Saturday, 2 December 2023

పూల కిరీటం – పండిత గౌరవం (02-Dec-23, Enlightenment Story)

 *పూల కిరీటం – పండిత గౌరవం*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సదాశివం సేలంలో నివసించే ఒక బ్రహ్మచారి యువకుడు. మహాస్వామి వారిపై అతనికి ఎనలేని భక్తి. ఒక హోటలు గదిలో అద్దెకు నివసించేవాడు.

సేలంలోని కంచి మఠంలో 1990 లో ఒక పెద్ద హోమం జరిగింది. దాదాపు 60 మంది వేద పండితులను, విధ్వాంసులను దూరప్రాంతాల నుండి పిలిపించారు. ఆ హోమం 11 రోజుల పాటు జరిగింది. ఆ యాగానికి కావాల్సిన పూలను సర్దుబాటు చెయ్యడం సదాశివం బాధ్యత.

సశాస్త్రీయంగా వైదిక నిష్ఠతో హోమం ముగిసింది. నిర్వాహకుల తదుపరి కర్తవ్యం మరుసటి రోజు ఆ తీర్థ కలశాలను, హోమ రక్షను మహాస్వామి వారికి సమర్పించి వారి ఆశీర్వాదం పొందటం. ముగ్గురు ప్రముఖులతో కలిసి వైదిక పండితులు బృందం మూడు వాహనాల్లో కాంచీపురానికి బయలుదేరారు. మొత్తం హోమానికి పూలను సమకూర్చిన, పూల అలంకారాలు చేసిన సదాశివం కూడా వారితో బయలుదేరాడు. కాంచీపురం వెళ్ళే మార్గమంతా బాగా వర్షం పడుతోంది. కొన్ని గంటల ప్రయాణం తరువాత వారు హోమ భాగాలతో కంచి చేరుకున్నారు.

మహాస్వామి వారిని దర్శించుకుని వారు తెచ్చిన కలశ తీర్థంతో పాటు హోమము భాగములన్నిటిని పరమాచార్య స్వామి ముందు పెట్టారు. వాటిని చూడగానే మహాస్వామి వారు చాలా మహాదానందపడ్దారు. ఎందుకంటే వారికి మాత్రమే తెలుసు జరిగిన ఆ హోమము యొక్క ఫల్ము బలము ఎంతటిదో. .

“ఎవరు చేసారు దీన్ని?” మహాస్వామి వారు అడిగారు. 

వాహనాల్లో వచ్చిన వారు సమాధాన పూర్వకంగా సదాశివం వైపు చెయ్యి చూపించారు. నడుముకు లుంగి చుట్టుకుని పైన ఎర్ర చొక్కా వేసుకున్న అతను గుంపు నుండి ముందుకు వచ్చాడు.

పరమాచార్య స్వామి వారు ఆ పూల కిరీటాన్ని తమ తలపై ఉంచుకుని, పెదవుల పై చిరునవ్వుతో “నాకు బాగా కనిపిస్తోందా?” అని అడిగారు.

ఆనందంలో ఏమి మాట్లాడాలో తెలియక చుట్టూ ఉన్నవారు బావుందన్నట్టు తల పంకించారు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసారు. ఈలోగా సదాశివం తన చొక్కా విప్పి, ముందుకువెళ్ళి మహాస్వామి వారి ముందు నిలుచున్నాడు. శ్రీవారితో ఏమి చెప్పాలో అతనికి తెలియదు. చేతులు కట్టుకుని వారి ముందు నిలబడ్డాడు. కళ్ళల్లో నుండి కన్నీరు ఉబికి వస్తూ ఉంది. పరమాచార్య స్వామి వారు వారి తలపై నుండి ఆ పూల కిరీటం తీసారు. సదాశివాన్ని చూసి చిన్నగా నవ్వి, కొద్దిగా ముందుకు వొంగమన్నారు. వెంటనే తమ చేతులలో ఉన్న ఆ కిరీటాన్ని అతని తలపై ఉంచారు. అహా ఎంతటి అదృష్టం!!

అక్కడున్న వారందరికి తన్మయత్వంతో ఒళ్ళు పులకరించింది. అప్పటి దాకా పండితులు, విద్వాంసులకు మాత్రమే మహాస్వామి వారు తమ స్వహస్తాలతో పూల కిరీటం పెట్టి గౌరవించేవారు.

బహుఃశా తనను పూలతో ఇలా ఆరాధించి పూజిస్తున్న ఇతనికి కూడా ఆ గౌరంవం ఇవ్వాలని స్వామివారికి అనిపించిందేమో!!!✍️

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

1 comment:

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...