*అరటి కథ*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
క్రోధానికీ, కామానికీ బానిసలైతే కలిగే దుష్పరిణామాలను తెల్పుతుంది ఈ కథ. ఆడైనా మగైనా నోటిదురుసుతనం, అయిన దానికీ కానిదానికీ దుర్భాష లాడితే కలిగే ఫలితం ఏమిటో చదవండి
ఔర్వుడు అనే మహర్షి కూతురు కందళి. ఆమె చాలా అందగత్తె, మంచి సుగుణాలు వున్నది. కానీ ఆమెకు నోటి దురుసుతనం యెక్కువ. ఆమె దుర్వాస మహర్షిని పెళ్లి చేసుకుంటానని తండ్రి తో చెబుతుంది.
ఆయన చాలా కోపిష్టి అని తండ్రి వద్దని వారిస్తాడు.కానీ కందళి పట్టు బడుతుంది. సరే యని ఆమెని దూర్వాసును దగ్గరికి తీసుకెళ్ళి ఆమె గురించి వివరంగా చెప్పి ఆమె కోరిక గురించి చెప్తాడు.
అన్నీ విన్న దూర్వాసుడు ఆమె అందానికి మోహితుడై ఆమెను వివాహం చేసుకోడానికి అంగీకరిస్తాడు. కాకపొతే కందళి యొక్క నూరు దుర్భాషలను క్షమిస్తానని ఆ పైన వూరుకోననీ ఒక నియమం పెడతాడు.
తండ్రీ కూతుళ్ళు ఒప్పుకుంటారు.ఆ పైన ఔర్వుడు వివాహం జరిపిస్తాడు. కొంత కాలం వారి దాంపత్యం సవ్యంగానే సాగుతుంది. ఆమె నోటి దురుసుతనం దూర్వాసుడికి కష్టం కలిగించినా యిచ్చిన మాటకు కట్టుబడి ఆమెని క్షమిస్తాడు. చివరకు ఆమెతో మాట్లాడకుండా వుండే పరిస్థితులు వస్తాయి. అలా కొంతకాలమయ్యాక ఆమె నూరు దుర్భాషలూ పూర్తవుతాయి. ఒక రోజు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో వుండగా కందళి వచ్చి ఏమిటి నాతో మాట్లాడరా? అని దబాయిస్తుంది.
అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగి వున్న దుర్వాసుడు కళ్ళు తెరిచి ఆమెను తీక్షణంగా చూస్తాడు. ఆ చూపుకు కందళి నిలువెల్లా మాడిపోయి బూడిదవుతుంది. ఆమె ఆత్మ రూపంలో వచ్చి నిలబడి ఆయనను క్షమించమని వేడుకుంటుంది.
తర్వాత దుర్వాసుడు ఆమెను భస్మం చేసినందుకు బాధ పడుతూ వుండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక స్త్రీ కోసం తన తపస్సు యొక్క శక్తిని దుర్విని యోగం చేసుకున్న దుర్వాసుడికి కర్తవ్య దీక్షను వివరిస్తాడు. తన కోపానికి గురైన భార్య గుర్తుగా కందళీ వృక్షాన్ని సృష్టిస్తాడు.
కందళి క్రమేపీ కదళి గామారిన అరటికి మానవుల పూజలలో, తాంబూలం లో యెంతో ప్రాధాన్యం వుండేట్టు అనుగ్రహిస్తాడు దుర్వాసుడు. అదీ మన అరటి కథ. తపశ్శక్తి వున్న మహర్షి, యెంత అందం సుగుణాలు వున్నఆడైనా మగైనా దుర్భాష లాడితే కలిగే అనర్థాలను ఈ కథ మనకు తెల్పుతుంది.
యిప్పటి మన సమాజంలో విడాకులకు దారితీసేది కూడా ఈ కోపం, దుర్భాషలే. అందుకే అవి అదుపులో పెట్టుకోవాలని తెలుసుకోవాలి.
ఆదివారము నాడు అరటి మొలిచింది
సోమవారము నాడు సుడి వేసి పెరిగింది
మంగళవారము నాడు మారాకు తొడిగింది
బుధవారము నాడు పొట్టి గెల వేసింది
గురువారమునాడు గుబురులో దాగింది
శుక్రవారము నాడు చక చకా గెల కోసి
అందరికి పంచితిమి అరటి అత్తములు
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment