Monday, 11 December 2023

నమస్కారం, భారతీయ సంస్కారం! (12-Dec-23, Enlightenment Story)

 *నమస్కారం భారతీయ సంస్కారం!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀           

నమస్కారం భారతీయ సంస్కారం! ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు నమస్కరించటం  భారతీయ సంప్రదాయం. ఒకరినొకరు అభివాదం చేసుకునే పద్ధతి, పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అవి వారి వారి సంస్కృతీసంప్రదయాల పైన నాగరికత పైన ఆధారపడి ఉంటాయి.

వేదంలో అయిదు ప్రణవాలను చెప్పారు. అవి :  ఓంకారం, స్వాహాకారం,స్వధాకారం, వషట్కారం, నమస్కారం.

'నమః' అనే శబ్దం దేవతకు మన సమర్పణను తెలియజేస్తుంది. ఇది దేవతను ఆహ్వానించే శబ్దం కూడా. నమస్కారాన్ని మినహాయించి మిగిలిన నాలుగింటికీ వివిధ సందర్భాలు, నియమాలు ఉన్నాయి. నమస్కారం అలాంటి నిబంధన లేవీ లేని ప్రణవం. ఒక గొప్ప వస్తువులోని గొప్పతనాన్ని గుర్తించి తలవంచడమే 'నమ్ర' భావం. దేవత యొక్క మహిమను తెలుసుకొని, నమ్రులమయ్యామనే భావనే 'నమస్కారం'లోని అంతర్యం.

మరియొక అర్థంలో- 'మనః' శబ్దమే 'నమః' అయింది. దీనిని 'వర్ణవిపర్యయ న్యాయం' అంటారు. మనస్సును భగవంతునికి సమర్పించడమే నమస్కారంలోని అంతర్యం. మనస్సమర్పణ అంటేనే అహంకార త్యాగం. కనుక అహంకారాన్ని భగవదర్పణం చేయడమే దీనిలోని అంతరార్థం.

 క్రమంగా ఈ భావన అహాన్ని బ్రహ్మముతో లీనం చేసే కైవల్య సిద్ధికి హేతువౌతుంది. కనుకనే ఈ నమస్కారానికి అంత ప్రాధాన్యం

కరచాలనం, ఒక చేయి నుదిటి పై అడ్డంగా చేర్చటం(salute), చేతి పైనో చెక్కిలిపైనో మృదువుగా ముద్దులు పెట్టటం,  ప్రేమతో ఆలింగనం చేసుకోవటం, వంగి సలాం చేయటం,  ఇలా ఎన్నో పద్ధతులు. అయితే ఈ పలకరింపులో కూడా భారతీయులది ఒక ప్రత్యేక శైలి. మన పలకరింపు శాస్త్రీయతతో  మేళవించిన సంప్రదాయం.

పెద్దలని చూడగానే చిన్నవారు (వయసులో,అధికారంలో,జ్ఞానంలో,ధనంలో, ఎందులోనైనా సరే) చేతులు జోడించి నమస్కరించటం భారతీయులందరు చేసే పని. 

నమ అంటే వంగి ఉండటం అని అర్థం.అంటే పెద్దల ఎదుట అహంకరించకుండా  అణిగి మణిగి ఉండటం.

నాది అనేది లేనిది అనే అర్థం కూడా చెపుతారు ‘నమ’ అనే పదానికి. అంటే ఎదుటి వారికి తనను తాను సమర్పించు కోవటమన్నమాట.

’ఎందుకు నమస్కరించాలి?  నోటితో ‘హాయ్’ అనో ‘హలో’ అనో అంటే సరిపోతుంది కదా!‘ అనే సందేహం కలగవచ్చు.

దానికి సమాధానం తెలుసుకోవాలి. మానవ శరీరం ఒక విద్యుదయస్కాంత ఘటం. ధన,ఋణ ధృవాలు కలిస్తే విద్యుత్ ప్రవాహ మార్గం (సర్క్యూట్) పూర్తి అవుతుంది.

మనిషి శరీరంలో అటువంటి ధృవాలు  చేతి వ్రేళ్ళు. వాటిని కలపటం వల్ల సర్క్యూట్ పూర్తి అవుతుంది.


విద్యుదయస్కాంత ఘటంలో విద్యుత్ చలనం మొదలవుతుంది. రెండు ఘటాలు దగ్గరైనప్పుడు ఒకదాని ప్రభావం మరొక దానిమీద ఉంటుంది.  ఎక్కువ  శక్తివంతమైన ఘటం సమక్షంలో తక్కువ శక్తివంతమైన ఘటంలో ప్రకంపనలు కలుగుతాయి. అవి  సరిగా మేలు కలిగించే విధంగా ఉండటానికి చేసిన ఏర్పాటు ఈ నమస్కారం.              

  • నమస్కరించటంలో కూడా ఎదుటివారిని బట్టి పద్ధతి మారుతుంది. 
  • దేవతలకు  రెండు చేతులు సహస్రారంపై జోడించాలి. 
  • పెద్దలకు  నుదుటిపై అంజలి ఘటించాలి. 
  • సాటి వారికి అభివాదం చేయటానికి రెండు చేతులను హృదయ స్థానంలో జోడించాలి. 
  • తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆ స్థాయిలో గౌరవించ దగిన వారింకెవరైనా  వారికి సాష్టాంగ నమస్కారం చేయటం మన అలవాటు. దీనినే దండప్రణామమ్ అని కూడా అంటారు. అంటే, కర్ర లాగా నేలమీద పడి, ఎనిమిది అవయవాలు భూమిని తగిలేట్టుగా నమస్కరించటం

స్త్రీలు పంచాంగాలతో చేస్తే సరి పోతుంది.   స్త్రీల ఉదరం, వక్షస్థలం మనిషి అస్తిత్వానికి, పోషణకి నిలయాలు కనుక అవి నేలకు తగులరాదు. దీనికే  ప్రణిపాతం అని పేరు. అత్యుత్కృష్ట గౌరవాన్ని ప్రదర్శించటానికిది సంకేతం.  

నిజానికి ఇలా చేయటం వల్ల నమస్కరించిన వ్యక్తికి ఎదుటివారి నుండి శక్తి ప్రసారం జరుగుతుంది. 

అందుకే ఎప్పుడూ తమకన్న ఏదో విధంగా అధికులైతేనే నమస్కరించాలి. తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఎక్కువ స్థాయిలో ఉన్నవారు నమస్కరిస్తే ఆయు క్షీణమని పెద్దలు చెపుతారు. తక్కువ శక్తి ఉన్నది ఎక్కువ శక్తి ఉన్న దానికి ఇవ్వటం వల్ల అల్లకల్లోలమే కదా!

నమస్కరించటాన్ని మొక్కటం, ప్రణామం చేయటం, దండం లేక దన్ణమ్ పెట్టటం అని కూడా అంటారు. కాళ్ల మీద పడి పోవటాన్ని ప్రణిపాతం  చేయటం అంటారు. ఇది పరిపూర్ణ శరణాగతిని  తెలియజేస్తుంది.

భారతీయులు అభివాదం చేసే పద్ధతి చాలా శాస్త్రీయ మైనదని, శ్రేయోదాయకమని అందరూ అంగీకరించిన విషయం. కాబట్టి ఇక నుంచి మన పలకరింపు మన సంప్రదాయానికి అనుగుణంగా ఉండేలా చూడండి. ఆ సంప్రదాయం ముందు తరాలకి కూడా చేరేలా చూడండి.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...