🪔🪔రాఖీ పౌర్ణమి 🪔🪔
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న లేదా 31వ తేదీ అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి..
ఈ ఏడాది 30 ఆగస్టు 2023 బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 31 ఆగస్టు 2023 ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ పండుగను ఆగస్టు 30వ తేదీన జరుపుకోవచ్చని ఉత్తర భారతంలోని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈరోజున భద్ర కాలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే దక్షిణ భారతదేశంలో ఏ పండుగకైనా సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి రాఖీ పండుగను గురువారం జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల పండితులు చెబుతున్నారు.
హిందూ పంచాంగం ప్రకారం.ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న (బుధవారం) మొదలవుతోంది. అయితే.. ఆ రోజున భద్ర కాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది.శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి.
భద్ర అంటే
పురాణాల ప్రకారం, సూర్య దేవుని పుత్రిక భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టినప్పుడే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్ర కాలంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం, భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు, కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావు.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment