*కష్ట - సుఖములు*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఒకసారి శ్రీకృష్ణుడు కుంతిదేవిని చూడడానికి వెళ్ళినపుడు మీ కష్టములు త్వరలో తీరే రోజు దగ్గరలో వుంది అని అంటాడు. అపుడు ఆమె "కష్టములు వుండని కృష్ణ అపుడే మేము నిన్ను క్షణం మరవకుండా పూజిస్తాము. సుఖములో నిన్ను మరచిపోతామనే నా భయం" అని అంటుంది
రామాయణంలో రాముడు సీతను అరణ్య వాసమునకుకు వద్దు అని అంటాడు. నీవు అక్కడికి నడచలేవు. పడుకోవడానికి హంస తూలికా తల్పములాంటి పరుపులు వుండవు. పనులు చేయడానికి దాసి జనము వుండరు. ఎంతో సుకుమారంగా పెరిగిన నీవు అక్కడ కష్టపడ లేవు అనగా మీరు లేని చోట నాకు కష్టము. మీరు వున్నపుడు నాకు ఏమి కష్టము వుండదు అని వనవాసము వెళ్ళును. అక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎంతో సంతోషం చినది. ఋషుల దర్శనం లభించడం ఎంతో భాగ్యముగా స్వీకరించినది అరణ్యవాసం ముగిసి వచ్చిన తరువాత రాజ్యాభిషేకం జరిగినది. కొంతకాలము తరువాత రామునితో అరణ్య వాసమే బాగుండెనని చెపుతుంది.
అలాగే భారతంలో వనవాస సమయంలో ఒకసారి పాండవులు హిమాలయ పర్వత ప్రాంతమునకు వెళ్ళారు. ఆ మంచు కొండల మధ్య ధర్మరాజు, ద్రౌపతి విహరిస్తున్నారు. ద్రౌపది 'నాధా' రాజ భవనంలో హంస తూలికా తల్పముపై శయనించి ఎన్నో సుఖములు అనుభవించిన మీరు ఈ విధంగా ఎండా వానలకు తట్టుకుంటూ జీవితం గడప వలసి వచ్చింది. మన స్ధితిని చుస్తే నాకు బాధగా వుంది అన్నది. ధర్మరాజు "ద్రౌపది" నీవు చాలా పొరపాటు పడుతున్నావు. ఈ అద్భుత సౌందర్యమును ప్రకృతిలో వైభవములోని వైవిధ్యమును మనము రాజ్య భావనములలో చూడగలమా.
ఈ సృష్టి అంటే ఏమిటి? భగవంతుని లీలా విభూతి, అద్భుతమైన యీ దివ్య సౌందర్యములో ప్రతి అణువులో దేవుడున్నాడు. ఇట్టి అవకాశం మనకు కల్పించి నందులకు దైవమునకు మనము కృతఙ్ఞతలు అందజేయాలి అని అన్నాడు. అరణ్యవాసము కూడ ఒక వరముగా భావించాడు. కావున కష్టము వచ్చినపుడు దిగులు పడక తరువాత వచ్చేది సుఖము అని తెలుసుకొని ధైర్యముతో ఎదుర్కోవాలి.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment