Tuesday, 5 December 2023

పంచప్రాణాలు అంటే ఏమిటి (05-Dec-23, Enlightenment Story)

*పంచప్రాణాలు*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ప్రతి మానవుని దేహంలో ఐదు రకముల వాయువులుంటాయి: 1. ప్రాణం, 2. అపానం, 3. సమానం, 4. ఉదానం, 5. వ్యానం. వీటిని పంచప్రాణాలని పిలుస్తారు.

హృది ప్రాణోగుదేపానః సమానోనాభిమండలే |
ఉదానః కంఠ దేశేస్యాద్ వ్యానః సర్వశరీరగః ||

5 వాయువులు

1. హృదయం లో ప్రాణం అనే వాయువు.

2. గుదం లో (మూలాధారంలో) అపానం

3.నాభి లో సమానం...

4.కంఠం లో ఉదానం

5. శరీరం అంతటా (దేహమంతా) వ్యానం అనే వాయువు.

 నిజానికి వాయువు ఒకటే అయినా, పలు ప్రదేశాలలో పలు పనులతో పలు పేర్లను కలిగి ఉంటుంది. ప్రాణవాయువు హృదయం నుండి నాసిక (ముక్కు) వరకు సంచరిస్తుంది

ప్రాణాపాన సమాఘతాత్ కందమధ్యాద్యదుత్థితం |
ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాననిరోదిభిః ||

ఈ సంచారం రోజుకు 21600 సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉంటుంది లేకపోతే అన్ని క్రియలు ఆగిపోయి, మనషి మరణిస్తాడు. 

ఈ ప్రాణవాయువు ఊర్థ్వముఖం (పైకి) గా ప్రయాణిస్తుంది. గుద (పీఠ) స్థానంలో నెలకొన్న అపానవాయువు మలమూత్రములను బయటకు పంపే పనిని చేస్తుంది. ఇది అధోముఖంగా (క్రిందకు) ప్రయాణిస్తుంది. నాభి (బొడ్డు)లో ఉండే సమాన వాయువు మనిషి తిన్న అన్నం యొక్క రసమైన రక్తాన్ని అన్ని అవయవములకు వాటి పనులను మరియు స్థాయిని బట్టి సమానంగా పంచుతుంది.

ఉదానవాయువు కంఠ భాగంలో ఉండి చీమిడి, కళ్ళి వంటి వాటిని దేహంలోపలి నుంచి బయటకు పంపే పని చేస్తుంది. వ్యానవాయువు శరీరంలోని ప్రతినాడిలో సంచరించి రక్తప్రసరణ ప్రక్రియను సమతుల్యంగా చేసి కాపాడుతుంది, లేకపోతే పక్షవాతం వంటి రోగాలు శరీరంలోకి చేరుతాయి. ఇది మనపూర్వీకులు, పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన విషయం.

ఇవి ఆయా స్థానాలలో ఉన్నా అవసరమైనపుడు ఇతర స్థానాలలోకి సంచరిస్తాయి ఇవే అగ్నులుగా పరిణమించి మనం తిన్నది రక్తం గా పరిణమించేందుకు వివిధ దశలలో పనిచేస్తాయి. మనం పీల్చే గాలి లోపల ఇన్ని పరిణామాలు చెందుతుంది.

( వాయోరగ్నిః— వాయువు నుండి అగ్ని పుడుతుంది అని వేదం. )


1) ప్రాణము : ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుందని చెప్పబడింది. మన వాక్కును, మ్రింగటాన్ని, శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని తెలియజేయబడింది.


2)అపానము :నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తి చెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తుంది.

3)సమానము:ఇది నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుందన్నమాట

4)ఉదానము : ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఇది సహాయపడుతుంది. మనలోనుండి శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదపడుతుందన్నమాట.

5)వ్యానము : ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచుతుంది. శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మనాడులున్నట్లు చెపుతారు. ఇవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ ఉన్నట్లు పెద్దలు చెబుతారు. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు అని చెప్పారు




☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...