గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండు
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺
*ఈ ప్రపంచానికి నిన్ను నువ్వు పరిచయం చేసుకునే అవసరం లేనంత వరకు . కృషి చేస్తూనే ఉండు. గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండు*
👉నువ్వు ఎన్నైనా చెప్పు .. నీ ప్రతిభను , వ్యక్తిత్వాన్ని నువ్వు నమ్మినంత సులువుగా ఈ సమాజం నమ్మదు.
👉 ప్రతి దానికి నియమాలతో , అంచనాలతో ఆలోచించే మనసు నువ్వు విజేతవన్న నిజాన్ని గుర్తించదు. మనుషులు నిన్ను అంగీకరించాలంటే వాళ్ళ అంచనాలకు ఆలోచనలకు తగినట్టు నువ్వు బ్రతకాలి.
👉 మనుషులు నిన్ను ప్రేమించాలంటే ... వాళ్లు నిన్ను అభిమానించేలా చేసుకోగలిగే కళ నీలో జీవించాలి.
👉 మనుష్యులు నిన్ను గొప్పగా చూడాలంటే ... వాళ్లకి సాధ్యం కానిది ఏదో నువ్వు సాధించి చూపాలి . మనుష్యులు నిన్ను గౌరవించాలంటే .. వాళ్లకి నీతో .. ప్రయోజనమో ..
👉 ఆనందమో..ఎదురు సమాధానం చెప్పలేని విపరీతమైన అవసరమో ఏదో ఒకటి ఉండేలా చేయాలి . మనుష్యులు నిన్ను ఆరాధించాలంటే .... నువ్వు వివేకానంద అంత గొప్పవాడివి అయినా .. చికాగో సమావేశం లాంటి ఒక అద్భుత అవకాశంలో నిన్ను నువ్వు నిరూపించుకోవాలి .
👉 నువ్వు ఒక అద్భుతం అయినా నువ్వు నిజంగా అద్భుతానివే అని అందరినీ అంగీకరింప చేయగలగాలి .
👉 అప్పుడు నువ్వు మాత్రమే కాదు లోకమంతా అనుకుంటారు నిజంగా నువ్వు ఒక అద్భుతం అని .💐💐
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment