*#కేదార్‌నాథ్‌ని #జాగృత్_మహాదేవ్' అని ఎందుకు పిలుస్తారో తెలుసా?*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺
ఒకసారి ఒక #శివభక్తుడు కేదార్‌నాథ్ ధామ్ కోసం ప్రయాణమైతూ తన గ్రామం నుండి బయలుదేరాడు ఆ కాలం లోన్ రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన బయలుదేరారు.దారిలో ఎవరు కలిసినా కేదార్‌నాథ్ వెళ్లే మార్గాన్ని అడిగారు.మనసులో శివుని ధ్యానిస్తూనే ఉన్నాడు.అతను వెళ్లి నెలలు గడిచిపోయాయి.చివరగా ఒకరోజు కేదార్ ధామ్ చేరుకున్నాడు.కేదార్‌నాథ్‌లోని ఆలయ తలుపులు 6 నెలలు తెరుచుకుంటాయి మరియు 6 నెలలు మూసి ఉంటాయి. గుడి ద్వారాలు మూసే సమయానికి వచ్చాడు. నెలల తరబడి ప్రయాణం చేసి చాలా దూరం నుంచి వచ్చానని పండితుడికి చెప్పాడు. పండితులవారిని ప్రార్థించారు - దయచేసి తలుపులు తెరిచి భగవంతుని దర్శనం చేసుకొనివ్వమని. కానీ ఒక్కసారి మూస్తే మూతపడుతుందనేది అక్కడి నియమం.ఒక నియమం అనేది అలాగే ఉంటుంది. చాలా ఏడ్చాడు. ఒక్కసారే భగవంతుని దర్శనం చేసుకోవాలని శివుడిని పదే పదే స్మరించుకున్నడు. అతను అందరినీ ప్రార్థిస్తున్నాడు, కానీ ఎవరూ వినలేదు.
పండితుడు ఆయనతో మీరు 6 నెలల తర్వాత ఇక్కడికి రండి, 6 నెలల తర్వాత ఇక్కడ తలుపులు తెరుచుకుంటాయి అన్నారు. ఇక్కడ 6 నెలల పాటు మంచు కురుస్తుంది అని చెప్పి ప్రజలందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. అతను అక్కడే ఏడుస్తూనే ఉన్నాడు.రాత్రి అయ్యింది చుట్టూ చీకటిగా మారింది. కానీ అతను తన శివుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనే నమ్మకంతో ఉన్నాడు.
అతను చాలా ఆకలి తో మరియు దాహంతో ఉన్నాడు.ఎవరో వస్తున్న శబ్ధం అతనికి వినిపించింది.ఒక సన్యాసి తనవైపు రావడం చూశాడు.ఆ సన్యాసి అతని దగ్గరకు వచ్చి కూర్చున్నారు.నాయనా! ఎక్కడి నుండి వచ్చావు? అనగా,బాబా గారూ అని అతని గాథ వివరించగా బాబా వారు అతనికి ఆహారం ఇచ్చారు. ఆపై బాబా అతనితో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. బాబాకు అతనిపై జాలి కలిగి ఇలా చెప్పాడు,నాయనా!నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఉదయం ఆలయం తెరుస్తారు మీరు తప్పకుండా సందర్శిస్తారు అని ధైర్యం చెప్పాడు.
మాటల్లో పడి ఈ భక్తుడు ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు.సూర్యుని మసక కాంతితో భక్తుని కళ్లు తెరుచుకున్నాయి.అక్కడా ఇక్కడా బాబాను చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు.అతనికి ఏమీ అర్థం కాకముందే,పండితులవారు తన బృందంతో రావడం చూశాడు.ఆ భక్తుడు పండితుడికి పాదాభివందనం చేసి ఇలా అన్నాడు
6 నెలల తర్వాత గుడి తెరుస్తామని నిన్న మీరు చెప్పారు? మరియు ఇంతలో ఇక్కడ ఎవరూ రారు, అని కూడా అన్నారు కానీ మీరు ఉదయమే వచ్చారు. అని అడుగగా పండితుడు అతనిని నిశితంగా చూసి, గుర్తించడానికి ప్రయత్నించి అడిగాడు - గుడి తలుపు మూసి ఉండగా వచ్చినది నువ్వేనా? నేను ఎవరిని కలిశాను. 6 నెలల తర్వాత తిరిగి వచ్చాను! ఆ వ్యక్తి ఆశ్చర్యంగా అన్నాడు - లేదు, నేను ఎక్కడికీ వెళ్ళలేదు. నిన్నే కలిశాను, రాత్రి ఇక్కడే పడుకున్నాను. నేను ఎక్కడికీ వెళ్ళలేదు అని. పండితుడి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది.
నేను 6 నెలల క్రితం గుడి మూసివేసి వెళ్ళాను మరియు ఈ రోజే 6 నెలల తర్వాత వచ్చాను. ఆరు నెలలు ఇక్కడ ఎలా బతకగలవు? పండితుడు మరియు వచ్చినవారు అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్క వ్యక్తి ఇంత చలిలో ఆరు నెలలు ఎలా బతకగలడు? అప్పుడు ఆ భక్తుడు సన్యాసి ని కలుసుకున్న సంగతి, ఆయనతో చేసిన పనులన్నీ చెప్పాడు.ఒక సన్యాసి వచ్చాడని -
పొడుగ్గా,ఒక చేతిలో త్రిశూలంతో,ఒక చేతిలో డమరుకం ధరించి, జింకశాల ధరించి ఉన్నాడు.
పండితుడు మరియు అందరూ ఆయన పాదాలపై పడ్డారు.ప్రాణం పెడుతున్నాం కానీ భగవంతుని దర్శనం చేసుకోలేకపోయాం,నువ్వే నిజమైన భక్తుడివి అని అన్నారు.మీరు సాక్షాత్తూ శివుడిని చూశారు.
ఆయన తన యోగ-మాయతో మీ ఆరు నెలలను ఒక రాత్రిగా మార్చాడు. కాల వ్యవధిని కుదించారు.
మీ స్వచ్ఛమైన మనస్సు, మీ విశ్వాసం మరియు నమ్మకం కారణంగా ఇదంతా జరిగింది. మీ భక్తికి ధన్యవాదాలు అని అన్నారు.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
ఇలాంటి దే చి దంబర నటరాజ స్వామి వారి ఆలయం లో కూడా నందనార్ అనబడే చెప్పులు కుట్టే వానికి, శ్రీ కాళ హస్తి లో బోయవాడు కన్నప్ప కూ జరిగింది..
ReplyDelete