Tuesday, 5 December 2023

స్వామికి మొక్కిన మొక్కు (07-Dec-23, Enlightenment Story)

 స్వామికి మొక్కిన మొక్కు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం వెంటనే ఒక పెద్ద శస్త్రచికిత్స చెయ్యాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రులో తనని చేర్చాను. మరుసటిరోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాము. ఆమెను శస్త్రచికిత్సకు తీసుకునివెళ్లారు. బాధతో, ఆందోళనలతో మనస్సు కకావికలమైపోయింది. 

మా ఇంటి దైవమైన ఏడుకొండలస్వామిని ప్రార్థించాను. కానీ మన్సు కుదురుగా ఉండడంలేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత ఇద్దరమూ వచ్చి, 1,008 రూ. కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. ఒకటిన్నరగంట తరువాత శాస్త్రచికిత్స ముగియగానే, సాధారణ వార్డుకు మార్చారు.

“మేము ఏదేదో అనుకుణామూ కానీ, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు. శస్త్రచికిత్స విజయవంతమైంది” అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామివారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చాము.

తరువాత గోకులాష్టమి పండగ వచ్చింది. మనం కాంచీపురం వెళ్ళి, అక్కడి సేవకులకి మురుకులు, వెన్న గుళ్ళు ఇచ్చి, స్వామివారిని దర్శించుకుందామని నా భార్యకు చెప్పాను. అన్నిటినీ తీసుకుని శివాస్థానం చేరుకున్నాము. ఉదయం దర్శనం తరువాత ఏడుగంటలకి అనుష్టానానికి కూర్చున్నారు స్వామివారు. స్వామివారు అనుష్టానం కోసం శివాస్థానంలో ఒక పాకలోకి వెళ్ళడం మేము బయటినుండే చూశాము. నా విన్నపాన్ని స్వామివారికి ఎలా తెలియజేయాలో నాకు పాలుపోలేదు. అక్కడే ఉన్న ఒక సేవకుడిని పిలిచాను.

“స్వామివారికి చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. నేను స్వామివారికి కానుక మొక్కుకునాను. నా భార్యను కాపాడారు. నేను కానుకను సమర్పించాలి; ఎలా చెయ్యాలో నాకు తెలియదు. మంచి సమయం చూసుకుని నువ్వు స్వామివారితో చెప్పి వారి ఆదేశాన్ని నాకు తెలుపు” అని చెప్పాను.

స్వామివారి అనుష్టానం పూర్తవగానే, ఆ సేవకుడు గట్టిగా, “తంజావూరు సంతానం వచ్చాడు. స్వామివారికి విజ్ఞాపన చెయ్యడానికి సిగ్గు పడుతున్నాడు. అతని భార్యకు పెద్ద శస్త్రచికిత్స జరిగిందని చెప్పాడు. ఆ సమయంలో ఆమెను కాపాడమని స్వామివారికి కానుక మొక్కుకున్నాడు. దంపతులిరువురూ బయట నించున్నారు” అని చెప్పాడు.

మహాస్వామి వారు నవ్వుతూ, ఛాతీని ముట్టుకుని “నాకు మొక్కుకున్నాడా? ఎంత మొత్తమో అడుగు?” అన్నారు. “1,008 రూ. కానుక మొక్కుకున్నాను” అని చెప్పాను.

“ఆ ధనం తీసుకునివచ్చాడేమో అడుగు?”

“వెంటతెచ్చాను”

ఈ సంభాషణ అంతా విని నా భార్య నావైపు అయోమయంగా చూసింది. నా మొక్కు గురించి ఆమెకు తెలియదు. మేము అక్కడ ఉంచిన పళ్ళు, టెంకాయలు మరియు ఇతర పదార్థాలను రెండు పెద్ద పెద్ద పళ్లాలలో సర్దమని చెప్పారు స్వామివారు. “ఇక్కడ ఋగ్వేద పారాయణం చేసే శాస్త్రిగారిని పిలవండి” అని ఆదేశించారు. శాస్త్రి గారు రాగానే, మమ్మల్ని జంటగా నిలబడి 504 రూ. ఒక పల్లంలో ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు.

శ్రీమద్భాగవతం పారాయణం పూర్తిచేసిన మరొక శాస్త్రి గారిని పిలిపించి, మరొక్క పళ్ళెంలో 504 రూ. ఉంచి ఆ శాస్త్రిగారికిచ్చి నమస్కరించమన్నారు.

తరువాత మందహాసంతో , అక్కడున్నవారికి వినబడేటట్లుగా “ఇది విన్నారా! ఇతను చెబుతున్నాడు ఇతని భార్యకు ఒక పెద్ద శాస్త్రచికిత్స జరిగింది. అందుకోసమని నాకు మొక్కుకుని 1,008 రూ. కానుకగా నాకు సమర్పించడానికి తెచ్చాడు. అందరూ దేవునికి, దేవాలయానికి మొక్కు చెల్లిస్తారు. చూడండి ఇతను నాకు మొక్కుకున్నాడు అంట!” అని గట్టిగా నవ్వగానే, అక్కడునవారందరూ స్వామివారితో శృతి కలిపారు.

స్వామివారు మాకు పూర్ణ అనుగ్రహాని ఇచ్చి, “వెళ్లిరండి” అని ఆశీర్వదించారు. ఎప్పటికీ నా కళ్లెదుటన ఉండే ఒక అపురూపమైన సంఘటన.

--- తంజావూరు సంతానరామన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

1 comment:

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...