Tuesday 21 November 2023

దేవుడు మెచ్చిన 8 పూలు (22-Nov-23, Enlightenment Story)

 *దేవుడు మెచ్చిన పూలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

🍁మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. 

ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని

సగుణోపాసన - దైవాన్ని ఓ విగ్రహంలోనో, పటంలోనో, శిలలోనో చూసుకుంటూ, అదే నమ్మకంతో పూలు, ధూపదీప నైవేద్య, తాంబూలాదులతో అర్చించడం సగుణోపాసన, పేరు.. రూపం మొదలైనవి ఏవీ లేవని, 

నిర్గుణోపాసన - స్వామి నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడని ఆత్మజ్ఞానంతో, ధ్యానంతోఉపాసించడమనేది నిర్గుణోపాసన

🍁కొద్దికాలమే ఉండి, తరవాత వాడి, వాసన కోల్పోయి, నిర్మాల్యంగా మిగిలిపోయే ఈ పూలకంటే నిజంగా దైవం మెచ్చిన పూలు వేరే ఉన్నాయి. అవి అంతర్యామికి అర్పించుకోవడమే అసలైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు.

🍁పరమాత్మకు అందించవలసిన ప్రథమపుష్పం అహింస. మనం అహింసా ధర్మం పాటిస్తే ఆ పుష్పంతో పరంధాముణ్ని పూజించినట్లే. లోకంలో దీన్ని మించిన ధర్మం లేదు కనుక దీన్ని పరమధర్మం అన్నారు. శారీరకంగా సాటివారిని హింసించడం శారీరక హింస. మానసికంగా హింసించడం మానసిక హింస. ఈ రెండూ మనిషికి కూడనివి.

🍁రెండో కుసుమం- ఇంద్రియ సంయమనం. మనిషి ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే పాపాలు చేయడు. నేడు ముఖ్యంగా సంయమన లోపం వల్లనే సమాజంలో ఎన్నో దుష్కృతాలు జరుగుతున్నాయి. దోపిడీళ్లు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మనోనియంత్రణ ఉంటే ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకు తగ్గుతాయి.

🍁మూడోది దయాపుష్పం. సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కుంది. 'బతుకు, బతకనివ్వు' అన్నారు అందుకే! సమాజం ఎంతోమంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పీడితులు, క్షుద్బాధతో అలమటిస్తున్నవారున్నారు. వారిపట్ల దయ చూపించడమే కాక, ఆదుకుని చేయి అందించడం మన ధర్మం. ఈ దయా ప్రసూనాన్నే దేవుడు స్వీకరిస్తాడు.

🍁మరో పుష్పం - క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, సహనం. క్షమ అనేది మనిషికి పెట్టని ఆభరణం. క్షమ వల్ల ఖ్యాతి లభిస్తుంది. గౌరవం, అధికారం, అభిమానం సహనం వల్లనే లబిస్తాయి.

🍁ఆశ్రితవత్సలుడు మెచ్చే మరో అపురూప ప్రసూనం- శాంతి. ఎన్ని కష్టాలు పడ్డా తుకారాం, మీరాబాయి శాంతిని విడనాడలేదు.

🍁తపఃపుష్పం దేవుడు మెచ్చే మరో పుష్పం. అడవుల్లో చేసేదే తపస్సు కాదు. నిరంతరం త్రికరణ శుద్ధిగా దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావడమూ తపస్సే. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, తమ విధులనే నిధులుగా భావించేవారిని భగవంతుడు ఇష్టపడతాడు.

🍁మరో పుష్పం ధ్యాన పుష్పం. శ్వాసపైన ధ్యాస ఉంచి, అహం బ్రహ్మాస్మి అనుకోగల పరిణతి పొందడమే ధ్యాన పుష్పం.

🍁చివరి పుష్పం సత్యం. విశ్వమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది. సత్యం నిత్యమైనది. శాశ్వతమైనది. సత్యమే దైవమన్నారు.

🍁ఈ అష్టగుణ సుమాలతో చేసే ఆరాధనే తన కిష్టమన్నాడు ఆపద్బాంధవుడు.

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...