Thursday 18 May 2023

సంతృప్తి (20-May-23, Enlightenment Story)

 *సంతృప్తి*

🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸

నిత్యజీవితంలో ఉన్నదానితో ఆనందపడడమే సంతృప్తి.

ఒక రోజు ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు, ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. 

అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది, అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు, కింద పడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.

ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు, అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు.

ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు, ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు, అక్కడి హుండీలో ఓ పది రూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు, సంతోషంతో ఇంటికి చేరాడు.

పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి, ఆ దార్లో కాస్సేపటికి వేరే ఒకడు వచ్చాడు. అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు, వెంటనే లెక్కపెట్టాడు, వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ లెక్కించాడు, ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.

బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు, కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది, అయినా వెతుకులాట మానలేదు.

ఈ కథను చెప్పిన ఓ గురువు ఫకాలున నవ్వాడు. ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు, కాఫీ తాగాడు, కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలు పెట్డాడు.

నీతి

మనం ఈరోజు లభించిన దానితో ఉన్నదానితో అనుభవించము... దానితో తృప్తిపడము లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటాము, ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు...

దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది, ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు, సంతృప్తి వుండదు.

🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸🌸🌿 🌸🌿🌸 🌿🌸🌿🌸

No comments:

Post a Comment

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే (16-May-24, Enlightment Story)

భగవంతుడు దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 🌺🍀🌺🍀 భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొం...