Tuesday 19 March 2024

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది (20-Mar-24, Enlightenment Story)

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀 

దానం చేయడంవల్లే గౌరవం లభిస్తుంది కాని కూడబెట్టడంవల్ల కాదు. మేఘాలు నీటిని దానం చేస్తున్నాయి కనుక వాటి స్థానం పైన ఉంది. సముద్రం నీటిని కూడబెడుతోంది కాబట్టి దాని స్థానం కిందనే ఉంది. దానధర్మాలు అనేది సాధారణంగా వాడే పదం. దానం ధర్మం ఈ రెండు వేర్వేరు శబ్దాలు అయినా దానం అనేది ధర్మాలలో నొకటి. దానం అనేది అతి సులువైన ధర్మం. దానం ద్వారా అన్నింటిని పొందవచ్చును. దానమే పరమ ధర్మమని గరుడ పురాణంలోవుంది. దానం చేయడానికి ముఖ్యంగా రెండు గుణాలుండాలి. అవి దయ, త్యాగభావన. కలియుగంలో యజ్ఞయాగాదులు చేయడం ఎక్కడో కానీ అంతటా సంభవం కాదు. అందువలన ఈ యుగంలో దానమే ప్రధాన ధర్మం అనేది ఋషుల వచనం. దాని వలన సుఖం లభిస్తుంది, సంపదలు వృద్ధి పొందుతాయి, యశస్సు కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. పాపం హరించుకుపోతుంది, పుణ్యం వస్తుంది.


కేవలం తన కొరకే వండుకొనువారు పంచసూన పాపభూయిష్టితమగు అన్నమును తినుచున్నారు అని భగవద్గీత తృతీయాధ్యాయంలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపియున్నాడు. ఈ విషయాన్ని మరింత వివరంగా వ్యాస భగవానుడు శ్రీమద్భాగతంలో చెప్పి ఉన్నాడు.


తన అవసరానికి మించినదానిని ఆశించేవారు, సేకరించేవారు దొంగ అనిపించుకుంటారు. వారు శిక్షార్హులు. కడుపు నిండడడానికి ఎంత అవసరమో అది మాత్రమే నీది. ఈ సంపదలు నీ ప్రయోజనం వలన సమకూరలేదు. ఈశ్వరుని దయవలన నీవు సంపాదిస్తున్నావు. అందువలన అది ఈశ్వరుని సంపద. నీవు ధర్మకర్తవు. అధిక సంపదలు తిరిగి ఈశ్వరునికే అర్పించాలి. అందుకు ధర్మబద్ధనా ధనం దానం. దీన దుఃఖితులకు, అసహాయులకు సహాయం చేయడమే మానవ జన్మకు పరాకాష్ఠ. ఇది ఆర్షమత సిద్ధాంతం.


దానం చేసే దాతలు కొన్ని నియమాలు పాటించాలి. దానం చేసే ద్రవ్యం దాత స్వార్జితమై వుండాలి. న్యాయార్జితం, ధర్మబద్ధంగా ఆర్జించిన ధనమువల్లనే దానఫలం లభిస్తుంది. అక్రమార్జిత ధనం దానం చేస్తే సద్గతులుండవు. అది పాపకృత్యం. నీదికానిది నీవెలాగు ఇతరులకివ్వగలవు? క్షేత్రమెరిగి బీజం- పాత్ర మెరిగి దానం అంటారు. సారవంతమైన నేలలో నాటిన విత్తనం మాత్రమే మొలకెత్తి పెరిగి ఫలాలనిస్తుంది. అట్లే పాత్రుడైనవానికే దానం చేయాలి. అపాత్రునికి ఎట్టి పరస్థితులలోనూ దానం చేయరాదు. దానాలు పది రకాలు అని చెబుతారు. అవి గోవు, భూమి, తిలలు, బంగారం, నెయ్యి, వస్తమ్రు, ధాన్యము, బెల్లము, ఉప్పు, వెండి. నేటి కాలంలో మరికొన్ని దానాలు ప్రాచుర్యం పొందాయి. ప్రాణదానం, విద్యాదానం, అన్నదానం. దానఫలాలు మూడు రకాలు. ఒకటి స్వయంగా పాత్రుడైన వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇచ్చిన దానికి ఫలితం ఉత్తమం. తన వద్దకు పిలిచి ఇచ్చిన దానికి ఫలితం మధ్యమం. యాచించినవానికి ఇచ్చిన దానఫలితం అథమం. ఇది అధమముదైనా దానం చేసినందున దోషం లేదు. ఏమంటే యాచకుడికి మీ అవసరం ఉంటుంది.


ధనానికి మూడు రకాల గుణాలున్నాయి. ఒకటి దానము, రెండు భోగము, మూడు నాశము. దానము ఉత్తమమైనది. భోగము మధ్యమమైనది. నాశము అంటే దుర్వినియోగము అధమమైనదని పెద్దలు చెప్తారు. ఉత్కృష్టదానం చేసినవారు మనకు పురాణేతిహాసాలలో గోచరిస్తారు. వామనుడికి భూమి దానం చేసిన బలి చక్రవర్తి, రాక్షస సంహారార్థం దేవతలకు తోడ్పడుట కొరకు ప్రాణదానం చేసిన దధీచి మహర్షి, శరణాగతి కోరిన కపోతాన్ని రక్షించడానికి దేహత్యాగానికి సిద్ధపడిన శిబి చక్రవర్తి, ఊంఛ వృత్తిద్వారా సంపాదించిన ఆహారాన్ని అతిథులకు నివేదించిన ముద్గలమహర్షి, కవచ కుండలాలను దానం చేసిన కర్ణుడు, రాజర్షి పురుషోత్తమదాస్ టండన్‌ను ఈ దానమూర్తుల సరసన చేర్చవచ్చు. దానం వినయంగా శ్రద్ధగా అహంకార రహితంగా చేయాలి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

1 comment:

  1. ధనానికి ముఖ్యమే విధాన ధార దత్త మే గుణాలు

    ReplyDelete

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...