🪔🪔🌺*అంతర్యామి - తెలియనితనమే అజ్ఞానం*🌺🪔🪔
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🍁జననం నుంచి మరణం వరకు ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కూర్చోవడం, నిలబడటం, మాట్లాడటం, నడక, పరుగు..వంటివి శారీరక ఎదుగుదలకు సహజంగా నేర్చుకునే పనులు, పాఠశాల, కళాశాలల్లో తెలుసుకున్న విషయాలు జీవన వృత్తిలో రాణించేందుకు అవసరం. ప్రతి పనిలోనూ అర్ధం, అంతరార్థం ఉంటాయి. అంతరార్ధం తెలియాలంటే పరిశీలన దృష్టి, పరిశోధన పూర్వకంగా కృషి కావాలి. దాన్నే శ్రీవిద్య అంటారు.
🍁అయ్యయ్యో తెలియనైతి ఆదినారాయణుణ్ని ఎరుగనైతి అని భక్త రామదాసు పరమాత్మను తెలుసుకోలేక కాలాన్ని వ్యర్ధం చేశానని కృతిపరంగా ఆవేదన వ్యక్తం చేశాడు. తెలిసిన తరవాత నాలుగు వందల కీర్తనలతో వాగ్గేయకారుడిగా భక్తి సామ్రాజ్యంలో శాశ్వత కీర్తి సాధించాడు. ఎంతటి గొప్పవారైనా ఎప్పుడో ఒకప్పుడు తెలియని అజ్ఞానంతో ప్రవర్తిస్తారు.
🍁జగద్గురు ఆదిశంకరాచార్య నదీస్నానానికి వెళ్ళే సమయంలో చండాలుడి రూపంలోని శంకరుడు దారికి అడ్డుగా వచ్చాడు. పక్కకు తొలగమని జగద్గురువు చెప్పాడు. ఎవరిని తొలగమంటావు. ఈ శరీరాన్నా లేక దీనిలో ఉన్న ఆత్మనా అని ప్రశ్నించాడు చండాలుడు. శరీరమైతే అందరిదీ పంచభూతాత్మకమే, ఆత్మను అయితే అది పరమాత్మ స్వరూపం.ఏది పక్కకు తొలగాలి? ఈ ప్రశ్నకు శంకరాచార్య అతన్ని తనలో దాగిఉన్న అజ్ఞానాన్ని తొలగించే పరమేశ్వరుడిగా గుర్తించి ప్రణమిల్లాడు.
🍁రామాయణంలో చిత్రకూట పర్వతం నుంచి సీతా రామ లక్ష్మణులుదండకారణ్యానికి ప్రయాణం మొదలు పెట్టారు. ఆ సమయంలో శ్రీరాముడు చెప్పినమాటలు అందరికీ వర్తిస్తాయి.
🍁 'లక్ష్మణా! ఇప్పటివరకు మనకు సుమంత్రుడు,గుహుడు, భారద్వాజుడు అడవిలో దారి చూపించారు. ఇప్పుడు మనం ఒంటరిగా అడవిలో మార్గాన్ని వెతుకుతూ వెళ్ళాలి. దండకారణ్యం చేరడం మన లక్ష్యం. అడవిలో దారి తెలియదు కానీ దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనకన్నా ముందువారు ఏనుగును నడిపించి దారి ఏర్పాటు చేసి ఉంటారు. ఆ దారి కనిపెట్టి మనం నడవాలి. దారి గుర్తు కోసం మహర్షులు చెట్ల కొమ్మలకు తమ వస్త్రాలు కడతారు, ఆశ్రమాల జాడను దూరం నుంచి పొగ ద్వారా కనిపెట్టవచ్చు. మహర్షుల సహాయంతో మనం దండకారణ్యం చేరాలి??
🍁జీవన గమనం కూడా జనారణ్య ప్రయాణమే. ఒంటరిగానే సాగించాలి. మనతో చివరివరకు ఎవరూ తోడు రారు. మనకన్నా ముందు తరంవారు మార్గ నిర్దేశం చేసే ఉంచారు. దాన్ని తెలుసుకుని ప్రయాణం సాగించాలి.
🌻||కృష్ణం వందే జగద్గురుమ్||🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment