Wednesday, 9 August 2023

పుట్టింటి పిలుపు ఆడవారికి సౌభాగ్యం (11-Aug-23, Enlightenment Story)

 * పుట్టింటి పిలుపు ఆడవారికి సౌభాగ్యం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


తల్లిదండ్రులు దూరం అయినా అన్నదమ్ములు బతికి ఉన్నంత వరకే ఆడబిడ్డకి పుట్టిల్లు అన్నదమ్ములు లేకపోతే కష్టం చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు అన్న తీర్చలేని కష్టమే అయినా వారు మాకున్నారు అనే ధైర్యం ఎంత పెద్ద సమస్యతో అయినా పోరాడే బలాన్ని ఇస్తుంది.. 

శ్రావణ మాసం వస్తుంది ఖర్చని బరువని అనుకోకుండా అన్నదమ్ములు మీ అక్కచెల్లెళ్లను పిలిచి బట్టలు పసుపుకుంకుమా ఇచ్చి నిండు జీవితం పసుపుకుంకుమతో సౌభాగ్యం ఉండాలని కొరుకుని పంపండి, వాళ్ళకి నచ్చిన పిండి వంటలతో ఒడి నింపండి.. అప్పుడు వాళ్ళు మీ నట్టింట్లో సంతోషంతో నవ్వితే అదే మీకు సిరుల పంట అవుతుంది. ఎన్ని మనస్పర్థలు ఉన్న తొలగిపోతాయి సొంత అన్నదమ్ములు లేని వారికి ఆ అదృష్టం ఉండదు, ఉన్నవారు అయినా ఆ బంధాన్ని నిలుపుకోండి. ఈ జన్మకే ఈ రక్తసంబందం మనతో పాటు పుట్టి చిన్నతనం నుండి కష్టసుఖాలు కలిసి పంచుకుని ఊహ తెలిసాక అహంకారంతో దూరమైపోతున్నారు. మళ్ళీ జన్మకు ఎవరు ఎక్కడ పుడతారో ఈ జన్మకే మనకు ఋణం..

అత్తగారి ఇళ్ళు ఎంత సంపన్నులు అయినా పుట్టిల్లు ఇచ్చే చీర ఆడవాళ్ళకు చాలా అపురూపం అమ్మవారు పెట్టిన సారిగా భావిస్తారు. వారితో దీపం పెట్టించి ఇంట్లో తీపి పదార్థాలు వండించి దేవుడికి నైవేద్యం పెట్టించి పూజ చేయించాలి మీరు పెట్టాలి అనుకున్న సారె దేవుడి దగ్గర పెట్టి పూజ ఐయ్యాక ఆమెకు పెట్టాలి.. మీ ఇంట్లో కొత్తబట్టలు కట్టుకుని పసుపుకుంకుమా తీసుకుని వెళ్లినా మంచిది.

ఆడవాళ్ళందరికి అటువంటి సంతోషం ఉండాలనే ఇలా తెలియని వారికి కూడా తెలియాలని మెసేజ్ చేస్తున్నాను.. ప్రతి సంవత్సరం అలా వచ్చి చీరే పెట్టే స్థితిలో మా పుట్టిల్లు ఉండాలి అని ఆడపిల్లలు కోరుకోవాలి. వాళ్ళ స్థితి కొద్ది ఎంత తక్కువ ఖరీదులో చిరపెట్టిన అక్కడ ధర చూడకూడదు పుట్టింటిని తక్కువ చేయకూడదు.. ఆ గడపకు పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసి ప్రతి సంవత్సరం ఇలాగే నేను నా పుటింటి సారె తీసుకోవాలని మంచి మనసుతో కోరుకోవాలి..

ఒకవేళ అక్కచెల్లెళ్లలో పూర్వ సువాసినిలు ఉంటే వారికి కూడా బట్టలు పెట్టి పంపితే చాలా మంచిది అటువంటి వారి ఆశీర్వాదం చాలా త్వరగా ఫలిస్తుంది ,ఎందుకంటే వాళ్ళను ఎవరూ పేరంటాలకు పిలవరు ఎదో చాదస్తం కొద్ది, అన్నదమ్ములు అయినా పిలిచి బట్టలు పెట్టి పంపిస్తే వాళ్ళ మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది..

ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పుడంటే..

అయితే ఇది అధిక మాసం. జూలై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసంగా పేర్కొంటారు. ఆ తర్వాత ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారంతో ఈ మాసం ముగుస్తుంది.

🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...