Wednesday 22 May 2024

దైవము!!దేవునికి రూపం ఉందా ? (23-May-24, Enlightment Story)

 దైవము!!దేవునికి రూపం ఉందా ?

🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀🌺🌺

ప్రార్థించండి! వేకువనే లేచి దైవమును ప్రార్థించండి.. ప్రార్థన యొక్క శక్తిని గుర్తించి ప్రార్థించండి. దైవము తప్పక సమాధానం ఇస్తాడన్న విశ్వాసంతో ప్రార్ధించండి. మరొక దినం గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రార్ధించండి. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ప్రార్ధించండి.. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఆటంకములు ఎదురైనా వాటిని లెక్కచేయక ప్రార్ధించండి.. 

హృదయ లోతుల్లోంచి గట్టిగా పిలవండి! ఆర్తితో పిలవండి!! పలికేవరకూ పట్టుదల విడువకండి. మీకు శుభ దినాలు ఎదురయ్యే రోజులూ ఎంతో దూరంలో లేవు. జన్మ ధన్యమయ్యే కాలం అతి దగ్గరలోనే ఉంది. పట్టుదల విడువకండి! ప్రార్ధించండి!! నిరుత్సాహ పడకండి! ప్రార్ధించండి! గట్టి వేడే పుట్టాలి.. పరమాత్మ కరిగి పరుగులెత్తి రావాలి!!


*దైవము!*

దేహములోనున్న జీవుడు బయటకు పోయినప్పుడు ఆ దేహము దగ్గరకు రావడానికి భార్య కూడ భయ పడుతుంది. మనము ఎంతో ప్రేమగా చూసుకునే భార్యాబిడ్డలు వాకిలి వరకే వస్తారు, బంధుమిత్రులు వల్లకాటి వరకే వస్తారు. కాని పరమేశ్వరుడు మనము ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఎన్నో ఉపాయములతో నిరంతరం, మనలను చూసుకుంటూ ఉంటారు.ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహము ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నారు. 

అటువంటి పరబ్రహ్మను నేడు మనం మరచిపోయి భార్య పిల్లలు, బంధుమిత్రులు, ధనదాన్యాలు, వస్తువాహనాలు ఇవే నిత్యమనుకుని వీటి చుట్టూ తిరుగుతున్నాము. ఫలితంగా ఏమెుస్తుంది !! అసంతృప్తి, ఆందోళన, అశాంతి. దేనిని పట్టుకుంటే జీవితమునకు సార్థకత చేకూరుతుందో దానిని పట్టుకోవాలి.. దానినే పొందడానికి సాధన చేస్తుండాలి...

*దేవునికి రూపం ఉందా ?*

పరమాత్మకు ఆకారంలేదు. అందుచేతనే "పరమాత్మకు ఆకారం లేదు, వయస్సులేదు, ఏనాటికి అతడు లేకుండా పోడు, నిత్య సనాతనుడు" అని చెప్తారు. ఇది నిజమే, అయినా పరమాత్మ ఏ ఆకారమైనా ధరించగలడు. 

పరిశుద్ధమైన నీటికి రుచి ఉండదు. కానీ నీటిలో ఉప్పుకలిపితే అది ఉప్పుగా ఉంటుంది. పంచదార కలుపుతే తియ్యగా ఉంటుంది. పరమాత్మకూడ వేరువేరు గుణాలను గ్రహించగలిగిన పరిశుద్ధ జలం వంటివాడు. పరమాత్మకు వాస్తవంగా ఆకారం అని మనం వర్ణించజాలం. 

ఉదాహరణకు - ఎంత పంచదార కలిపినా సముద్రం నీరు తియ్యగా మారదు. ఎందువల్లననగా ఉప్పగా ఉండడం దాని సహజ స్వభావం అందుచేత పరమాత్మకి ఏదో ఒక ఆకారం ఉన్నదని అంటే అప్పుడు ఆ పరమాత్మ మరొక ఆకారం ఏదీ ధరించజాలడని చెప్పవలసి వస్తుంది. అలాంటప్పుడు అతడు పరమాత్మయే కాకుండా పోతాడు. అందుచేత పరమాత్మకి ఆకారం లేదని చెప్పబడింది. అప్పుడు పరమాత్మ ఏరూపమైనా ధరించగలడని చెప్పడం కుదురుతుంది.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...