Sunday 31 March 2024

ప్రారబ్ధం - పుణ్యఫలం (01- Apr-24, Enlightenment Story)

 ప్రారబ్ధం - పుణ్యఫలం

🌺🍀🌺🍀🌺🌺🍀

పరమాచార్య స్వామివారు కర్నాటక రాష్ట్రంలో బెల్గాం జిల్లాలోని ఉగార్ ఖుర్ద్ లొ మకాం చేస్తున్నారు. జెమిని గణేశన్ భార్య శ్రీమతి అలమేలు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు కుమార్తెను వెంటబెట్టుకుని మహాస్వామి వారి వద్దకు వచ్చాడు.

అతను మహాస్వామి వారితో, “పెరియవ, మా అమ్మాయి వివాహం నిశ్చయం అయ్యింది. మి ఆశిస్సులు కావాలి. అలాగే ఈ పేద బ్రాహ్మణుడికి మీనుండి ధన సహాయం కూడా కావాలి. అనుగ్రహించండి పెరియవ” అని వేడుకున్నాడు.



వెంటనే స్వామివారు అలమేలు వైపు తిరిగి “నువ్వు ఇవ్వగలిగింది, నీ వద్ద ఉన్నదేదైనా ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు” అని ఆదేశించారు. తక్షణమే ఆవిడ తన చేతికి వేసుకున్న రెండు బంగారు గాజులను తీసి అమిత సంతోషంతో సమర్పించింది.

అప్పుడు స్వామివారు, “ఆగు. ఇప్పుడు ఇవ్వకు. అతని కుమార్తె పెళ్ళికి నాలుగు రోజులు ముందు ఇస్తే సరిపోతుంది” అని చెప్పారు. ఎందుకు మహాస్వామి వారు అలా చెప్పారు? అంతేకాదు అక్కడే ఉన్న ఒక బ్యాంకు మేనేజరుతో “మీ బ్యాంకులోని లాకరులో ఇప్పుడు ఈ గాజులను ఉంచు. వాటిని తరువాత బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు” అని కూడా చెప్పారు.

రెండు రోజుల తరువాత ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ స్వామివారి వద్దకు వచ్చాడు. “ఇంట్లో మాకు సబంధించిన వస్తువులన్నీ తస్కరింపబడ్డాయి. ఇప్పుడు నా కుమార్తె వివాహం ఎలా చేయాలి పెరియవ? మిరే నన్ను కాపాడాలి” అని భోరున విలపించాడు.

“బాధపడకు. ఏమి జరగాలో అది జరిగింది. కాని మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది. తను చల్లగా ఉంటుంది” అని ఊరడించారు. “ఇప్పుడు అలమేలు గారు ఇచ్చిన గాజులు మాత్రమె మిగిలాయి. స్వామీ వారి అనుగ్రహంతో అవైనా నాకు మిగిలాయి“ అని అన్నాడు.

పరమాచార్య స్వామివారు నవ్వుతూ, “గొడ్డలితో పోవాల్సినది గోటితో పోయింది. బాధపడకు, ఆ గాజులను తీసుకుని వాటితో నీ కుమార్తె పెళ్లి జరిపించు” అని అతణ్ణి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపించారు. అప్పట్లో ఆ గాజుల విలువ షుమారు ఇరవై వేల రూపాయలు. అప్పటికి అది చాలా పెద్ద మొత్తం.

ఇది చదివిన తరువాత మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. నిజంగా పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఆ దొంగతనం జరగకుండా ఆపొచ్చు కదా? కనీసం ఆ బ్రాహ్మణున్ని హెచ్చరించి ఉండవచ్చు కదా? అని.

ఎంతటి మహాత్ములైనా మన ప్రారబ్దాన్ని(అంటే గత జన్మలలో చేసుకున్న పాప పుణ్యముల వల్ల కలిగే కష్ట సుఖాలు) మార్చలేరు. గత జన్మ కర్మల ఫలితాలను(మంచి/చెడు) మహాత్ములతో సహా ప్రతి ఒక్క జీవి అనుభవించవలసిందే.

కాని మనం శరణువేడితే మహాత్ముల కరుణ వలన ఆ ఫలితముల తీవ్రత తగ్గుతుంది. నిజంగా కలగాల్సిన పెద్ద కష్టం పోయి చిన్న కష్టంతో పోతుంది. పరమాచార్య స్వామిపై మన భక్తి పెరుగుతోంటే మన ప్రారబ్ధ ఫలితముల తీవ్రత కూడా తగ్గుతుంది.

[ప్రారబ్ధం ఎంతటివారైనా అనుభవించాలి. భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. రామకృష్ణ పరమహంసకు గొంతులో రాచపుండు వేసింది. పరమాచార్య స్వామివారికి కళ్ళ సమస్య, పేగుల సమస్య ఉన్నింది. కాని వీటితో సంబంధం లేకుండా ఎప్పుడూ బ్రహ్మము నందు రమిస్తుంటారు. కాని మనం సుఖానికి పొంగిపోయి, కష్టానికి కృంగిపోతుంటాము. అదే వారికి మనకు తేడా]


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...