అంతా ఈశ్వరేచ్ఛ
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺
మహర్షి వ్యాసుని పుత్రుడు సుఖదేవ్ జనకరాజు వద్దకు దర్శనానికి వస్తాడు. అప్పుడు రాజు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత అతని రాకకి కారణం అడుగుతారు. దానికి అతను మా తండ్రిగారు మీ దగ్గరకు విద్యార్థిగా నన్ను పంపారు అని చెప్తాడు. ఇంతలో ఒక సైనికుడు వచ్చి నగరం బయట అగ్గి తగులుకుందని చెప్పి మాకు ఏమీ ఆజ్ఞ అని అడుగుతారు.
మీరు మీ కర్తవ్యం చేయండి తర్వాత అంతా ఈశ్వరేచ్ఛ అని రాజు చెప్తాడు. మళ్లీ సైనికులు వచ్చి నగరం లోపలికి అగ్ని మంటలు ప్రవేశించాయని, మళ్లీ భవనంలోకి ప్రవేశించబోతున్నాయని సైనికులు చెప్పి మేము ఏం చేయాలి అని అడుగుతారు రాజు గారిని. రాజుగారు మొదటి చెప్పిన విధంగా మీ కర్తవ్యం మీరు చేయండి తర్వాత అంతా ఈశ్వరేచ్ఛ అని చెప్తాడు. అది విన్న సుఖదేవ్ లో కంగారు మొదలవుతుంది.
ఇతనా రాజా జనకుడు! నగరంలో అగ్ని తగులుకుంది ఈయనేమో చక్కగా ఇక్కడ కూర్చున్నారు అని మనసులో అనుకుని, వెంటనే లేచి అక్కడినుండి వెళ్ళబోతాడు .అది చూసి రాజు ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు.అక్కడ గదిలో నా మూట, భిక్షా పాత్ర ఉన్నాయి అవి కాలిపోతాయేమో అని తెచ్చుకోవడానికి వెళుతున్నాను అంటాడు.
అప్పుడు రాజు నీకు ఆ మూట మీదే అంతా మోహం ఉంటే ఈ శరీరం మీద ఇంకెంత మొహం వుండి ఉంటుంది అని నవ్వుతూ కూర్చోకూర్చో ఎక్కడా అగ్ని రగులుకోలేదు నేను నిన్ను పరీక్షించాను. చిన్న చిన్న వస్తువులపై ఇంత మొహం ఉంటే విధేహుడువి ఎలా అవుతావు అని అంటాడు. మా తండ్రిగారు ఇక్కడికి ఎందుకు పంపారు నాకు ఇప్పుడు అర్థమైపోయింది రాజా ...నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని చెప్తాడు.
కానీ మరొక పరీక్ష నువ్వు ఇవ్వవలసి ఉంటుంది ఆ పరీక్ష ఏంటంటే నూనెతో నిండిన ఒక పాత్రను సుఖదేవ్ కి ఇచ్చి నగరం నుండి బయటకు పంపిస్తాడు. దానికి ఒక షరతును కూడా పెడతారు, ఆ పాత్ర నుండి ఒక్క చుక్క నూనె క్రిందపడిన వెనకనే కత్తి పట్టుకొని నడుస్తున్న సైనికుడు అతని మెడ నరుకుతాడు అని షరతు. రాజు అతని ధ్యానం భంగం చేయడానికి ఏవేవో ఉపాయాలు కూడా చేయిస్తారు. కానీ సుఖ దేవుడు ఒక్క చుక్క నూనె కూడా క్రింద పడనీయకుండా జనకరాజు దగ్గరికి చేరుకుంటాడు. ఒక్క చుక్క కూడా క్రింద పడలేదు జనక రాజ అని చెబుతాడు. అయితే నువ్వు మార్గంలో ఏమేం చూసావ్ అని అడుగుతాడు .నా ధ్యానం అంతా నూనె చుక్క మీదే ఉంది . మెడ దగ్గర కత్తి వేలాడుతున్నప్పుడ ఇటు అటు ఎలా చూడగలరు అని సుఖదేవ్ అంటాడు. అప్పుడు రాజు అంటాడు అదేవిధంగా ఎవరైతే ఈ జీవితం యొక్క నశ్వరత్వాన్ని తెలుసుకుంటారో... వారికి ఈ సంసారం యొక్క ఆకర్షణలు కనిపించవు. నువ్వు యోగ్యుడైన విద్యార్థి వి, నేను నీతో పాటు నా అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఆ అనంతమైన చర్చ ప్రారంభమైంది .
చైతన్యరూపమైన బ్రహ్మ ద్వారా ఈ జగత్తు నడపబడుతున్నది అదే చేతన నాలోను ఉంది మరి అతను ఎవరు? నేనెవరు? అని సుఖదేవ్ ప్రశ్నిస్తాడు దానికి రాజు నేను, అతను అని వేరు వేరు అస్తిత్వం ఉండదు. నేను అదే.నువ్వు ఏ సత్ చిత్ ఆనందాన్ని వెతుకుతున్నావో... వాస్తవంలో అది స్వయంగా నువ్వే అయి ఉన్నావు. బ్రహ్మ ఈ జగత్తుని రచించారు, నా యొక్క రచన కూడా చేశారు కదా.. మరి నేను ఆ బ్రహ్మ ఎలా అవ్వగలను? మరొక ప్రశ్న వేశాడు సుఖదేవ్.
దానికి రాజు ఒక సమయంలో కేవలం బ్రహ్మే ఉండేవాడు ఇంకా ఏమీ ఉండేది కాదు చంద్రుడు, తారలు,భూమి, ఆకాశం ఏవి ఉండేవి కాదు కేవలం బ్రహ్మే ఉండేవారు. అతను స్వయంగా తన సృష్టిని రచించారు. మరియు స్వయంగా భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలములను సృష్టి చేశారు ఆ స్వయం వి నువ్వే మరియు నేను కూడా. ఈ సత్యాన్ని చూడలేకపోతే ఈ కనిపించే జగత్తునే సత్యం అనుకొని అందులోనే ఇరుక్కుపోతారు. కానీ ఎవరైతే ఈ సంసారం యొక్క ఆవరణలో దాగి ఉన్న సత్యాన్ని తెలుసుకుంటారో, గుర్తిస్తారో వారే శుద్ధ చైతన్యం యొక్క ప్రాప్తిని పొందగలరు అని రాజు చెప్తారు. అంటే ఆత్మ కంటే వేరే ఎవరికీ అస్తిత్వం లేదన్నమాట.
అవును ఇంకా చెప్పాలంటే బ్రహ్మ మరియు వ్యక్తి లోపల ప్రకాశితమవుతున్న మూలతత్వం ఆత్మ, 'అయమాత్మ బ్రహ్మ' అందువలన ఓ సుఖదేవ్ మనసును ఆత్మపై కేంద్రీకరించు మరియు దాంట్లోనే స్థిరంగా ఉండు. ఎందుకంటే ఆ ఆనందానివి నువ్వే. అని రాజు చెప్తాడు. ఎప్పటి వరకు నేను బ్రహ్మను అనే అనుభవం కలుగదో అప్పటివరకు మనసు మరియు ఇంద్రియాలపై నియంత్రణ ఉండాలి. గురు బోధలను వినడం శాస్త్రాల అధ్యయనం అనేవి ప్రతి దినం మననం, ధ్యానం చేయాలి.
హరిః ఓం జై గురుదేవా హరిః ఓం శ్రీ గురుభ్యోన్నమః హరిఃఓం
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
Excellent sir.
ReplyDelete