Friday, 31 May 2024

ఐశ్వర్యం అంటే (03-June-24, Enlightment Story)

 ఐశ్వర్యం అంటే 

🌺🍀🌺🍀🌺

ఎక్కడ పోతుందో అని లాకర్లలో దాచుకునే భయం, ఐశ్వర్యమా? లేక ఎప్పుడు మనతో నే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా! ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు ,త్రాసులోని తులాల బంగారాలు కాదు...!

  • ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"!
  • ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"!
  • ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"!*
  • అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"!
  • పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"!
  • పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"!
  • మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం"!
  • పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"!
  • ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"!
  • అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు  "ఐశ్వర్యం"!
  • బుద్ధికలిగిన బిడ్డలు  "ఐశ్వర్యం"!
  • బిడ్డలకొచ్చే చదువు  "ఐశ్వర్యం"!
  • భగవంతుడిచ్చిన ఆరోగ్యం  "ఐశ్వర్యం"!
  • చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి  "ఐశ్వర్యం"!
  • పరులకు సాయంచేసే మనసు మన  "ఐశ్వర్యం"!
  • ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు
  • కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం
  • మనసు పొందే సంతోషం ఐశ్వర్యం
  • మీకు ఉన్న ఐశ్వర్యం ఏమిటో గుర్తించండి. దానిలో హాయిగా జీవించండి

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

కాంటాక్ట్ ఉంది కనెక్షన్ లేదు (02-June-24, Enlightment Story)

కాంటాక్ట్  ఉంది కనెక్షన్ లేదు

🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀🌺🌺

ఒక ఉపాధ్యాయుడిని ఒక యువకుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు. యువకుడు ముందుగా అనుకున్న ప్రకారం ఉపాధ్యాయుడిని ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు.


యువకుడు - సార్, మీ చివరి ఉపన్యాసంలో, మీరు దీని గురించి మాకు చెప్పారు *సంప్రదింపు*మరియు కనెక్షన్
 ఇది నిజంగా గందరగోళంగా ఉంది.  మీరు వివరించగలరా? ఉపాధ్యాయుడు చిరునవ్వు నవ్వి, యువకుడు అడిగిన ప్రశ్న నుండి స్పష్టంగా తప్పుకున్నాడు. మీరు ఈ నగరానికి చెందినవా?

యువకుడు : "అవును..."*

ఉపాధ్యాయుడు: "ఇంట్లో ఎవరున్నారు?"*

ఇది చాలా వ్యక్తిగతమైన మరియు అసమంజసమైన ప్రశ్న కాబట్టి ఉపాధ్యాయుడు తన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని యువకుడు భావించాడు.  ఇంకా యువకుడు ఇలా అన్నాడు: తల్లి గడువు ముగిసింది. తండ్రి ఉన్నారు. ముగ్గురు సోదరులు మరియు ఒక సోదరి. అందరూ వివాహం చేసుకున్నారు.

ఉపాధ్యాయుడుచిరునవ్వుతో మళ్లీ అడిగాడు: మీరు మీ నాన్నతో మాట్లాడతారా? యువకుడు విసుగుగా కనిపించాడు.

ఉపాధ్యాయుడు మీరు అతనితో చివరిగా ఎప్పుడు మాట్లాడారు? ఆ యువకుడు తన చికాకును అణచుకుంటూ ఇలా అన్నాడు: "ఒక నెల క్రితం కావచ్చు."*

ఉపాధ్యాయుడు : మీ అన్నదమ్ములు తరచుగా కలుస్తుంటారా? కుటుంబ సమేతంగా మీరు చివరిసారిగా ఎప్పుడు కలుసుకున్నారు? ఈ సమయంలో, యువకుడు నుదిటిపై చెమట కనిపించింది.

యువకుడు : ఇలా అన్నారు. మేము 2 సంవత్సరాల క్రితం పండుగలో చివరిగా కలుసుకున్నాము.

ఉపాధ్యాయుడు: మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు? యువకుడు (నుదురు మీద చెమటను తుడుచుకుంటూ) ఇలా అన్నాడు 3 రోజులు.

ఉపాధ్యాయుడు:  మీరు మీ తండ్రి పక్కన కూర్చొని అతనితో ఎంత సమయం గడిపారు?

యువకుడు : కలవరపడి, ఇబ్బందిగా చూస్తూ కాగితంపై ఏదో రాయడం మొదలుపెట్టాడు.

ఉపాధ్యాయుడు:  మీరు కలిసి అల్పాహారం, భోజనం లేదా రాత్రి భోజనం చేసారా? అతను ఎలా ఉన్నాడని మీరు అడిగారా? మీ తల్లి చనిపోయిన తర్వాత అతని రోజులు ఎలా గడిచిపోతున్నాయి అని అడిగారా? యువకుడు కళ్ల నుంచి కన్నీటి చుక్కలు కారడం ప్రారంభించాయి.

ఉపాధ్యాయుడు యువకుడు చేతిని పట్టుకుని ఇలా అన్నాడు: ఎబ్బెట్టుగా, కలత చెందకండి లేదా విచారంగా ఉండకండి. నేను తెలియకుండా మిమ్మల్ని బాధపెడితే క్షమించండి.మీకు మీ నాన్నతో 'కాంటాక్ట్' ఉంది కానీ అతనితో మీకు 'కనెక్షన్' లేదు. మీరు అతనితో కనెక్ట్ కాలేదు. 

అనుబంధం హృదయానికి మరియు హృదయానికి మధ్య ఉంది. కలిసి కూర్చోవడం, భోజనం చేయడం మరియు ఒకరినొకరు చూసుకోవడం, తాకడం, కరచాలనం చేయడం, కంటిచూపు, కలిసి కొంత సమయం గడపడం... మీ అన్నదమ్ములందరికీ

 ఆ యువకుడు  కళ్ళు తుడుచుకుని ఇలా అన్నాడు: నాకు మంచి & మరపురాని పాఠం నేర్పినందుకు ధన్యవాదాలు సర్.

ఇంట్లో ఉన్నా, సమాజంలో ఉన్నా ప్రతి ఒక్కరికీ చాలా పరిచయాలు ఉంటాయి కానీ సంబంధం ఉండదు.  ప్రతి ఒక్కరూ తనదైన ప్రపంచంలో బిజీగా ఉంటారు. మనం కేవలం నిర్వహించవద్దు.పరిచయాలు అయితే మనం కనెక్ట్ చేయబడింది

సంరక్షణ, భాగస్వామ్యం,సమయాన్ని గడపడం మన దగ్గరి మరియు ప్రియమైన వారందరితో


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయం,విశేషాలు (01-June-24, Enlightment Story)

శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయం,విశేషాలు
🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀🌺🌺

ప్రత్యేక దర్శనాలు, అర్చన టిక్కెట్లు, హుండీల గొడవలు లేని ఆలయంగా చిలుకూరు బాలాజీ క్షేత్రం వినుతి కెక్కింది.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణ లోని చిలుకూరు గా ప్రతీతి. భాగ్యనగరంలోని చిలుకూరులో వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి కొరినదే తడవుగా కొండంత వరాలు అనుగ్రహించినప్పటికీ, భక్తుల వద్ద నుండి వడ్డి కాసులు మాత్రం ఆశించడు.

ఇటీవలికాలంలో ఇంతగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ నిజానికి ఇప్పటిది కాదు. ఉస్మాన్ సాగర్ తీరంలో ఉన్న ఈ చిలుకూరు చాలా పురాతనమైంది. చిలుకూరులో 10,12 శతాబ్దాల్లో రాష్ట్రకూటులు, కళ్యాణీ పశ్చిమ చాళుక్యుల ప్రత్యక్ష పాలనలో ఉండేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రాజులు, సామంతులు, దండనాయకులు అప్పట్లో చిలుకూరును రాజధానిగా చేసుకుని పాలించినట్లు శాసనాలు లిఖించి ఉన్నాయి. అబుల్ హసన్ తానీషా మంత్రులు అక్కన్న, మాదన్నలు చిలుకూరు బాలాజీ టెంపుల్ ను దర్శించుకున్నారు. అంటే భద్రాచలం రామాలయం కంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ పురాతనమైంది.

🌀 స్థలపురాణం :


సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.

అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు.మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే.నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించి ,నన్ను సేవించి తరించు’.. అని చెప్పి మాయమయ్యాడట! నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.

అలా వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్య పూజలందుకుంటు భక్తుల కొంగుబంగారంగా మారాడు. ఇక్కడ ఏకశిలలోనే శ్రీదేవి, భూరేవి. వేంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. చిలుకూరు స్వామి మహిమ అంతా ఇంతా కాదని ఆయన భక్తులు చెపుతారు. భక్తులు ముందుగా ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి, స్వామివారికి తమ కోరికను విన్నవించుకుంటారు.  కోరిక తీరగానే 108 ప్రదక్షిణలు చేసి, స్వామివారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. భక్తుడు తన కోరిక సఫలమయ్యేవరకు ఆ కోరికను తనకు, స్వామివారికి మధ్యనే రహస్యంగా ఉంచాలి. మూడో మనిషి చెవిన వెయ్యకూడదు అట ఇక్కడ దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు.

💠 వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే. దేవుని వద్ద అంతా సమానమే. ఆలయంలో భక్తుడు చూడవలసింది దైవాన్ని మాత్రమే. భగవంతునికి భక్తునికి మధ్య డబ్బు వ్యవహారం అవసరం లేదనే పద్ధతిని చిలుకూరు ఆలయం పాటిస్తోంది.ప్రజాభిప్రాయాన్ని, అర్చకుల అభిమతాన్ని గౌరవించి రాష్ట్రప్రభుత్వం స్వయంప్రతిపత్తినిచ్చింది.

💠 శ్రీరామనవమి తరువాతి రోజు అంటే చైత్ర మాసంలో పుష్యమి నక్షత్రంతో ఆరంభించి వారం రోజులపాటు పంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.రోజూ వాహన సేవలుంటాయి. చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి. కోరిన వరాలిచ్చే చిలుకూరి బాలాజీ వేంకటేశ్వర స్వామి 

💠 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది.

💠 చిలుకూరు స్వామిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తారు. అందువల్ల యువతకు ఆరాధ్య క్షేత్రమయ్యింది. 


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 30 May 2024

కర్తవ్యం, బాధ్యత (31-May-24, Enlightment Story)

కర్తవ్యం, బాధ్యత

🌺🍀🌺🍀🌺🌺

కర్తవ్యం, బాధ్యత - అనే రెండు మాటలూ మనకు ఒకేలా వినిపిస్తాయి. అర్థాలు ఒకేలా తోస్తాయి. వాస్తవానికి ఆ రెండూ వేరు. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు. కావాలని మనిషి నెత్తికెత్తుకొనేవి బాధ్యతలు. కాబట్టే కర్తవ్యాలకు ముగింపు(డిటాచ్ మెంటు) ఉంటుంది. బాధ్యతలకు కొనసాగింపు (అటాచ్మెంట్) ఉంటుంది. వివేక వంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు. తక్కినవారంతా జీవితాంతం బాధ్యతల్లో మునిగి తేలుతూ ఉంటారు. 


ఇద్దరు మహర్షుల చర్యలను పరిశీలిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముణ్ని ఓ ఇంటి వాణ్ని చేసింది- కన్నతండ్రి దశరథుడో, పిల్లనిచ్చిన జనకుడో కాదు. జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామి త్రుడు. అది ఆయనకు విధి నిర్దేశిం చిన కర్తవ్యం. ఆయన పుట్టుకకు లోకకల్యాణం,సీతారామకల్యాణం అనేవి రెండూ ప్రధాన లక్ష్యాలు. వీటిలో 

  • మొదటిది- రాముడి అవతార పరమార్ధంతో ముడివడినది.               
  • రెండోది- ఆ పరమార్థం నెర వేరేందుకు కావలసిన శక్తిని సమ కూర్చినది. ఆ శక్తి పేరు సీతమ్మ

విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానికి నాంది పలికాడు. యాగ సంరక్షణ మనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడి వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం. రావణ సంహారానికి అవసరమైన సాధన సంపత్తిని రాముడికి సమ కూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం.

సీతారామకల్యాణం పూర్తవగానే రంగంలోంచి ఆయన నిష్క్రమించాడు. వారి సంసారం ఏ విధంగా నడుస్తోందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో విశ్వామిత్రుడికి అనవసరం. అది రాముడి పని. 

రాక్షసుల రక్తాన్ని తోడేయడం, ఇక తానిచ్చిన అస్త్రశస్త్రాలే చూసుకొంటాయి. పంట కోత పూర్తయ్యాక- ఇక కొడవలికి పనేమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్మెంటు అనే భావానికి అసలైన అర్థం అదే!

రామరావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. మూడుసార్లు పారాయణ చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు

తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుణ్ని సంహరించాడా లేదా... వంటి సంశయాలు, కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు. తాను నేర్పించిన గాండీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్ర శక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారిద్దరూ!

పిల్లలను పెంచి పెద్ద చేయడం, సంస్కారాన్ని అలవరచడం, విద్యాబుద్ధులు నేర్పించడం వరకు తల్లిదండ్రుల కర్తవ్యం. 

పెరిగి పెద్దయి వారివారి జీవితాల్లో స్థిరపడినా- ఇంకా వారి బాగోగులు తమవే అనుకోవడం ఓ బలహీనత. తాము బతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవడం కర్తవ్యం కాదు. దాని కొనసా గింపు. 

కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలవుతాయి. ఆ తేడాను గుర్తించిన జీవితాలు సుఖశాంతులకు నోచుకుంటాయి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 29 May 2024

చిన్ని చిన్ని ఆనందాలు -2 (30-May-24, Enlightment Story)

చిన్ని చిన్ని ఆనందాలు -2 

🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺

 ప్రతి ఒక్కరూ తమను తాము దేహముగా భావిస్తూ దేహ సంబంధాలకు, వస్తువులకు, వైభవాలకు అత్యంత ప్రాముఖ్యత యిస్తున్నారు. దేహాన్ని నడిపించే చైతన్య శక్తి అయిన ఆత్మయే తానని తెలుసుకున్నప్పుడు, దైహిక సంపదతో పాటు ఆత్మ గుణాలైన శాంతి, సుఖము, ప్రేమ పెంపుదలకు కృషి చేస్తారు.


ఎవరైతే తిమనితాము నిజంగా అర్ధము చేసుకుంటారో, వారు  తమ కాళ్ళపై తాము నిలబడగలరు. అన్ని పరిస్థితులలో నిశ్చలంగా వుండగలరు. ఇక్కడ తమని అంటే స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారో, వారు తమలోనే వున్న సర్వ గుణములను, సర్వ శక్తులను సదా జాగృతం చేసుకొని తమలోతాము ఆనందంగా రమిస్తూ వుంటారు. ఈ సంగమ యుగములో పరమాత్మ ద్వారా మనకు లభించిన యధార్థ జ్ఞానములో మొదటి విషయము,  ఆత్మ, పరమాత్మ యొక్క సత్య పరిచయము. ఈ విషయానుభూతి ద్వారా అతీంద్రియ సుఖానుభూతిని అనుభవిస్తున్న మనము సౌభాగ్యశాలి ఆత్మలము...
.
జీవాత్మ భక్తితో అనంత అన్వేషణలో ఉన్నప్పుడు అనంతం వైపు మార్గంలో ఉన్నప్పుడు, ఈ మూడు రకాల బ్రాంతులు అనేక ఆటంకాలను ఎదుర్కోవాలి. నాకు సరిగ్గా 
హనుమంతుడు చేసినట్లుగా వ్యవహరించాలి. 

  • సత్వగుణ భ్రాంతికి వ్యతిరేకంగా ఎవ్వరూ వెళ్ళకూడదు.  ఎందుకనగా వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదు దానికి బదులు గా దూరంగా ఉండి పని చేస్తూ పోవాలి.దాన్ని వదిలించుకోలేం  అలాగని సంబంధం పెట్టుకోలేం, కనుక దానితో పాటే వెళ్తూ, అదే సమయంలో సూక్ష్మంగా భావించి దాని నుండి తొలగిపోవాలి. దాని ఉచ్చులో చిక్కుకోకూడదు. ఎందుకంటే ఈ రెండు రకాల ప్రవృత్తుల నుండి భక్తుడు దూరంగా ఉండాలి.
  • తమోగుణ ప్రవక్తులు మన ప్రగతికి నష్టం కలిగించేలా ఉన్నాయి. కనుక వాటిని నిర్ధాక్షణ్యంగా చంపవచ్చు. 
  • రజోగుణ బ్రాంతిని సగం చచ్చిన దానిలా వదిలి వేయాలి. దాన్ని పూర్తిగా నాశనం చేస్తే మనం రక్షణ లేని వారమవుతాం.

సర్పము అహానికి గుర్తు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే.

దైవమనే బంగారమెలా వుంటుందో తెలియనిదే మన సద్గురువనే బంగారువుంగరం యొక్క విలువను గుర్తించలేము. తేనెయొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెతీగ మాత్రమే తేనెగల పువ్వులన్నింటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఆ పువ్వు యొక్క నామరూపాలను పట్టించు కొనకుండా దానిలో దాగియున్న తేనెను గుర్తించగలదు. అలాగే మన మాశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపం, లౌకికమైన నామముల మాటున దాగియున్న దైవత్త్వాన్ని గుర్తించగలగాలంటే, సద్గురువులందరి రూపంలోనూ ఒకే దైవమెలా ప్రకటయ్యాడో వారి చరిత్రలనుండి గమనించాలి. 

వారు మనకు తెలిపిన సేవా విధానం తెలుసుకొని మనమనుసరించాలి. భాగవతం ఏకాదశ స్కంధంలో అవధూత గూడా తాను 24 మంది గురువులనుండి జ్ఞానమార్జించానని చెప్పారు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు గూడా తత్త్వ దర్శనులైన గురువులను శరణుపొంది, సేవించి చక్కగా ప్రశ్నించమని, అలా చేస్తే అట్టి గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. ఇందులో యింకొక్క సూత్రం యిమిడి యున్నది. ఎందరు గురువులను మహనీయులనూ దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనమాశ్రయించిన సద్గురువుయొక్క కృపవల్లనే లభిస్తాయి ఉత్తమురాలయిన ఇల్లాలిని ఎందరు గౌరవించి ఆదరించినా, అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే గదా! ఈ సూక్ష్మం తెలియకుంటే, గుర్తించుకోకుంటే, అనేకమంది మహనీయులను దర్షించినా గూడా చిత్త చాంచల్యమే కలుగుతూంది.
.
“విజయం అనుకునేదాని కన్నా సాధారణంగా వైఫల్యంగా పరిగణింపబడేదే మీ జీవితానుభూతిని మరింత ప్రగాఢం చేస్తుంది...
.
మానవజన్మ - పరమార్థం

మనిషి జీవితంలో,ప్రగతి అంటే ఉద్యోగంలోనూ,ఆస్తిలోను,అంతస్తు లోను కాదు.!
ఆ మనిషి జీవితంలో,ఆధ్యాత్మిక ప్రగతి ముఖ్యం...!!! మనిషి జీవితం,మిగతా జీవుల కంటే గొప్పది,భగవంతుడు,తనను చేరుకోవడానికి ఒక అవకాశంగా మనుష్య జన్మ నిస్తాడు..!

కావున  ఈ జన్మలో, ఆ స్వామిని, చేరుకోవడానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలి....
            అన్యధా..! శరణం నాస్తి...
            త్వమేవ..! శరణం మమ.......
.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 28 May 2024

చిన్ని చిన్ని ఆనందాలు -1 (29-May-24, Enlightment Story)

 చిన్ని చిన్ని ఆనందాలు

🌺🍀🌺🍀🌺🌺

కొందరు వాస్తవంలో బతుకుతారు. ఇంకొందరు భావ ప్రియంగా జీవిస్తారు. ప్రకృతిని ఉన్నదున్నట్లుగా చూసేవారు కొందరైతే ఉన్నదానికి మాధుర్యాన్ని జోడించి ఆనందించేవారు మరికొందరు.     
దృశ్య జగత్తులో అనుదినం పరిఢవిల్లే నవ్య దర్శన శోభను చూసి ఆనందం అనుభవించేందుకు 
కొందరికి స్ఫూర్తి లభించగా విరుద్ధ కోణంలో దర్శించే వారికి చిన్న ఆనందాలు సైతం మృగ్యమై ఎండమావులవుతాయి.

ఆనందానుభవానికి తీర్థ యాత్రలు, విహార యాత్రలు తోడ్పడతాయి. ప్రయాణ సమయంలో తారసిల్లే ప్రతి క్షణమూ అణువణువూ ఆనందాన్ని ఇస్తుందని గ్రహించాలి. దారిలో కనిపించే కొండలు, గుట్టలు, చెట్లు, మహా వృక్షాలు, సెలయేళ్ళు, సస్యశ్యామలమైన పంటచేల దృశ్యాలు, లేళ్ళు, దుప్పులు, అలవోకగా ముంగురులను కదిలిస్తూ హాయిగొలిపే మలయ మారుతాలు ఇవన్నీ... అనుక్షణం చిన్న చిన్న ఆనందాలను పంచే అంశాలే.

కొందరు జాతరలు, తిరునాళ్ళ వంటి సమూహ వేడుకలను హాయిగా ఆనందిస్తారు. మరికొందరు అంతర్ముఖులు ఏకాంత సమయాలను ఆనందపు గనిగా మార్చుకుంటారు. వారి వారి వ్యక్తిత్వాలను, మనస్తత్వాలను బట్టి చిన్ని ఆనందాలు లభ్యమవుతాయి.

వాతావరణంలోని ఓ చిలుక పలుకు, ఓ పసిబిడ్డ ఏడుపు, ఓ రైలు కూత, శునకపు అరుపు, అలల సవ్వడి అదాలుగా ఆలకించే వాడికి అన్నీ బాలకృష్ణుడి చిరు గజ్జెల మోతలే! చిదానంద స్వరాలే! ఆనందం నిర్వచనానికి అతీతమైనది. అది అనుభవంలోకి వచ్చినపుడు ఆస్వాదించి సొంతం చేసుకోవాలి. మలినమైన, నేరపూరితమైన మనసులో స్వచ్ఛమైన ఆనందాలు ప్రతిఫలించవు. వారు వేటిని ఆనందాలని భావించి అనుభవించేందుకు ఉత్సుకత చూపుతారో అవి హేయమైన, అప్రియమైన అనుభూతులు.తమోగుణ ప్రధానులైనవారికి సర్వజన మోదకమైన చిన్న ఆనందాలు లభించే అవకాశం దాదాపు మృగ్యమే!

రచనాభినివేశం, సంగీత ప్రియత్వం, క్రీడాసక్తి, దానగుణం, సేవా పరత్వం. ఇవన్నీ చిన్న ఆనందాలను పోగుచేసే అంశాలే! లలిత కళల అభ్యసనం, వాటిపట్ల ఆసక్తి సాధకుల్లో ఆనందానుభూతులను ప్రోది చేస్తాయి.

మనసు మహోత్కృష్టమైనది. అంతఃకరణకు మనసే కేంద్ర స్థావరం.మనసు కలుషితం కాకుండా చూసుకోవడం ఓ మంచిమనిషి కర్తవ్యం. మనసును ఆనందభరితం చేసుకోవాలంటే సత్య వర్తన,      సత్య భాషణ, దైవ ప్రియత్వం, సోదర భావం వంటి విశేష గుణాలు తోడ్పడతాయి. ఆ దైవీ గుణాలు ఆధ్యాత్మికంగానే లభ్యమవుతాయి.

సంగీతాన్ని ఆలంబన చేసుకొని త్యాగరాజు, అన్నమయ్య భగవంతుని కీర్తించే దివ్యానందాన్ని అనుభవించారు. వారు రచించిన గీతాలు శ్రోతలకు ఆనందాన్ని పంచాయి. తన గురించి లోకులు అనే  ఓ మంచి మాట చెవిన పడినప్పుడు మనిషికి కలిగే ఆనందం అనల్పమైనది. ఓ పేదవాడు, లేదా యాచకుడికి చేసిన చిన్నపాటి సాయం మంచి అనుభూతిని ఇస్తుంది. 

చంటిబిడ్డను లాలించే తల్లిదండ్రులకు కలిగే మధుర భావన పరిమాణం అల్పమా, అనల్పమా కొలవలేనిది.ఆనందం ఓ అంబుధి. దైవ ప్రసాదితమైన ఆనందం ఓ మహాసాగరం. చిన్న చిన్న నీటి బిందువులు అపార పారావారంగా ఏర్పడినట్లు చిన్న చిన్న ఆనందాలు ప్రవర్ధమానమై ఆనందాంబుధి ఏర్పడుతుంది. అందుకు సాధన తోడ్పడుతుంది. వాస్తవంలో కష్టాలను ఖాతరు చేయక ముందుకు సాగే సాధకుడికి అనుభవంలో ప్రతిక్షణమూ ఓ చిన్న ఆనందమే.

ఎవరైతే తమను తాము యధార్ధంగా అర్థం చేసుకుంటారో, వారే తమ స్వశక్తి పై నిలబడ గలరు.


సశేషం ..  పార్ట్ 2 రేపటి కథలో

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 26 May 2024

దయగలమారాజు (28-May-24, Enlightment Story)

దయగలమారాజు 

🌺🍀🌺🍀🌺🌺

పూర్వం ఒక రాజు ఉండేవాడు.పరమక్రూరంగా, దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..

అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు.కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...

మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు.


రాజు సమాధానం చెప్తున్నాడు..

నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది.నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది.నక్క కుంటిది అయిపోయింది...

ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది.కుక్క కుంటిది అయిపోయింది

అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది. అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు. ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది. ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది. గుర్రం కుంటిది అయిపోయింది

వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన  తోచింది.

నక్క కాలు కుక్క కరిస్తే , కుక్క కాలు మనిషి రాయి వల్ల  విరిగింది , మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే..గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...

ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...
అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...

ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...

ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..

మెట్ల మీద  జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం...

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...