Wednesday 22 November 2023

కనబడని ధర్మం (28-Nov-23, Enlightenment Story)

 *కనబడని ధర్మం*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

ధర్మం అంటూ ఉంటారు. దానిని ఎవరూ చూడలేదు కదా! ఆ చూడని ధర్మాన్ని ఒప్పుకో అని ఎందుకు నిర్బందిస్తారు?ధర్మం అనేది కనబడకపోయినప్పటికీ దానిని ఆచరించడమే మేలు. ఆచరించకపోతే అనర్థం ఒకపక్షంలో తప్పదు. ఎలా అంటే ఒక ఇద్దరు దారిలో నడుస్తూ ఉన్నారు. వారికి ఒక పుట్ట కనిపించింది. ఆ పుట్టలో పాము ఉందా? లేదా? అని వారిద్దరిలో విమర్శ వచ్చింది. ఒకడన్నాడు దానిలో పాము లేదు అని, ఒకడు పాము ఉంది అన్నాడు.

పాము లేదు అన్నవాడు పుట్టమీద కాలు పెట్టి వెళతాను అన్నాడు. పాము ఉంది అన్నవాడు దానిమీద కాలు పెడితే కాటేస్తుంది ప్రక్కనుంచి వెళతాను అన్నాడు. వీళ్ళిద్దరి వివాదం వింటున్న మూడవ వాడు అయ్యా అక్కడ పాము ఉన్నా లేకపోయినా ప్రక్కనుంచే వెళ్ళడం మంచిది.

ఎందుకంటే అలా వెళ్తే ఎట్టి పరిస్థితిలో నీకు అనర్థం కాదు. అక్కడ నిజంగానే పాము ఉంటే దానిమీద కాలు పెడితే అది నిన్ను కాటేస్తుంది. ప్రక్కనుంచి వెళ్తే అక్కడ పాము ఉన్నా లేకపోయినా నీకేమీ ఇబ్బంది కలుగదు.

అలాగే పరలోకం ఉన్నా లేకపోయినా ధర్మాన్ని ఆచరించావు అంటే  ఏ పక్షంలోనూ ఇబ్బంది కలుగదు. ధర్మాన్ని ఉల్లంఘించిన వాడికి ఆ పరలోకం ఉన్నది అనే గనుక తీర్మానం అయినట్లయితే వాడికి అనర్థం తప్పదు, వాడికి క్లేశం తప్పదు.

!! సందిగ్ధేపి పరే లోకే కర్తవ్యో ధర్మ ఏవ హి! నాస్తి చేన్నాస్తి నో హానిః అస్తి తే నాస్తి కో హతః!!


పరలోకం అనేది ఉన్నదా లేదా అన్న సందేహం ఉన్నా కూడా ధర్మాన్ని ఆచరించే పక్షంలో ఏవిధంగాను ఇబ్బంది అనేటటువంటిది కలుగదు. (సందేహానికి అవకాశం లేదు ఉన్నది అని సిద్ధాంతం చేశాం). కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ధర్మాన్ని ఉల్లంగించడానికి వీలులేదు.

భగవంతుడిని విశ్వసించకుండా ఉండడానికి వీలులేదు. భగవంతుడిని విశ్వసించాల్సిందే, ధర్మాన్ని ఆచరించవలసినదే. దానివల్లనే నీకు శ్రేయస్సు కలుగుతుంది.ఇది మనయొక్క స్వధర్మం

భగవద్గీత 3-35….

||“ శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ||

|| స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః || ”

ఈ ‘స్వధర్మాన్ని ఎన్నడూ విడిచిపెట్టవద్దు. పరధర్మం జోలికి ఎన్నడూ పోవద్దు!’ అని భగవంతుడు భగవద్గీతలో దేన్నైతే చెప్పాడో దానిని మనం ప్రతి ఒక్కరం జ్ఞాపకం పెట్టుకోవాలి. 

మనయొక్క స్వధర్మాన్ని సర్వదా ఆచరించాలి. పరధర్మం జోలికి ఎన్నడూ పోకూడదు. అలా పోయేవారికి కూడా మనం బుద్ధి చెప్పాలి. భగవంతుడి ఆదేశాన్ని మనం శిరసావహించి ఆచరించాలి.✍️

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

1 comment:

  1. మంచి అంశాలు అందిస్తూ ఉన్నారు. 🙏ధన్యవాదములు.🌺

    ReplyDelete

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...