🔥నేను కాదురా , నీవే నా గురువు 🔥
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
🌵 చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ . దాని పేరు బృందావన కాలనీ . ఆ కాలనీలో ఏ ఇంటిని కనుగొనాలన్నా రెండు ల్యాండ్ మార్కులు . ఒకటి కమలాసని నిలయం . రెండవది దీనదయాళ్ హాస్పిటల్ . కమలాసని నగసుత , హరికృష్ణ దంపతుల ఇల్లు . నగసుత సంగీత విద్వాంసురాలు . ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది .
♦️.ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లల క్లాసు జరుగుతున్నది . ఒక 8 ఏళ్ళ పిల్లవాడిని తల్లి తీసుకొని వచ్చింది . ఆ పిల్లవాడి పేరు వాసుదేవ్ అని చెప్పింది . పిల్లవాడిని సంగీతం క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది . వాసుదేవ్ ఏకసంథాగ్రాహి .
♦️ కమలాసని ఇంటి ముందునుండే దీనదయాళ్ ఆసుపత్రికి అంబులెన్లు 🚑 వెళ్తూవుండేవి . ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాసు సాగుతున్నాసరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడటం ఆపేసి *నారాయణ నారాయణ నారాయణ అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు . క్లాసుకి అంతరాయం కలిగేది . ప్రతిరోజూ ఇలాగే జరుగుతుంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది . వాసుదేవ్ ఏడుస్తూ క్షమించండి టీచర్ అంటూ దణ్ణం పెట్టాడు . టీచర్ కి జాలివేసింది . నాయనా ! పాఠం చెబుతున్నప్పుడు నువ్వు ఎందుకలా చేస్తావు అన్నది కళ్ళు తుడుస్తూ .
అప్పుడు వాసుదేవ్ ' టీచర్ ! మా అమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినపడినప్పుడు మనం చేస్తున్న పనిని ఆపి , ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ స్మరణ చేయాలని , మా ఇంట్లో అందరం అలాగే చేస్తాం టీచర్, అందుకే అలాచేశాను ' అన్నాడు చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ . టీచర్ కళ్ళే కాదు , అక్కడి పిల్లలందరి కళ్ళూ వాళ్ళకి తెలియకుండానే వర్షించాయి .
నాయనా , వాసుదేవ్ ! నేను కాదురా , నీవే నా గురువని అంటూ కౌగిలించుకున్నది . టీచర్ అతడి తల నిమురుతూ . *టీచర్ , నేను పెద్ద అయిన తరువాత హాస్పిటల్స్ కి అంబులెన్సు కొనిస్తాను . ఇది మా అమ్మ కోరిక టీచర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చేతులూపుతూ . తథాస్తు అన్నది టీచర్ మనసులోనే .
అలా 6 ఏళ్ళు గడిచాయి . సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్ కి . అతని తండ్రిగారికి ట్రాన్స్ఫర్ అవడంతో వేరే ఊరు వెళ్ళిపోయారు వాళ్ళు . అలా కాలం గిర్రున తిరిగిపోయింది .
♦️ ఒక రోజు పొద్దున ఓ పిల్లవాడి చేయి పట్టుకొని తెల్లని డ్రస్సులో హుందాగా ఉన్న వ్యక్తి కమలాసని నిలయం ఇంటి గేటు తీసుకొని లోపలికొచ్చాడు . అమ్మా , ఎవరో వచ్చారు అని చెప్పింది ఇంట్లోని అమ్మాయి . అంతలో గురో అజగురో త్యాగరాజ గురో గురో అంటూ పాడటం మొదలుపెట్టాడు వచ్చినతను . వాసుదేవ్ ! నువ్వా అంటూ లోపలినుండి గబగబా పరుగులాంటి నడకతో వచ్చింది నగసుత టీచర్ .
టీచర్ అంటూ ఆమె కాళ్ళకు ప్రణమిల్లాడు . అతడిని లేవనెత్తి ఎలావున్నావు వాసుదేవ్ ? ఇన్నాళ్ళూ ఎక్కడున్నావు ? నన్ను మరచిపోయావా ? అని అడిగింది టీచర్ . అతని కళ్ళవెంట కన్నీటిధారలు కారుతున్నాయి .
అమ్మా ! నేనిప్పుడు కార్డియాలజిస్టు . ఇక్కడే దీనదయాళ్ హాస్పిటల్ కు డాక్టరుగా వచ్చాను . ఇప్పుడు నాకు అమ్మలేదు . తొలి గురువుగా మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని 10 అంబులెన్సులను హాస్పిటల్ కు డొనేట్ చేశాను . నాకు భగవంతుడు శక్తినిస్తే ఇంకా కూడా చేస్తాను . వీడు నాకొడుకు దయాసాగర్ . సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు . ఆ పసివాడిని ఆనందంగా గుండెలకు హత్తుకుంది నగసుత టీచర్ .
అందుకే మాతృదేవోభవ అన్నది వేదం . ఎంతవారికైనా తొలిగురువు అమ్మేకదా ! కన్నతల్లి అయినా , అమ్మలాంటి గురువులైనా పసి మనస్సులలో సంస్కారబీజాలు నాటేది వారే . అందుకే కాలనియమంలేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్ములు .
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment