Sunday, 13 August 2023

మానవ సంబంధం (18- Aug-23, Enlightenment Story)

 *మానవ సంబంధం*

🌹🌹🌹🌹🌹🌹🌹

'కూరగాయలమ్మా కూరగాయలూ' లచ్చిమి నెత్తి మీద గంపతో అరుస్తూ వీథిలో వెళ్తోంది. ఓ ఇంటి దగ్గర ఆగి మళ్లీ అరిచింది. ఇంట్లో నుంచి సుబ్బమ్మ బయటికి వచ్చి గంప కిందకు దింపడానికి సాయం చేసింది. అరుగు మీద పెట్టారు. పాలకూర ఒక్కోకట్ట ఆరు రూపాయలు చెప్పింది ఆమె. ఈమె రెండు రూపాయల నుంచి బేరంమొదలుపెట్టింది. ‘‘కుదరదమ్మా మేమూ బతకాలి కదా అయిదు రూపాయలకైతే ఇస్తా.’’ ‘‘మూడు రూపాయలకు కట్ట, అంతకుమించి పావలా కూడా ఇవ్వను.’’ ఆ ఇద్దరికీ తెలుసు, ఈమె సగానికి కోసి అడుగుతుందని ఆమెకు. 

అందుకే ఆమె ముందుగానే ఎక్కువ రేటు చెబుతుందని ఈమెకు. కాసేపు బేరమయ్యాక ‘ఫోవమ్మా, ఆ రేటుకు ఇవ్వలేను, నేను పోతున్నా’ అని గంప ఎత్తుకుని కొద్దిదూరం వెళ్లింది, వెనక్కి తిరిగి చూస్తూ ‘చివరకు నాలుగు రూపాయలయితే ఇస్తా’ అంది. ‘అక్కర్లేదు,ఇంకొకామె రోజూ వస్తోంది, ఆమె దగ్గర తీసుకుంటా’ అంది సుబ్బమ్మ. లచ్చిమి ఇంకాస్త దూరం వెళ్లింది తరువాత వెనక్కి తిరిగి మళ్లీ అదే అరుగు దగ్గరకు వచ్చింది. సుబ్బమ్మ తలుపు దగ్గరే ఉంది. ఆ నాలుగు పాలకూర కట్టల్ని నిశితంగా పరిశీలిస్తూ నాణ్యత, కట్టలో ఆకులు గట్రా సరిచూసుకుంటూ తనకు కావల్సినవే తీసుకుంది. 

చివరకు 12 రూపాయలు లచ్చిమి చేతిలో పెట్టింది.ఆమె లెక్క పెట్టకుండా తన నడుముకున్న చిన్న సంచీలోకి కుక్కేసింది. డీల్ అయిపోయింది.గంప నెత్తికెక్కడానికి సాయం చేయబోతూ ‘‘ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నవ్ ? పొద్దుటి నుంచీ ఏమైనా తిన్నావా లేదా?’’ అడిగింది

 సుబ్బమ్మ. ‘లేదమ్మా ఇంట్లో సరుకుల్లేవ్. వెళ్లేటప్పుడు బియ్యం, ఉప్పూపప్పూ తీసుకుపోవాలి, వండుకోవాలి.’ కాసేపాగు అంటూ ఇంట్లోకి వెళ్లిన సుబ్బమ్మ విస్తరాకులో కాస్త అన్నం, పప్పు పెట్టుకుని బయటికి వచ్చి లచ్చిమికి ఇచ్చింది. ఓ చెంబులో నీళ్లు తెచ్చింది. ఆమె తిన్నది. ఆమె తింటూ ఉన్నంతసేపు ఇద్దరూలోకాభిరామాయణం, ఈతిబాధలు చెప్పుకున్నారు. చివరికి ఈమె గంప ఎత్తి ఆమె నెత్తి మీద పెట్టింది, ఆమె మెల్లిగా మరో వీథిలోకి వెళ్లిపోయింది. 

ఇది గమనిస్తున్న సుబ్బమ్మ బిడ్డ అడిగింది విసుగ్గా‘‘ఏంటి మమ్మీ ఆఫ్టరాల్, 3రూపాయల ధర దగ్గర అంతగా బేరమాడినవ్. ఆమె ఆకలిగా ఉందనగానే నువ్వే కడుపు నింపి పంపించావ్. నువ్వు అర్థం కావు’’. ‘‘అది కాదే తల్లీ పాలకూర దగ్గర నేను కస్టమర్, ఆమె ట్రేడర్. 

ఎక్కువ రేటు కోసం ఆమె ప్రయత్నం, తక్కువ రేటు ప్లస్ నాణ్యత నా తాపత్రయం. ఇది సహజం. అవసరం. వ్యాపారమంటేనే అంత.’’ ‘‘నువ్వు బేరమాడిన 3రూపాయలు ఎక్కువా. రూపాయల్లో నువ్వు పెట్టిన అన్నం విలువ ఎక్కువా?’’ ‘‘దేని దారి దానిదే. బేరసారాల్లో మానవత్వం ఉండదు. మానవత్వంలో బేరసారాలు ఉండకూడదు. ఒకటి ట్రేడర్ - కస్టమర్ బంధం. మరొకటి మానవ సంబంధం.’’ ‘‘ఏమో, నాకేమీ అర్థం కాలేదు. నీకే కాదు, చాలా మందికీ అర్థం కాదు. పద లోపలకు."


🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...