Sunday 24 December 2023

సంస్కరణ (27-Dec-23, Enlightenment Story)

 *సంస్కరణ*

🍀🌺🍀🌺🍀🌺🍀

బౌద్ధమత ప్రచారం చేస్తున్న గౌతమబుద్ధుడు ఒకసారి శిష్యులతో కలిసి కోసల రాజ్యానికి బయలుదేరాడు. ఆ మార్గంలో ఎదురయ్యే ఒక దట్టమైన అడవిలో అంగుళీమాలుడు అనే దోపిడీ దొంగ ఉండేవాడు. బాటసారులను నిర్దాక్షిణ్యంగా హింసించి ధన, మాన, ప్రాణాలు దోచుకొని చనిపోయినవారి చేతివేళ్ళను కత్తిరించి మెడలో హారంగా వేసుకునేవాడు.
ఆ మార్గంలో ప్రయాణించవద్దని, అంగుళీమాలుడి వలన ప్రమాదం జరుగుతుందని బుద్ధుడికి చెప్పారు ప్రజలు. అంగుళీమాలుడి వంటి వారిలో పరివర్తన కలిగించడమే తన పని అని చెప్పి ముందుకు కదిలాడు బుద్ధుడు. వారికి ప్రమాదం కలుగుతుందేమోనని ప్రజలు వారిస్తుంటే, శిష్యులు కూడా భయపడ్డారు.

మార్గమధ్యంలో ఒక కొండ కనబడింది వారికి. అంగుళీమాలుడు ఉండేది కొండమీదేనన్న విషయం బుద్ధుడికి గుర్తువచ్చి కొండమీదకు నడిచాడు. తనవైపు వస్తున్న బుద్ధుడిని దూరం నుండి చూడగానే అంగుళీమాలుడు ముఖం కోపంతో ఎరుపెక్కింది. తనపేరు చెబితేనే జడుసుకుంటారు జనం. అలాంటిది వెతుక్కుని వస్తున్నాడు అనుకున్నాడు మనసులో.



ఎవడ్రా ఇటు వస్తున్నది?’ అని భయంకరంగా అరిచాడు అంగుళీమాత్రుడు. వాడి మాటలకు శిష్యులకు అడుగు ముందుకు పడలేదు. భయంతో ఆగిపోయారు. బుద్ధుడు ముందుకు నడుస్తూనే ఉన్నాడు.అంగుళీమాలుడు అప్పటికే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని చంపి వెయ్యో వ్యక్తికోసం చూస్తున్నాడు. న మాటలు లెక్కచేయకుండా వస్తున్న బుద్ధుడిని చూడగానే ‘వెయ్యోవాడు’ ఇతడేనేమో అనుకున్నాడు. వెంటనే కత్తి అందుకున్నాడు అదే సమయంలో అంగుళీమాలుడిలో ఆందోళన మొదలైంది. వస్తున్నవాడు సాధువు, మంచివాడిలా కనబడుతున్నాడు. ఇతడిని చంపాలా వద్దా అన్న వూగిసలాట మొదలైంది.

బుద్ధుడిని చూస్తూనే ‘వెనక్కు పారిపో, లేదంటే చస్తావు’ అని అరిచాడు అంగుళీమాత్రుడు.బుద్ధుడు ఆ అరుపులు పట్టించుకోలేదు. వినబడనట్లే ముందుకు నడుస్తూ ‘పారిపోతున్నది నువ్వే, ఆగు వస్తున్నాను’ అన్నాడు.

అంగుళీమాలుడికేమీ అర్థం కాలేదు. ‘నేను పారిపోతున్నానా? ఆగాలా? పిచ్చివాడిలా ఉన్నాడే’ అనుకున్నాడు. బుద్ధుడి మొహంలోని ప్రశాంతత, ఆకర్షణ అంగుళీమాలుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ‘పారిపో, దగ్గరకు వస్తే చస్తావు’ అన్నాడు.

బుద్ధుడు నవ్వుతూనే ఎదురువెళ్లి నిలబడ్డాడు. ప్రాణంమీదకు వచ్చినా భయపడని బుద్ధుడిని చూసి కోపోద్రిక్తుడు అయ్యాడు అంగుళీమాత్రుడు. ‘నువ్వెందుకు భయపడలేదు? నన్ను పారివద్దని చెబుతున్నావు. నేనెందుకు పారిపోతాను? నిన్ను చంపితే వెయ్యిమందిని చంపినవాడినవుతాను’ అన్నాడు అంగుళీమాలుడు.

బుద్ధుడు చిరునవ్వు చిందిస్తూనే ‘నన్ను పారిపొమ్మని చెప్పినపుడే నువ్వు భయపడ్డావు. పాపం ఎక్కడ వుంటుందో భయమక్కడ ఉంటుంది’ అన్నాడు.

అంగుళీమాత్రుడు ‘నిన్ను చంపుతాను కాబట్టి నువ్వే భయపడాలి. ఒక్క వేటుకి నీ తల నరుకుతా’ అని కత్తి ఎత్తాడు.
‘‘నా మాటలు విన్న తరువాత నీకు నచ్చినట్టు చేయవచ్చును. నువ్వు చేస్తున్న హత్యాకాండ నిన్ను ఎప్పుడూ వెంటాడుతూనే వుంటుంది. నువ్వు చేసింది తప్పని తెలిసినరోజున పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వుంటుంది. హింసను వదిలి అహింసమార్గంలోకి అడుగుపెట్టి కొత్త జీవితం ప్రారంభించు’ అని బోధించి, ‘ఇపుడు నా తలను ఖండించు’ అంటూ తల వంచి నిలబడ్డాడు బుద్ధుడు.

కొద్దిక్షణాల తరువాత తలెత్తి చూస్తే అంగుళీమాలుడు నేలమీద పడి ఏడుస్తున్నాడు. ‘‘స్వామీ! ఈ దుర్మార్గుడిని క్షమించండి’’ అంటున్నాడు. బుద్ధుడు అతడిని లేవనెత్తి హృదయానికి హత్తుకుని ‘నువ్వు బందిపోటు వేషాన్ని ధరించావు కానీ ఒక సాధుసన్యాసివి. బందిపోటు గుర్తులు తీసేసి నిలబడు’ అనగానే అతడు మెడలో వున్న అంగుళీమాలను తీసి పారేసాడు.

బుద్ధునికి సాష్టాంగ నమస్కారం చేసి ‘పూర్వజన్మ పుణ్యఫలాల వలన నీ దర్శన భాగ్యం కలిగి ధన్యుడినయ్యాను. మీ శిష్యుడిగా స్వీకరించండి’ అని ప్రార్థించాడు. అప్పటినుండి అహింసామార్గంలో అడుగుపెట్టి బుద్ధుని శిష్యగణంలో కలిసిపోయాడు అంగుళీమాలుడు.

అంతటి అంగుళీమాలుడు కూడా శాంతియుత జీవనం సాగిస్తూ భిక్షకోసం వెళ్లినపుడు, ప్రజలతడ్ని బందిపోటుగా గుర్తించి రాళ్లతో కొట్టి హింసించినా ఎదురుతిరగలేదు. బుద్ధుడి ఒడిలో ప్రాణాలు వదిలాడు.

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️


No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...