Monday 3 June 2024

ఆకులు చెప్పిన పాఠాలు (04-June-24, Enlightment Story)

 ఆకులు చెప్పిన పాఠాలు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺


మామిడి ఆకు - ప్రతీ శుభ కార్యంలోనూ నేను తప్పని సరి. నేను లేనిదే ఏ శుభకార్యం జరుగదు అంది గర్వముగా. దేవుడు చిన్నగా నవ్వాడు. తలుపు గుమ్మానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు.

కరివేపాకు - వంటలలో నేను లేనిదే రుచి లేదు అంది గర్వముగా. తినేటప్పుడు కరివేపాకుని ఏరి పార వేసే ఆలోచనను మనిషికి కలిగించాడు.

అరటి ఆకు - ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను వాడతారు. నేను మీకంటే గొప్ప అని అన్నది. దేవుడు ఆలోచించాడు. అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్తకుప్పలో పడేటట్లు చేశాడు.

తమలపాకు - నేను శుభ కార్యాలకే కాదు, నన్ను తాంబూలం గా వేసుకొంటే నోరు ఎర్రగా పండుతుంది. నాకు సాటి ఎవరూ లేరు అన్నది. దేవుడు దాని పొగరు అణచాలను కొన్నాడు. తమలపాకు నమిలి రసం మ్రింగి, తరువాత బయటకు ఉమ్మేసేలా చేసాడు.

తులసి ఆకు: నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అంది వినయంగా. దేవుడు సంతోషించాడు. తన మెడలో హారంగా, తన పాదాల చెంత తులసీదళంలా భక్తులు సేవించే తీర్ధంలో ఉండేటట్లుగా పవిత్ర జీవితం ఇచ్చాడు.

నీతి - "నేను, నా వల్లే," అనే అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు. వినయంగా వున్నవారు ఉన్నత స్థానం పొందుతారు.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

చుట్టుపక్కల చూడు (02-July-24, Enlightenment Story)

చుట్టుపక్కల చూడు 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాల...