Wednesday, 9 August 2023

ఆడికృత్తిక - శరవణ భవ (12-Aug-23, Enlightenment Story)

 *ఆడికృత్తిక, 09-Aug-23*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కృత్తికా నక్షత్రాన జన్మించిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధనలో కృత్తికా నక్షత్రం ప్రత్యేకమైంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున తమిళనాట ఆడికృత్తికను నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజది. ఆడికృత్తికనాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో 'ఆరు పడైవీడు'గా ప్రసిద్ది చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు. వీటిని ఒకేరోజులో దర్శించలేం. ఆడికృత్తిక నాడు శరవణ భవ నామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుంది.


🌺 కుమార బ్రహ్మచారి - తిరుచెందూరు 🌺

కుమార స్వామి తిరుచెందూరులోనే ఆరురోజుల యుద్ధంతో తారకాసురుడిని సంహరించినట్లు స్థలపురాణం. తారకాసురుని తరువాత శూరపద్ముడు వివిధ రూపాలను ధరించి స్వామితో యుద్ధం చేయసాగాడు. చివరకు శ్రీసుబ్రహ్మణ్యస్వామి ధాటికి తట్టుకోలేక ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి నిలిచాడు. శ్రీసుబ్రహ్మణ్యస్వామి తన చేతిలోని ఆయుధంతో మామిడిచెట్టును రెండుగా చీల్చి సంహారం చేశాడు. అయితే చీలిపోయిన మామిడిచెట్టు భాగాలు నెమలి, కోడిపుంజులుగా మారి శ్రీసుబ్రహ్మణ్యస్వామితో యుద్ధం చేయసాగాయి. చివరకు సుబ్రహ్మణ్య స్వామి వేస్తున్న బాణాలధాటికి తట్టుకోలేకపోయిన కోడిపుంజు, నెమలిలు స్వామిని శరణువేడగా, ప్రసన్నమైన సుబ్రహ్మణ్యస్వామి నెమలిని తన వాహనంగానూ, కోడిపుంజును తన ధ్వజానికి గుర్తుగానూ చేసుకుని తారకాసురుడిని సంహరించిన చోటనే కొలువుదీరినట్లు స్థలపురాణం చెబుతూ వుంది.

తిరుచెందూరు ఆలయం సముద్ర తీరంలో వుంది. విశాలమైన ప్రాంగణంలో వివిధ మండపాలను కలిగి వున్న ఆలయ ప్రధాన గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చతుర్భుజాలతో కొలువుదీరివున్నాడు. పుష్పమాల, కుక్కుట ధ్వజం, అక్షమాల, కటి హస్తాలతో స్వామి వారు దేదీప్యమానంగా దర్శనమిస్తాడు.

భక్తులు ఆడికృత్తిక రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించాలి. పచ్చి పాలు, వడపప్పు, అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదంగా చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరిస్తారు.

ముందు రోజు రాత్రి, ఆడికృత్తిక రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు.

తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది. కనుక ఆషాఢ పౌర్ణమినుండీ వారికి ఆషాఢ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు. దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాఢ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది.

వీలైతే ఎవరైనా వేదవిధునికి కుదిరితే బాల బ్రహ్మచారి అయిన వేదవిధునికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ.. పైపంచ, శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు (లేదా పంచపాత్ర ఉద్ధరిణ, అర్ఘ్య పాత్ర) సమర్పించి, అతడినే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని శాస్త్ర వచనం. ఒకవేళ బాల బ్రహ్మచారియైన వేద విధుడు లేక గృహస్తు అయిన వేద విధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే. ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహారం. సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది. కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. తిరువణ్ణామలైలోని శ్రీరమణులు పళని సుబ్రహ్మణ్యస్వామి స్వరూపం అని చెపుతారు. అందుకని ఆడి కృత్తికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు.

   తిరువణ్ణామలై మాతవీధి వద్ద పలువురు మురుగ భక్తులు కావడి మోస్తూ అన్నామలైయార్ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

  ప్రతి ఏటా మాటవీటి చుట్టూ కావడి మోసే భక్తులు, పురుషులు, మహిళలు, పెద్దలు, చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా, మనం దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు, మనం మొదటి దేవుడైన గణేశుడిని పూజిస్తాము.  ఆ ప్రకారం ఆలయాల్లో ముందుగా వినాయకుడి గుడి ఏర్పాటు చేస్తారు.

కానీ తిరువణ్ణామలైలో అలా కాదు.  తమిళ దేవుడు మురుగ మొదటి సన్నితి. తిరువణ్ణామలై రాజగోపురంలో వినాయగర్‌ని ఉంచినప్పటికీ, తిరువణ్ణామలై ఆలయంలో మనకు స్వాగతం పలికేది మురుగ భగవానుడే.

 ఈ ప్రదేశంలోనే మురుగ భగవానుడు ఒక్కసారి కాదు రెండు సార్లు ప్రత్యక్షమయ్యాడు.  ఆ సంఘటన అరుణగిరినాథుని జీవితానికి సంబంధించినది.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...