Friday, 4 August 2023

తిరుమల శ్రీ వారి కి సంబంధించిన కొన్ని అద్భుతాలు (05-Aug-23, Enlightenment Story)

 🌼🌿 తిరుమల శ్రీ వారి కి సంబంధించిన కొన్ని అధ్భతాలు 👇👇

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

👉శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. 

👉ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీని విలువ మాత్రమే రూ. లక్ష కోట్లు.

👉రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 

👉శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా. స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. 

👉 తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము. 

👉తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. 

👉గురువారమే శుక్రవారం అభిషేకానికి ముందే వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. 

👉హుండీ, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం... పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు. 

👉అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. 

👉స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు. 

👉ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే... స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే  అర్పిస్తారు. 


     🍁 🌹🙏💐🙏🌹🍁.   ఓం నమో వెంకటేశాయ నమః     🍁 🌹🙏💐🙏🌹🍁.  

     🍁 🌹🙏💐🙏🌹🍁.  సర్వేజనా💐 సుఖినోభవంతు      🍁 🌹🙏💐🙏🌹🍁

      🍁 🌹🙏💐🙏🌹🍁  🌹# శుభమస్తు🌹 🌹  🌹 🌹         🍁 🌹🙏💐🙏🌹🍁


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


 

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...