బాధ్యత ,ఆశ ,అత్యాశ !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌸ఒకనాటి కాలాన మహాశివుడి కోసం ముగ్గురు తపస్సు చేస్తూ ఉంటారు.
🌸ముందుగా పాము ఆ పామును చూసి తేలు ఈ ఇద్దరినీ చూసి (చీమ) నేనెందుకు తక్కువ నేను ఏదో ఒకటి కోరుకుంటా అనుకుని చీమ తపస్సు చేస్తూ ఉంటాయి చీమకు అత్యాశ ఎక్కువ వారు కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే,
🌿చీమ మాత్రం ఒంటికాలుపై తపస్సు చేస్తూ ఉంటుంది వారికంటే ఎక్కువ నేనే నన్నే మెచ్చుకోవాలి నాకే కావాలి అని తపస్సు చేస్తూ ఉంటుంది ఇకపోతే భగవంతుడు ఆ బోళాశంకరుడు ప్రత్యక్షం అవుతాడు ముందుగా పాము దగ్గరకి వెళ్తాడు నాగరాజ నీ తపస్సుకు మెచ్చితిని
🌸నీకు ఏమి కావాలో కోరుకో అని అంటాడు అంతలో పాము నాకు కొంచెం భయంగా ఉంది ఈ మానవులతొ వారు నన్ను ఏమైనా అంటేనే నేను కుడుతా నేను కుట్టిన గంట తర్వాత వారు చనిపోవాలి అలాంటి వరం ప్రసాదించు అని అంటుంది పాము తథాస్తు అని ఆ బోళాశంకరుడు పక్కనే ఉన్న తేలు వద్దకు వెళ్తాడు.
🌿తేలు నీ కోరిక ఏమిటో చెప్పు అని అడుగుతాడు అప్పుడు తేలు స్వామి నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నేను కుడతాను నేను కుట్టగానే నా గురించి వారికి తెలిసేలామంటలుపెడబొబ్బలతో వారు కొట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల వరకు వాళ్లకు నా శక్తి ఏమిటో తెలియజేయాలి అని కోరుకుంటుంది.
🌸అప్పుడు బోళాశంకరుడు పరవాలేదు నీవు తీసుకున్న కోరిక బాగానే ఉంది ఆశ పడుతున్నావు తప్పులేదు తథాస్తు అని దీవిస్తాడు. ఇక చివరగా చీమ వద్దకు వెళ్తాడు
🌿చీమకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ తన కోసం తాను కాకుండా ఇతరుల కంటే ఎక్కువగా నేను కోరుకోవాలి అని అత్యుత్సాహంతో అత్యాశ పడుతూ కోరిక కోరుకుంటుంది చెప్పు చీమ నీకు ఏమి వరం కావాలో కోరుకో అంటాడు.
🌸అప్పుడు దేవుడా నన్ను ఎవ్వరు ఏమనుకున్నా నేను పోయి కుట్టగానే చచ్చిపోవాలిఅని వరంకోరుకుంటుంది.బాగా ఆలోచించు చీమ అని శివుడు అడుగుతాడు ఆలోచించేది ఏం లేదు నాకు అదే వరం కావాలి అనే చీమ తక్షణమే ఇవ్వు లేకపోతే లేదు అని అలుగుతుంది
🌿శివుడు అప్పుడు సరే నీ ఇష్టం తదాస్తు అని దీవిస్తాడు ఇప్పుడు విషయానికి వద్దాం పైవి రెండు ఎలా ఉంటుందో అవి కరిస్తే మనకు ఎలా బాధ ఉంటుందో తెలుసు చీమ విషయంగా మాట్లాడుకుందాం
🌸మనము ఆవేశం తోటి తీసుకునే నిర్ణయం ఎదుటి వారి మీద అనవసర ఆవేశంతో ఎలాంటి పరిణామం జరుగుతుందో చీమ గురించి అత్యాశ పరులు గురించి చెప్పుకుందాం చీమ కోరుకున్న వరం కుట్టగానే ఎవరు ఏమనుకున్నా నేను కుట్టగానే చావాలి అని కోరుకుంటుంది
🌿ఎప్పుడైనా మనల్ని చీమ కుట్టగానే మనము చేయితో చరుస్తాం లేదా నలిపి చంపుతాం దాన్ని కోరిక ప్రకారం దాని జీవితం సమాప్తం ఇక మిగతా విషయం మీకు అర్థమయి ఉంటుంది. జీవితంలో ఆశ ఉండచ్చు. అత్యాశ ఉండకూడదు. *స్వస్తీ*🚩🌞🙏🌹🎻
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment