Monday 1 July 2024

చుట్టుపక్కల చూడు (02-July-24, Enlightenment Story)

చుట్టుపక్కల చూడు

🍀🌺🍀🌺 🍀🌺🍀🌺


చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. 

 కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియ కుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. చీకటి మిత్రులను గాఢంగా కౌగలించుకొని వారిని వదలలేక స్నేహం కొనసాగిస్తాడు. వారే అజ్ఞానం, అహంకారం, అంధవిశ్వాసాలు. వారి కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలిగా మారి తన జీవితాన్ని మట్టుపెడుతుందని తెలియని స్థితిలో కొట్టుమిట్టాడతాడు. రంగుటద్దాలు ధరించి లోకాన్ని చూస్తాడు. ఆ అద్దాల్లోంచి లోకమంతా రంగు రంగులుగా కనిపిస్తుంది. అదే నిజమైన ప్రపంచమని భ్రమిస్తాడు. తమ పబ్బం గడుపుకొనే ప్రబుద్ధుల ఇచ్చకపు మాటలకు లొంగి ప్రవర్తిస్తాడు. వారిపై నమ్మకం అతణ్ని అంధుణ్ని చేస్తుంది.


నమ్మకమనేది మైకం కలిగించే మధురపదార్థం లాంటిది. అది విషంతో నిండినా దాని మాధుర్యానికి బానిసై, అందించినవారు తన శ్రేయోభిలాషులని నమ్మి దాసోహమంటాడు. ఆ మత్తునుంచి మేల్కొనలేడు. హితైషుల పలుకులు చెవికెక్కవు. స్వార్థపరుల వలలో చిక్కి విలవిల్లాడిపోతారు. 

ఒక వ్యక్తిని నమ్మే ముందు క్షణకాలం అతణ్ని అనుమానించు’ అన్న ఆంగ్ల సామెత మనిషి నైజాన్ని చెప్పకనే చెబుతోంది. అందులో దోషం లేదు. పరీక్షిస్తే మనిషి తత్వం తెలుస్తుంది. అందంగా కనిపించే చక్కెరబిళ్లలు ఉప్పుకణికలో కాదో తేలిపోతుంది. కన్నవారిపై, నా అనుకున్నవారిపై మితిమీరిన ప్రేమను పెంచుకొన్నా, కొన్ని సందర్భాల్లో వారిపట్ల సందేహ భావనతో ప్రవర్తించడం బంగారానికి పరీక్షలాంటిదే. నలుగురితో నారాయణ అన్న సామెత నిజమే అయినా, గొర్రెదాటు ప్రవర్తనకు చుక్క పెట్టక తప్పదు. నమ్మించి వంచించే ఆషాఢభూతులపై దృష్టి నిలిపి నిలువరిం చకపోతే నష్టం తప్పదు. హద్దుదాటిన ప్రేమ, అంధ విశ్వాసం మనిషి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు.

మహాభారతంలో పుత్రుడిపై ధృతరాష్ట్రుడు,  గాంధారి అవధులు మీరి చూపిన ప్రేమ అనర్థదాయకమై కురువంశ పతనానికి కారణభూతమైంది. సంతతిపై అభిమాన వాత్సల్యాలు ఎవరికైనా ఉంటాయి. అందించిన సంపదను సద్వినియోగిస్తున్నారా లేక తప్పు దారిని ఎంచుకున్నారా అన్న డేగకన్ను పరిశీలన అత్యావశ్యకం. 

అతిగా నమ్మి సంపదను ముందే మూటగట్టి ముడుపు చెల్లిస్తే స్థితిగతులు మారి కన్నవారు వృద్ధాశ్రమాలకు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దాణా చూపించి గుర్రాన్ని పరుగెత్తించాలి గాని, దాన్ని ముందే నోటికందిస్తే అది మొరాయించక మానదు. 
నమ్మినవాళ్లు, నా అనుకున్నవాళ్లే చుట్టూ అగాధాలు, కందకాలు సృష్టిస్తారు. అవి గమనించక నమ్మి చేయినందిస్తే గోతిపాలు కాక తప్పదు. ‘నీ శత్రువు ఎక్కడో లేడు. నీ పక్కనే ఉన్నాడు’ అన్న రూజ్‌వెల్ట్‌ మాటలు అక్షర సత్యాలు. అసూయతో, స్వార్థంతో అలవిమాలిన మాటలు చెప్పి బంధుమిత్రుల మధ్య వైరాన్ని కల్పించే స్వార్థపరులు, మన ఉన్నతిని సహించలేక వక్రమార్గంలో మనల్ని మళ్ళించే అసూయాపరులు, తియ్యటి పలుకులతో వెన్నుపోటు పొడిచే మోసగాళ్లను ఒళ్ళంతా కళ్లు చేసుకుని గమనించాలి. ప్రమాదాలను తప్పించుకొని సురక్షితంగా పయనించేవారే గమ్యాన్ని చేరగలరు. మురిపించి మెరిపించే రంగులు వెలిసి పోయినప్పుడు అసలు రంగు బయటపడుతుంది. అప్రమత్తులైనవారి జీవితంలో ఇంద్రధనుస్సు ఎప్పుడూ వెల్లివిరిస్తూనే ఉంటుంది!

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...