*ఉరుములయ్య మెరుపులమ్మ* (జానపద సరదా కథ)
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺ఒకూర్లో నలుగురు అన్నదమ్ములు వుండేటోళ్ళు. వాళ్ళకో చెల్లెలుంది. ఆమెది అద్భుతమైన అందం. ఆమెని చూస్తే కండ్లు మిరుమిట్లు గొలుపుతాయి. అందుకే అందరూ ఆమెకు 'మెరుపులమ్మ' అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళన్నోళ్ళకే గాక వదినెలకు గూడా ఆమె అంటే చానా ప్రేమ. అడిగింది అడిగినట్లు తెచ్చియ్యడమే తప్ప కాదు... కూడదు... అని అనేటోళ్ళు కాదు.
ఒకరోజు అన్నావదినలంతా చేనుకి పోతా వుంటే చూసి ''నేనొస్తా... నేనొస్తా...'' అని ఆ పాప వెంట పడింది. ''వద్దమ్మా...అంతదూరం నువ్వు నడవలేవు...అదీకాక ఎండకూడా'' అని వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. దాంతో వాళ్ళు చెల్లెలు నడచి కష్టపడగూడదని ఎద్దులబండి కట్టి, ఎండ పడకుండా దానిపైన ఒక దుప్పటి వేసి ఆమెని దాంట్లో తీసుకోని పోయినారు. పొలంలో ఆమెను ఒక చెట్టు కింద కూచోబెట్టి ఎద్దులకు నాగలి కట్టి దున్నుతా వుంటే... వానదేముడు... ఒక్కొక్కరోజు ఒక్కొక్క వూర్లో వాన కురిపిస్తా... కురిపిస్తా... ఆరోజు మిట్టమధ్యాన్నం వాళ్ళుండే వూరికి వచ్చినాడు. వానదేముడొచ్చేది వాన కురిపియ్యడానికే గదా...దాంతో కుండపోతగా వాన కురిపియ్యడం మొదలుపెట్టినాడు. నేలంతా తడిసి ముద్ద ముద్ద కాసాగింది. పనంతా మధ్యలో ఆగిపోయింది.
ఒకరోజు అన్నావదినలంతా చేనుకి పోతా వుంటే చూసి ''నేనొస్తా... నేనొస్తా...'' అని ఆ పాప వెంట పడింది. ''వద్దమ్మా...అంతదూరం నువ్వు నడవలేవు...అదీకాక ఎండకూడా'' అని వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. దాంతో వాళ్ళు చెల్లెలు నడచి కష్టపడగూడదని ఎద్దులబండి కట్టి, ఎండ పడకుండా దానిపైన ఒక దుప్పటి వేసి ఆమెని దాంట్లో తీసుకోని పోయినారు. పొలంలో ఆమెను ఒక చెట్టు కింద కూచోబెట్టి ఎద్దులకు నాగలి కట్టి దున్నుతా వుంటే... వానదేముడు... ఒక్కొక్కరోజు ఒక్కొక్క వూర్లో వాన కురిపిస్తా... కురిపిస్తా... ఆరోజు మిట్టమధ్యాన్నం వాళ్ళుండే వూరికి వచ్చినాడు. వానదేముడొచ్చేది వాన కురిపియ్యడానికే గదా...దాంతో కుండపోతగా వాన కురిపియ్యడం మొదలుపెట్టినాడు. నేలంతా తడిసి ముద్ద ముద్ద కాసాగింది. పనంతా మధ్యలో ఆగిపోయింది.
అది చూసి మెరుపులమ్మ ''ఈ వానదేముడు వచ్చేదేదో రాత్రిపూట రావొచ్చుగదా... ఇట్లా మిట్టమధ్యాన్నం వచ్చి సతాయించే బదులు'' అనింది. ఆ మాటలు విన్న వానదేముడు ఎవరబ్బా ఇట్లా అంటున్నారని కిందికి చూసినాడు. చూస్తే ఇంగేముంది మిరుమిట్లు గొలుపుతా మెరుపులమ్మ కనబడింది. ''అబ్బ ఎంత బాగుంది అచ్చం పాలరాయి లెక్క'' అని ఆచ్చర్యపోయి ''సరే...రాత్రికే వస్తాలే'' అని చెప్పి ఆగిపోయినాడు. అది చూసి అన్నలంతా ''నా చెల్లెలు చెప్తే ఆఖరికి వానదేముడు గూడా మాట వింటాడు చూడు'' అని మురిసిపోయినారు.
ఆరోజు రాత్రి ఆమె గదిలో నిద్రపోతా వుంటే అర్ధరాత్రి తలుపు చప్పుడయ్యింది. ''ఎవరబ్బా... ఇంతర్ధరాత్రి తలుపు కొడ్తా వున్నారు'' అని తెరచి చూస్తే ఇంగేముంది నెత్తిన కిరీటం ధగధగా మెరిసిపోతా వుంటే చిరునవ్వులు నవ్వుతా వానదేముడు కనబన్నాడు. ఆమె ఆచ్చర్యపోయి ''ఏమిట్లా వచ్చినావు...ఇంత రాత్రప్పుడు'' అనడిగింది. దానికా వానదేముడు ''నువ్వేగదా... ఈ రోజు మధ్యాన్నంపూట మీ వూరికొచ్చి వాన కురిపిస్తా వుంటే...ఇప్పుడెందుకొచ్చినావ్.
వానదేముడు తరువాతరోజు పొద్దున్నే లెక్కబెట్టలేనన్ని నగలూ, వజ్రాలు, వైఢూర్యాలు తీసుకోనొచ్చి ''మీ చెల్లినియ్యమని'' వాళ్ళన్నోళ్ళని అడిగినాడు. ఏకంగా వానదేముడే వచ్చి నీ చెల్లెల్ని పెండ్లి చేసుకుంటా అనడిగితే ఎవరు కాదంటారు... దాంతో వాళ్ళు సరే అన్నారు. వూరు వూరంతా వచ్చి ఆ చూడముచ్చటైన జంటని ఆశీర్వదిస్తా వుంటే అంగరంగ వైభోగంగా పెండ్లి చేసినారు. వానదేమునికి ఆమె అంటే చానా చానా ఇష్టం గదా... దాంతో ఆడికీ ఈడికీ తిరగకుండా మట్టసంగా అమె దగ్గరే వుండిపోయినాడు.
వానదేముడు అట్లా ధర్మం తప్పి ఒక్కచోటనే వుండిపోతే ఎట్లా... దేశమంతా తిరుగుతా అంతటా వానలు కురిపియ్యాల గదా... కానీ ఆయన కొత్త పెండ్లాం మోజులో పడి అన్నీ మరచిపోయినాడు. దాంతో చుట్టుపక్కల వూళ్ళలో యాడా వానల్లేక చెట్లూ చేమలు అన్నీ ఎండిపోయి మనుషులకే గాక పశువులకు గూడా తిండి దొరకని పెద్ద కరువు వచ్చేసింది.
దాంతో ఒక ముసల్ది ''యాడున్నాడబ్బా... ఈ వానదేముడు'' అని ఒకొక్క వూరే వెదుక్కుంటా... వెదుక్కుంటా... ఒకరోజు ఆ వూరికొచ్చింది. వచ్చి చూస్తే ఇంగేముంది... ఆ వూరు యాడ చూసినా గలగల పారే నీళ్ళతో... పచ్చని పంటపొలాలతో కళకళలాడతా కనబడింది. అప్పుడా ముసల్ది ''ఓహో... ఐతే వానదేముడు ఈ వూర్లోనే ఎవరో ఒకరింట్లో వుంటాడు... అందుకే చుట్టుపక్కల అన్ని వూళ్ళూ కరువుతో నాశనమయి పోతా వున్నా... ఈ వూరు మాత్రం పచ్చగా వుంది'' అనుకోనింది.
ఆ ముసల్ది నెత్తిన పుచ్చు చింతకాయల గంప పెట్టుకొని ''చింతకాయలమ్మా... చింతకాయలు'' అని అరుచుకుంటా పోసాగింది. అట్లా ఒకొక్క ఇండ్లే దాటుకుంటా... దాటుకుంటా... ఆఖరికి వీళ్ళింటికి చేరుకోనింది. చింతకాయలనే మాటినగానే నోట్లో నీళ్ళూరి మెరుపులమ్మ ఆమెని ఇంట్లోకి పిల్చింది. పిలిచి చూస్తే ఒక్కటి గూడా మంచిది లేదు... అన్నీ పుచ్చులే... అది చూసి ఆమె ''ఏందమ్మా ఇది... అన్నీ ఇట్లా వున్నాయి. ఎవడు కొంటాడు దీండ్లని'' అనింది. దానికా ముసల్ది కండ్లనీళ్ళు బెట్టుకోని ''ఏం చేద్దాం చెప్పమ్మా...మీ వూళ్ళో మాదిరి అన్ని వూళ్ళలో బాగా వాన పడ్తే మంచి మంచి చింతకాయలు వద్దన్నా వస్తాయి. కానీ మా వూళ్ళో వాన లేక ఇప్పటికి మూడు సంవచ్చరాలయిపోతా వుంది. అందరినీ సమానంగా కన్నబిడ్డల్లా కడుపులో పెట్టుకోని చూసుకోవాల్సిన ఆ వానదేమునికి ఏం పోయేకాలమొచ్చిందో ఏమో... మీ వూళ్ళో తప్ప యాడా వాన కురిపియ్యడం లేదు. వాని మీద బండబడ... సర్వనాశనమయి పోతాడు'' అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.
తన మొగున్ని అట్లా తిడ్తా వుంటే మెరుపులమ్మ చానా బాధపడి ఆ ముసల్ది పోగానే మొగుని దగ్గరికి పోయి ''దేశమంతా నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడ్తా వుంటే... నువ్వేమో హాయిగా యాడికీ పోకుండా ఈన్నే కూచోనున్నావ్. వానదేముడన్నాక ఒకూర్లో... ఒకింట్లో... వుంటే ఎట్లా చెప్పు. పో... పోయి... అంతా తిరిగిరాపో'' అనింది.
అప్పుడామె ''అందరితోనూ మాట పడ్తా బతికే బతుకూ ఒక బతుకేనా... మనిషి పుట్టుక పుట్టినాక కాస్తన్నా మానం మరియాద వుండాల. నీ ధర్మం నువ్వు నెరవేరిస్తే మనం మాట పడాల్సిన అవసరం లేదుగదా'' అనింది.
అప్పుడు వానదేముడు ఆమెని విడిచిపెట్టిపోలేక ''సరే... నువ్వు అంతగా చెబుతావున్నావు గాబట్టి పోతా... కానీ నువ్వు గూడా నాతో రావాల. నిన్ను విడిచి నేనుండలేను'' అన్నాడు. దాంతో ఆమె జనాలందరి బాగు కోసం సరే అనింది. అంతే... వెంటనే వానదేముడు వురుముకుంటా వానలు కురిపియ్యడానికి బైలుదేరితే... ఆయన వెంబడే మెరుపులమ్మ కూడా మెరుసుకుంటా ఆకాశానికి ఎగిరింది.
పూర్వకాలంలో వాన పడ్తా వున్నప్పుడు ఆకాశంలో వురుములే తప్ప మెరుపులు ఎప్పుడూ కనబడేవి గాదట. కానీ ఇద్దరూ అట్లా వురుముకుంటా, మెరుసుకుంటా బైలుదేరినప్పటి నుండి మనకు వానతోపాటు మెరుపులు గూడా మిరుమిట్లు గొలుపుతా కనబడ్తా వున్నాయి.
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment