*నేరం*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺*“ధర్మానికి హాని కలిగించే చర్య నేరం” అని పురాణ భాష్యం. ‘నీతిబాహ్యమైన చర్యలన్నీ నేరమనియు, ప్రజలలో ధర్మచ్యుతి కలిగినప్పుడు సమాజంలో అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుందనియు, విచ్ఛిన్నకర శక్తులు ప్రళయతాండవం చేస్తాయని’ ధర్మశాస్త్రాలు హెచ్చరించాయి.*
*“ధర్మాన్ని ప్రజలు స్వచ్చందంగా నిర్వర్తించి నంతవరకు నేర ప్రవృత్తికి చోటు లేదనియు, న్యాయస్థానాల అవసరం ఉండదనియు“ నారద స్మృతి తెలిపినట్టుగా, పురాతన కాలంలో ధర్మోద్ధరణ కోసం వేదాల్ని, స్మృతుల్ని ఆశ్రయించేవారు పాలకులు.*
*సర్వశుభాలకు, లోక శ్రేయస్సుకు ధర్మమే నిలయమని భావించి ధర్మనిష్ఠ పెంపొందించడానికి పాటుపడేవారు.*
*‘ధర్మం నుంచి సంపద, సుఖము ప్రభవిస్తాయని’ రామాయణం తెలుపగా, '
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే' అని బోధించాడు గీతాచార్యుడు.
'సజ్జన సంరక్షణ, దుష్టజన శిక్షణ కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తానని' పలికినట్టే అనేక అవతారాలెత్తాడు శ్రీమహావిష్ణువు.*
రామావతారంలో రావణ కుంభకర్ణాది దానవులను,
కృష్ణావతారంలో శిశుపాల దంతవక్త్రులు,
కంసుడు మున్నగు దుష్టులను ,
వరాహావతారంలో హిరణ్యాక్షుని,
నరసింహావతారంలో, హిరణ్యకశిపుడ్ని సంహరించి ధర్మోద్ధరణ చేసాడు.*
*‘రాజులు న్యాయపాలన చేయాలనియు, దోషులను శిక్షించి ప్రజలను రక్షించాలనియు ,దోష నిర్ధారణకు సాక్షులను విచారించాలని” గౌతముడు చేసిన సూచనలు న్యాయాధీశులకు మార్గదర్శనం చేస్తాయి. ‘మరణ దండనార్హుడైన అపరాధితో కూడా చిరునవ్వుతో న్యాయాధీశుడు సంభాషించాలనియు, కోపాన్ని ప్రదర్శించరాదని’ విష్ణు ధర్మ సూత్రాలు చేసిన సూచనలు సర్వదా అనుసరణీయమే.*
*“సుశిక్షకుడైన పాలకుడు ప్రజలను ధర్మపథంలో నడిపించగలడనియు, అధర్మ వర్తనుడైన రాజైనచో ప్రజలు అధర్మపరులగుతారనియు, అట్టి రాజ్యాలలో వర్షాలు కురవవనియు , పంటలు పండవనియు , అరిష్టం కలుగుతుందని” శుక్రనీతి బోధించిన సారాన్ని గ్రహించి ధర్మరక్షణకై సద్వర్తనను అలవరచుకోవాలి పాలకులు.*
*“పరిస్థితుల ప్రాబల్యం వల్ల నేరం జరిగినప్పటికీ అది శిక్షార్హమేననియు, సాంఘిక విలువలు మారేటప్పుడు నేరం యొక్క నిర్వచనం, నేరస్థుడ్ని చూసే దృష్టికోణం మారుతుందని” గ్రంథాలు తెలిపినట్టు, “ ఒక సంస్కృతిలో యుగస్వభావాన్ని అనుసరించి ఒక చర్య నేరం కావచ్చు, కాక పోవునూ వచ్చునని’ ధర్మశాస్త్రాలు వచించినట్టుగానే జరిగిన సంఘటనలున్నాయి. బ్రిటీష్ పాలనా కాలంలో ప్రజలు చేసే పోరాటాన్ని దేశభక్తిగా భారతీయులు ప్రకటించుకోగా, రాజద్రోహంగా గుర్తించి చెరసాలకు తరలించి శిక్షలు విధించారు బ్రిటీషు పాలకులు.*
*‘నాగరికత ప్రసాదించిన విషఫలమే నేరమనియు, సమాజంలో కనిపించే నేరమేదైనప్పటికీ, అందుకు కారణ భూతమైన సమాజానిదే తప్పిదమనియు, అసమానతల ప్రభావమే నేరాన్ని ప్రోత్సహిస్తుందని’ వినిపించే వాదనలకు ప్రాముఖ్యతనిచ్చి సమసమాజస్థాపనకు పూనుకున్నప్పుడే నేరస్థులు లేని సమాజాన్ని దర్శించగలం.*

🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment