Tuesday 12 December 2023

భక్తి - శ్రద్ధ (14-Dec-23, Enlightenment Story)

 భక్తి - శ్రద్ధ 

🍀🌺🍀🌺🍀🌺

ఒక ముసలి భిక్షువు  విష్ణు ఆలయం  దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది.  ఒక రోజు ఓ యోగిపుంగవుడు శ్రీహరి దర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి "అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది. నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను" అని ప్రాధేయపడింది.

ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు...

"తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి  శ్రీహరి!" అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు. ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. అలాగే ఆ విష్ణు ఆలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.

తిరిగి ఆ యోగి పుంగవుడు శ్రీహరి దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, "ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా "  అనడిగాడు.

ఆమె ఆయనకు నమస్కరించి "అయ్యా! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది."ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.

"అవ్వా! తప్పు చదువుతున్నావు! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు! నీ ఇన్నేళ్ళ స్మరణం వ్యర్ధం అయ్యింది" అని కోపంతో వెళ్ళిపోయాడు.

ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ "తవ, మమ" అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది. ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.

ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి" అని ఆయనను హెచ్చరిక చేశాడు.ఆదిత్యయోగీ..

ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శ్రీహరి ఆలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి..."అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు.

కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ, భాషకు కాదని తెలుసుకోవాలి. మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తుంటాయి. కావాలని చేయరు ఎవరూ! పొరపాటులు జరగవచ్చు అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే. చూశారుగా శ్రీహరికి ఏమి కావాలో మనసులో ఆయన మీద భక్తి తప్ప వేరొకటి చూడడు, మనముకూడ  శ్రీహరి నామాన్ని స్మరణ చేద్దాం , స్వామి సన్నిధికి చేరుదాం...

దర్భముడిగినవాడను నేను.  ప్రకాశించువాడివి, దేవతవు, పరమాత్మవు నీవు. నీ సత్యమైన మహిమను వ్యాపింపజేయుట జరుగుగాక!

1.  పుట్టుట తెలియను. మరణించుట  తెలియను. ఈ రెండే తెలియని వాడిని ప్రీతిగా నిన్ను తెలియగలనా! ఓ లక్ష్మీపతీ! ఈ భూమిలో నన్ను పుట్టించిన నీవే- ఈ అజ్ఞానిపై దయతలుతువుగాక!

2. ఏది పాపమని భావించను, ఏది పుణ్యమని తలచను. ఇక నిను ఆలోచనలో తలిచే అవకాశమేది? నా లోపల ఉండి ఇంద్రియములను , ఆదిత్యయోగీ.జీవుని తమతమ కర్మలయందు మెలగజేయు పరమాత్మ నీవు. మలినము పోవునట్లుగా నన్ను రక్షించెదవు గాక! 

3. నా యొక్క విడువదగిన వాటిని గూర్చి తలచను, ఉచ్ఛరించను. నా దోషము తలచను.  ఇక శీఘ్రముగా నీమేలు సంపాదించెదనా? వెల్లడించెదనా? శ్రీ వేంకట పర్వతముపైని ప్రభువా! నీవు భక్తులచే విడువలేని వాడివి. చివరివరకు నన్ను రక్షింతువుగాక!..

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

1 comment:

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...