Tuesday 21 November 2023

చమత్కార శ్లోకము (25-Nov-23, Enlightenment Story)

 *చ మ త్కా ర శ్లో క ము🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

ఒక బ్రాహ్మణుడు ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళాడు.  ఆ ధనికుడు సంపాదనతో పాటు సంస్కారమున్నవాడు.ఆ బ్రాహ్మడికి కడుపునిండా షడ్రసోపేతమైన భోజనం పెట్టి, చక్కని పట్టు వస్త్రాలను యిచ్చి ఘనంగా సత్కరించాడు. దానితో బ్రాహ్మణుడు తనకు జరిగిన సత్కారానికి మిగుల సంతోషించి, ఆ ధనవంతుడిని ఆశీర్వదించాలని అనిపించింది.  ఒక ఆశీర్వచన  శ్లోకం ఇలా చెప్పాడు. 

శ్లోకం.

విహంగో వాహనం యేషాం,   త్రికంచధరపాణయః,    పాసాల సహితా దేవాః,  సదాతిష్ఠన్తు తే గృహే,

భావము.

పక్షులు వాహనాలుగా కలవారునూ, త్రికములను ధరించిన వారునూ, పాసాల తో నిండిన వారునూ, అగు దేవతలు మీ యింట ఎప్పుడూ ఉందురు గాక! ఇదేమి ఆశీర్వచనం అనుకుంటే పొరపాటే... దీని అర్థం ఇలా ఉంది...

వి అంటే పక్షి,

హం అంటే హంస,

గో అంటే ఎద్దు,

పక్షి వాహనంగా కలవాడు విష్ణువు. హంస వాహనుడు బ్రహ్మ. ఎద్దు వాగాహనం గలవాడు శివుడు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ...

త్రికంచ అనగా...

త్రికం ను ధరించినవారు.

త్రి అంటే త్రిశూలం.*

కం అంటే శంఖము.*

అంటే చక్రములను ధరించినవారు

త్రిమూర్తులు, త్రిశూల ధారి శివుడు. శంఖ ధారి బ్రహ్మ.సుదర్శన ధారి విష్ణువు.ఈ ముగ్గురూ పాసాలతో కూడిన దేవతలు.

పా అంటే పార్వతి.*

అంటే సరస్వతి.*

అంటే లక్ష్మీ దేవి.

పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి తో కూడిన దేవుళ్ళు మీ యింట ఎల్లప్పుడూ వుందురుగాక!  అని అర్థము. సరస్వతి, లక్ష్మీ, పార్వతులనడంలో విద్యలు, ఐశ్వర్యములు, సౌభాగ్యములు మీ యింట వుండాలి అని అర్థం.

శంఖ, చక్ర, త్రిశూలములు ధరించిన వారు అనడం వలన శత్రు బాధలు, రాక్షస బాధలు, మీకు వుండవు అని భావము. త్రిమూర్తులు వారి భార్యలతో మీ ఇంట వుందురు గాక! అనటం తో సర్వ సౌఖ్యములు, విద్యలతో పాటు, శాశ్వతమైన పరంధామము మీకు లభించుగాక!  అని అంత గొప్ప ఆశీర్వచనం ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు.

చమత్కారమైన ఆశీర్వాదము



☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

4 comments:

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...