురాదని, వారికి తమ ఇంగ్లీషు తెలియదని భావించారు. అంతే వారిద్దరూ వివేకానందుని చూసి ఇంగ్లీషులో నిందించడం మొదలుపెట్టారు.

సాధువులు భూమికి భారం లాంటివారని. ఇతరుల డబ్బుతో సాధువులు రైలులోని మొదటి తరగతిలో ప్రయాణిస్తుంటారని వారు ఆరోపించారు.ఇలా చాలాసేపు ఆంగ్లేయులిద్దరూ స్వామీజీ గురించి చెడుగా మాట్లాడారు. వివేకానందునికి వారు మాట్లాడిన ఆంగ్ల సంభాషణంతా అర్థమైంది కానీ వారి విమర్శలకు స్పందించకుండా మౌనం వహించారు.

కొంతసేపటికి ఆ కంపార్ట్‌మెంట్‌లోకి టిక్కెట్‌ కలెక్టర్ వచ్చాడు. అతనితో వివేకానందుడు ఆంగ్లంలో మాట్లాడారు. ఇది చూసిన ఆ ఇద్దరూ మరింత ఆశ్చర్యపోయారు. తమ తప్పును గ్రహించారు. స్వామీజీని క్షమాపణలు కోరారు.

‘మీకు ఇంగ్లీష్ తెలుసు. మేము మీగురించి, చెడుగా మాట్లాడాం. అయినా మీరు మౌనంగా ఉన్నారు. మీరు మాకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు?’ అని అడిగారు.

👉వెంటనే వివేకానందుడు స్పందిస్తూ మీలాంటి వారి విమర్శలతో నాలోని సహనం పెరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా సహనం కోల్పోను.

👉మీరు మీ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేను వాటిని సహించాలని నిర్ణయించుకున్నాను.

👉కోపం వస్తే నాకే నష్టం వాటిల్లేది. మన మధ్య వివాదం జరిగి, అది ముదిరి ఉంటే మరిన్ని సమస్యలు వచ్చేవి. అందుకే మౌనంగా ఉండిపోయాను’ అని వివేకానందుడు అన్నారు.

ఈ ఉదాహరణ ద్వారా మనం సహనగుణానికున్న గొప్పతనం తెలుసుకోవచ్చు.🍁


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...