*దీపంలో ఉండే నవగ్రహాల శక్తి *🪔🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మన సనాతన సంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వడమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మిక మైన కార్యక్రమాల్లో మనందరం కుడా దీపాలు వెలిగిస్తాము. దీపాలకు కొండెక్కటానికి ముందు స్వస్తి చెప్పటం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెపుతుంది.
- దీపపు ఎర్రని ప్రమిద సూర్యుడు🙏,
- తెల్లని నెయ్యి అంశం చంద్రుడు ,
- వెలిగే దీపం నిప్పు కుజుని అంశం,🙏
- ప్రమీదలోని నెయ్యిని కాంతికి
- అనుసంధానం చేసే వత్తే బుధుడు.
- దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు గురువు🙏,
- దీపం నుంచి వెలువడే తెల్లని కాంతి పుంజమే శుక్రుడు🙏
- దీపం జ్వాలను వచ్చే నల్లని మసే శనీశ్వరుడు
- దీపం నీడ రాహువు 🙏
- దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షమే కేతువు*
- కనుక దీపం లక్ష్మీ స్వరూపమే కాదు నవగ్రహ స్వరూపం కూడా.🙏🙏
- అంతేకాదు దీపం పంచభూతాల స్వరూపం కూడా.
ఎలాగంటే..
ప్రమిదపు మట్టి భూమి గాను నెయ్యి నీరు గాను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశం గాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.
దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల, నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు.🙏
ప్రతి గృహిణి ఉదయం లేవగానే నిత్య కృత్యాలు పూర్తి చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించాలి. సంధ్యా సమయం లో కూడా దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. అయితే రోజు మొత్తంలో ఒకసారి కూడా దీపం పెట్టని ఇల్లు శవం తో సమానం. ఈ దీపం మనకు లక్ష్మి కటాక్షం మాత్రమె కాక మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్ర పరుస్తుంది. కరెంట్ బల్బ్ లు వచ్చాక సంధ్యా దీపాలను పెట్టడం అందరు మరచి పోయారు. సంధ్యా దీపాల వలన గాలిలో ఉన్న బాక్టీరియా ని నశి౦ప చేస్తాయి.
ఇంటి ముందు గడప దగ్గర దీపం పెట్టడమనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యే లాగా చేస్తాయి. సృష్టిని నిద్ర లేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే, సంధ్యా దీపం సూర్యుని యొక్క ప్రతి రూపంగా చెపుతారు. లోకాన్ని చీకటి నుండి వెలుతురులోకి నడిపించటానికి దీపం ఉపయోగపడుతుంది. అందుకే దీపానికి నమస్కారం చేయాలి. దీపం మానవునిలోని రాగ, ద్వేషం, అసూయ, అహంకారంలను తొలగిస్తుంది.
శుభం కురుత్వం కళ్యాణం, “ఆరోగ్యం” ధన సంపదం.
శత్రువు బుద్ధి వినాశాయ, దీప జ్యోతిర్ నమోస్తుతే.
దీప జ్యోతిర్ పరబ్రహ్మ ,దీపం జ్యోతి జనార్ధనః.
దీపో హరతుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే
🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః🙏
🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment