Tuesday, 19 December 2023

మీ ఆరోగ్యం మీ చేతుల్లో (22-Dec-23, Enlightenment Story)

 *మీ ఆరోగ్యం మీ చేతుల్లో*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺

మనకు వచ్చిన ఎలాంటి వ్యాధినైనా స్వయంగా, ఎలాంటి ఔషధాలు వాడకుండా మనమే తగ్గించుకోవచ్చు. అది ఎలా⁉️ అనేది కింద చదువుదాం... కొందరి అనుభవాలను వివరిస్తున్నాను. నవ్వు అన్నిటికన్నా ఉత్తమైన మందు...

 💎మైకెల్ బెర్నార్డ్ బెక్విడ్

"ఒక వ్యక్తి శరీరంలో ఏదైనా వ్యాధి బైటపడ్డప్పుడు, లేదా అతని జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, 'సరైన' ఆలోచనలతో దాన్ని పూర్తిగా వెయ్యటం సాధ్యమేనా? అని తరచు ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం స్పష్టంగా వుంది, ఔను, తప్పకుండా సాధ్యమే.. నవ్వు అన్నిటికన్నా ఉత్తమమైన మందు

 💎డా|| బెన్ జాన్సన్

మనందరిలో పుట్టుకతోనే ఒక ప్రాథమిక ప్రోగ్రాం నిక్షిప్తమై ఉంటుంది. దాని పేరు "స్వయం చికిత్స". మీకు దెబ్బ తగుల్తుంది, అది పూడుకుంటుంది. మీకు బాక్టీరియావల్ల అంటురోగం వస్తుంది, రోగనిరోధకశక్తి వచ్చి ఆ బాక్టీరియా విషయం చూసుకుని, రోగాన్ని మాన్పుతుంది. రోగనిరోధకశక్తికి తనని తను మాన్చుకోగల శక్తి ఉంది,

💎బాబ్ ప్రాక్టర్

ఆరోగ్యకరమైన భావస్థితి ఉన్న శరీరంలో వ్యాధి బతకలేదు. ప్రతిక్షణం మీ శరీరం కొన్ని లక్షల కణాలని విసర్జిస్తూ ఉంటుంది. అదే సమయంలో మరిన్ని 1 లక్షల కణాలని సృష్టిస్తూ కూడా ఉంటుంది.

💎డా|| జాన్ హాజలిన్

నిజానికి ప్రతిరోజూ మన శరీరంలోని కొన్ని భాగాలు భర్తీ చెయ్యబడుతూ. ఉంటాయి. మిగతా భాగాలు కొన్ని నెలలకి ఒకసారీ, ఇంకా కొన్ని రెండేళ్ల కొకసారీ భర్తీ చెయ్యబడతాయి. కానీ కొన్ని ఏళ్లల్లో మనందరికీ పూర్తిగా కొత్తదైన శరీరం లభిస్తుంది.  సైన్సు నిరూపించినట్టు, మన శరీరాలు పూర్తిగా కొన్నేళ్లలో భర్తీ చెయ్యబడితే, మరి క్షీణించటం ఎలా జరుగుతోంది? ఏళ్ల తరబడి మన శరీరాలని అంటిపెట్టుకుని వ్యాధులూ ఎలా ఉంటాయి? వాటిని అక్కడ పట్టి ఉంచేది ఆలోచనలే. ఎప్పుడూ వ్యాధిని గమనిస్తూ ఉండటం, దానిమీదే ధ్యాస పెట్టటం వల్లే అలా జరుగుతుంది.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...