Wednesday, 30 August 2023

హయగ్రీవ జయంతి (31-Aug-23, Enlightenment Story)

 శ్రీహయగ్రీవ స్వామివారీ జయంతి

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

” జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్‌

   ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే “


యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధి. వాటిల్లో ముఖ్యమైనవి నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి ఈ అవతారాల్లో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారల్లోకి ఒకటి ‘హయగ్రీవావతారం’ ఒకటి.

జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారరం. హయగ్రీవుడిని పూజించిన భక్తులకు విద్యనే కాదు అన్యాయం జరిగినవారికి న్యాయం జరుగుతుంది. భూవివాదాలు ఏమైనా ఉంటే అవి త్వరలో పరిష్కరించ బడుతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించి హయగ్రీవుడు మానవులందరినీ చల్లగా చూస్తాడు.

హయగ్రీవ ప్రస్థావన

దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి.

హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. తెల్లపూవులతో పూజించాలి. శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని హయగ్రీవ స్తోత్రంలో దేశికాచార్యులు పేర్కొన్నారు.

శ్రావణ మాసం పౌర్ణమినాడు హయగ్రీవ జయంతి. శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు గా అవతరించిన రోజు. హయగ్రీవుడు జ్ఞానానికి, వివేకానికి, బుద్దికి, వాక్కుకు దేవుడు అని కొలుస్తుంటారు. హయగ్రీవుడంటే గుర్రం ముఖం కలవాడని అర్థం. ఆయన తెల్లని శరీర ఛాయతో ఉంటాడు. నాలుగు చేతులలో శంఖం, చక్రం, పుస్తకం, అభయహస్తం ధరించి ఉంటాడు. జ్ఞానందమయం దేవం నిర్మల స్పటికాకృతిమ్ ఆధారం సర్వవిద్యానాం-- హయగ్రీవ ముపాస్మహే ఇది హయగ్రీవ ధ్యానశ్లోకం. విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం. మధు- కైటభులు అనే రాక్షసులను పాతాళలోకంలో సహరించిన రూపమే హయగ్రీవం. అగస్త్య మహర్షి కంచిలో తపస్సు చేయగా హయగ్రీవుడు ప్రత్యక్షమై లలితా సహస్రనామ స్తోత్రాన్ని, శ్రీవిద్యను అనుగ్రహించాడు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

శరీరం కర్మలు చేసే ఒక పరికరం (02-Sep-23, Enlightenment Story)


 🪔🪔 శరీరం కర్మలు చేసే ఒక పరికరం🪔🪔

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

|*పునర్విత్తం పునర్మిత్రం* | *పునర్భార్య పునర్మహి* |

|*ఏతత్సర్వంపునర్లభ్యం* |*న శరీరం పునఃపునః* |

 🌷పోయిన ధనం మళ్లీ చేరుతుంది. 

🌷దూరమైన మిత్రుడు మళ్లీ చేరువఅవుతాడు.      

🌷భార్య గతిస్తే మరొక భార్య లభిస్తుంది.

🌷భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది. 

పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు! కాని మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు. అందుకే శరీరం ఖలు ధర్మసాధనం అన్నారు. కేవలం శరీరం ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు. శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది.శరీరం ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు. ఏ పని చేయడానికైనా శరీరం కావాలి. కనుక శరీరము ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే.జంతువులకు శరీరం ఉంటుంది, కాని, వాటికి ఆలోచన ఉండదు. పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు. బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం ఉండేది ఒక్క మనుష్యులకే. వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది. కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి.



అతిగా తిన్నా,అతిగా ఆలోచించినా,అతిగా సుఖించినా,అతిగా దుఃఖించినా,  ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది. ఇక శరీరం చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు. కనుక ముందు శరీరము ను జాగ్రత్తగా చూసుకోవాలి.    

దీనికి సత్యం, ధర్మం,శాంతి,ప్రేమ,అహింసలను పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి.

విస్తరాకు విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు. బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము, తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా మురికి పెంటపై పడేసి వస్తాము. తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా.

మనిషి జీవితం కూడ అంతే 'ఊపిరి" పోగానే ఊరిబయట పారేసి వస్తారు. విస్తరి ఆకు పారేసినప్పుడు సంతోష పడుతుంది, ఎందుకంటే పొయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగ పడినాను అన్న తృప్తి ఆకుకు ఉంటుంది,

విస్తరాకుకు ఉన్న "ముందు ఆలోచన", తృప్తి భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ! "సేవ చేసే అవకాశము వచ్చినపుడు సేవ చేయండి""     జారవిడుచుకోకూడదు 

మళ్లీ ,ఇంకొకసారి,ఎప్పుడో చేయవచ్చు అనుకొని వాయిదా వేయకండి, ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే. కుండ ఎప్పుడైనా పగలవచ్చు, అప్పుడు విస్తరికి ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.

ఎంత సంపాదించి ఏమి లాభం ? ఒక్క పైసా కూడా తీసుకు పోగలమా? మన చేత, మన వల్ల ప్రత్యక్షంగా,పరోక్షంగా ఓ 10 మందికి మంచి జరిగితే,మన ఈ జన్మ సార్థకమయినట్లే.

 ధర్మో రక్షతి రక్షితః 

 పదిమందికి మంచి చేయండి నమ్మిన వారిని వెంటబెట్టుకొని నడవండి

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday, 29 August 2023

రాఖీ పౌర్ణమి (30-Aug-23, Enlightenment Story)

 🪔🪔రాఖీ పౌర్ణమి 🪔🪔

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న లేదా 31వ తేదీ అనే విషయంలో చాలా మందికి గందరగోళంగా ఉంది. ఈ సందర్భంగా ఏ సమయంలో రాఖీ కట్టాలి..


ఈ ఏడాది 30 ఆగస్టు 2023 బుధవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 31 ఆగస్టు 2023 ఉదయం 7:05 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రక్షా బంధన్ పండుగను ఆగస్టు 30వ తేదీన జరుపుకోవచ్చని ఉత్తర భారతంలోని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈరోజున భద్ర కాలం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే దక్షిణ భారతదేశంలో ఏ పండుగకైనా సూర్యోదయ తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి రాఖీ పండుగను గురువారం జరుపుకోవాలని తెలుగు రాష్ట్రాల పండితులు చెబుతున్నారు.

హిందూ పంచాంగం ప్రకారం.ఈ ఏడాది రక్షా బంధన్ పండుగ ఆగస్టు 30న (బుధవారం) మొదలవుతోంది. అయితే.. ఆ రోజున భద్ర కాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది.శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు.  అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి.

భద్ర అంటే

పురాణాల ప్రకారం, సూర్య దేవుని పుత్రిక భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టినప్పుడే విశ్వం మొత్తాన్ని తన స్వరూపం మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, క్రతువులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణంగా భద్ర కాలంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవు. వైదిక పంచాంగం ప్రకారం, భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం, పాతాళం, భూమిలో ఉంటారు. అలాగే చంద్రుడు, కర్కాటకం, సింహ, కుంభ, మీన రాశుల్లోనూ ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Monday, 28 August 2023

అరటి కథ (04-Sep-23, Enlightenment Story)

 *అరటి కథ*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

క్రోధానికీ, కామానికీ బానిసలైతే కలిగే దుష్పరిణామాలను తెల్పుతుంది ఈ కథ. ఆడైనా మగైనా నోటిదురుసుతనం, అయిన దానికీ కానిదానికీ దుర్భాష లాడితే కలిగే ఫలితం ఏమిటో చదవండి

ఔర్వుడు అనే మహర్షి  కూతురు కందళి. ఆమె చాలా అందగత్తె, మంచి సుగుణాలు వున్నది. కానీ ఆమెకు నోటి దురుసుతనం యెక్కువ. ఆమె దుర్వాస మహర్షిని పెళ్లి చేసుకుంటానని తండ్రి తో చెబుతుంది. 

ఆయన చాలా కోపిష్టి అని తండ్రి వద్దని  వారిస్తాడు.కానీ కందళి పట్టు బడుతుంది. సరే యని ఆమెని దూర్వాసును దగ్గరికి తీసుకెళ్ళి ఆమె గురించి వివరంగా చెప్పి ఆమె కోరిక గురించి చెప్తాడు.

అన్నీ విన్న దూర్వాసుడు ఆమె అందానికి మోహితుడై ఆమెను వివాహం చేసుకోడానికి అంగీకరిస్తాడు. కాకపొతే కందళి యొక్క నూరు దుర్భాషలను క్షమిస్తానని ఆ పైన వూరుకోననీ ఒక నియమం పెడతాడు.

తండ్రీ కూతుళ్ళు ఒప్పుకుంటారు.ఆ పైన ఔర్వుడు వివాహం జరిపిస్తాడు. కొంత కాలం వారి దాంపత్యం సవ్యంగానే సాగుతుంది. ఆమె నోటి దురుసుతనం  దూర్వాసుడికి కష్టం కలిగించినా యిచ్చిన మాటకు కట్టుబడి ఆమెని క్షమిస్తాడు. చివరకు ఆమెతో మాట్లాడకుండా వుండే పరిస్థితులు వస్తాయి. అలా కొంతకాలమయ్యాక ఆమె నూరు దుర్భాషలూ పూర్తవుతాయి. ఒక రోజు ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం లో వుండగా కందళి వచ్చి ఏమిటి నాతో మాట్లాడరా? అని  దబాయిస్తుంది. 

అప్పటికే ఆమె ప్రవర్తనతో విసిగి వున్న దుర్వాసుడు కళ్ళు తెరిచి ఆమెను తీక్షణంగా చూస్తాడు. ఆ చూపుకు కందళి నిలువెల్లా మాడిపోయి బూడిదవుతుంది. ఆమె ఆత్మ రూపంలో వచ్చి నిలబడి ఆయనను క్షమించమని వేడుకుంటుంది.

తర్వాత దుర్వాసుడు ఆమెను భస్మం చేసినందుకు బాధ పడుతూ వుండగా అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక స్త్రీ  కోసం తన తపస్సు యొక్క శక్తిని దుర్విని యోగం చేసుకున్న దుర్వాసుడికి కర్తవ్య దీక్షను వివరిస్తాడు. తన కోపానికి గురైన భార్య గుర్తుగా కందళీ వృక్షాన్ని సృష్టిస్తాడు.

కందళి క్రమేపీ కదళి గామారిన అరటికి మానవుల  పూజలలో, తాంబూలం లో యెంతో ప్రాధాన్యం వుండేట్టు అనుగ్రహిస్తాడు దుర్వాసుడు. అదీ మన అరటి కథ. తపశ్శక్తి వున్న మహర్షి, యెంత అందం సుగుణాలు వున్నఆడైనా మగైనా దుర్భాష లాడితే కలిగే అనర్థాలను ఈ కథ మనకు తెల్పుతుంది.

యిప్పటి మన సమాజంలో విడాకులకు దారితీసేది కూడా ఈ కోపం, దుర్భాషలే. అందుకే అవి అదుపులో పెట్టుకోవాలని తెలుసుకోవాలి.

ఆదివారము నాడు అరటి మొలిచింది    
సోమవారము నాడు సుడి వేసి పెరిగింది         
మంగళవారము నాడు మారాకు తొడిగింది  
బుధవారము నాడు పొట్టి గెల వేసింది                     
గురువారమునాడు గుబురులో దాగింది               
శుక్రవారము నాడు చక చకా గెల కోసి                             
అందరికి పంచితిమి అరటి అత్తములు

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

వరలక్ష్మీ వ్రతం (01-Sep-23, Enlightenment Story)

 🪔🪔వరలక్ష్మీ వ్రతం 🪔🪔

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🍁భారతీయ పర్వకాలాల్లో ఒక్కొక్క రుతువుకు, ఒక్కో మాసానికి, తిథులకు ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేకతలే ప్రత్యేక దేవతారూపాలుగా పూజలందు కుంటున్నాయి. పూజ, వ్రతం, ధ్యానం, సంకీర్తన వంటి మార్గాలన్నీ మనసును మహాశక్తితో అనుసంధానపరచే సాధనలు.


🍁గ్రీష్మంలో అగ్నితత్వాన్ని స్వీకరించిన భూదేవి, వర్షరుతువు ఆరంభమాసమైన శ్రావణంనుంచి జలతత్వాన్ని గ్రహిస్తుంది. ఈ జలతత్వ సంధానాన్నే 'ఆప్యాయనం' అంటారు. భూమికి ఆప్యాయనం కలిగించే మాసం శ్రావణం. ఈ 'ఆర్ద్రశక్తి' వల్లనే పచ్చదనం, సస్యసంపద భూమికి సమకూరుతాయి. ఆ ఐశ్వర్య రూపిణిని మహాలక్ష్మిగా, సృష్టికారణశక్తిగా, సంపదల దేవతగా ఆరాధించే పద్ధతిని వేద రుషులు ఆవిష్కరించారు. ఆర్ద్ర, పుష్కరిణి (పోషకశక్తి) అని 'శ్రీ' దేవిని వరలక్ష్మిగా 'శ్రీసూక్తం' వర్ణించింది.

🍁 సర్వవ్యాపకుడైన పరమాత్మను శ్రీమహావిష్ణువుగా, ఆయన విభూతి (ఐశ్వర్య) శక్తిని మహాలక్ష్మిగా వేదం విశదపరచింది. 'సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి (విద్యాలక్ష్మి), శ్రీలక్ష్మి, వరలక్ష్మి... అనే ఆరులక్ష్ములుగా ఉన్న మహాలక్ష్మి ఎల్లవేళలా నా ఎడల ప్రసన్నురాలగుగాక, అంటూ వైదిక సంప్రదాయం లక్ష్మీ రూపాలను పేర్కొంది. కార్యానికి సిద్ధి; దుఃఖం(అజ్ఞానం) నుంచి విముక్తి; సంకల్పాలకు సాఫల్యం(గెలుపు); విజ్ఞానం; శోభ, కాంతి; అభీష్టాలు నెరవేరడం... ఈ ఆరు సంపదల రూపాలే పై ఆరు లక్ష్ములు.

🍁'చారుమతి' అనే సాధ్విని వరలక్ష్మి అనుగ్రహించి, స్వప్నంలో సాక్షాత్కరించి, శ్రావణమాస పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారం నాడు తనను ఆరాధించి వ్రతాచరణ చేసేవారిని అనుగ్రహిస్తానని ప్రసన్నురాలై దీవించింది. ఆ వృత్తాంతాన్ని తన పెనిమిటికి, అత్తమామలకు చెప్పి, వారి ఆనందాన్నీ ఆమోదాన్నీ పొంది వరలక్ష్మి వ్రతాన్ని తోటి స్త్రీలతో కలిసి ఆచరించిందని వ్రతకథ చెబుతోంది. 'చారుమతి' అంటే 'మంచి బుద్ధికలది' అని అర్థం. కుటుంబంలో ఉన్న (ఉండవలసిన) సౌమనస్య స్వభావాన్ని ఆమె ప్రవర్తన సూచిస్తుంది.

🍁వస్త్రాభరణాలతో అలంకృత అయిన స్త్రీమూర్తిని సాక్షాత్తు లక్ష్మీరూపంగా మన్నన చేయడం వరలక్ష్మీవ్రతం నాటి పేరంటాల అర్చనలో గోచరిస్తుంది. శుక్రవారాలు లక్ష్మీప్రీతికరాలు అని శాస్త్రోక్తి. శుక్రవారానికి 'భృగుప్రజాపతి' అధిపతి. ఆ భృగువు తపస్సుకు ఫలితంగా లక్ష్మీదేవి ఆయనకు తనయగా ఆవిర్భవించింది. నారాయణుడి విభూతి శక్తియే సిద్ధిగా ఆయనను అనుగ్రహించింది. ఆ మహాలక్ష్మిని నారాయణుని పత్నిగా అప్పగించాడు. భృగువు, భృగువు అధిపతిగా ఉన్న భృగువాసరం (శుక్రవారం) లక్ష్మీపూజకు ముఖ్యమని శాస్త్రనిర్ణయం.

🍁శుక్రవారానికి ఇంద్రుడు దేవతగా కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. 'ఇంద్రుడు' అనే మాటకు 'ఐశ్వర్యం, తేజస్సు కలవాడు' అని అర్ధం. త్రిలోకాధిపతి విష్ణుకృపతో లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది'ఇంద్రుడయ్యాడు. 'ఇందిర అన్నా మహాలక్ష్మియేకదా! చంద్రకళలు వృద్ధిచెందే శుక్లపక్షంలో, చంద్రసహోదరిగా క్షీరసాగరం నుంచి ఉద్భవించిన లక్ష్మిని అర్చించాలని సంప్రదాయం. అందుకే, పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా నిర్ణయించారు.

🍁 వరలక్ష్మీ కటాక్షం వల్ల భారత స్త్రీజాతి క్షేమ సమృద్దులతో విలసిల్లాలని, భారతదేశం సర్వతోముఖాభ్యుదయాన్ని సాధించాలని ఆ జగన్మాతను ప్రార్ధిద్దాం.🙏

-✍️

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Saturday, 26 August 2023

అంతర్యామి - తెలియనితనమే అజ్ఞానం (27-Aug-23, Enlightenment Story)

 🪔🪔🌺*అంతర్యామి - తెలియనితనమే అజ్ఞానం*🌺🪔🪔

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🍁జననం నుంచి మరణం వరకు ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. కూర్చోవడం, నిలబడటం, మాట్లాడటం, నడక, పరుగు..వంటివి శారీరక ఎదుగుదలకు సహజంగా నేర్చుకునే పనులు, పాఠశాల, కళాశాలల్లో తెలుసుకున్న విషయాలు జీవన వృత్తిలో రాణించేందుకు అవసరం. ప్రతి పనిలోనూ అర్ధం, అంతరార్థం ఉంటాయి. అంతరార్ధం తెలియాలంటే పరిశీలన దృష్టి, పరిశోధన పూర్వకంగా కృషి కావాలి. దాన్నే శ్రీవిద్య అంటారు. 


🍁మనిషిలోని అంతఃకరణాల్లో అన్నీ తెలుసు అనే అహంకారం తనలోనితెలియనితనాన్ని ఒప్పుకోదు. దాన్ని నిగ్రహిస్తే మనిషి మహాజ్ఞాని అవుతాడు. శ్రీరాముడు వసిష్ఠ మహర్షి దగ్గర ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాడు. విశ్వామిత్రుడు శక్తి సంపన్నమైన ఆస్త్ర శస్త్ర మంత్రాలు నేర్పాడు. ఆధ్యాత్మిక విషయాల పై శ్రీరామ వసిష్ఠుల చర్చ రామగీత, యోగవాసిష్ఠం అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. "సాందీపుడి వద్ద శ్రీకృష్ణ బలరాములు. నాలుగు రోజుల్లోనే ఆరవై నాలుగు విద్యల్లో ప్రావీణ్యం సాధించారు. అవతార పురుషుడైనా గురువు ముందు తలవంచాలి.

🍁అయ్యయ్యో తెలియనైతి ఆదినారాయణుణ్ని ఎరుగనైతి అని భక్త రామదాసు పరమాత్మను తెలుసుకోలేక కాలాన్ని వ్యర్ధం చేశానని కృతిపరంగా ఆవేదన వ్యక్తం చేశాడు. తెలిసిన తరవాత నాలుగు వందల కీర్తనలతో వాగ్గేయకారుడిగా భక్తి సామ్రాజ్యంలో శాశ్వత కీర్తి సాధించాడు. ఎంతటి గొప్పవారైనా ఎప్పుడో ఒకప్పుడు తెలియని అజ్ఞానంతో ప్రవర్తిస్తారు. 

🍁జగద్గురు ఆదిశంకరాచార్య నదీస్నానానికి వెళ్ళే సమయంలో చండాలుడి రూపంలోని శంకరుడు దారికి అడ్డుగా వచ్చాడు. పక్కకు తొలగమని జగద్గురువు చెప్పాడు. ఎవరిని తొలగమంటావు. ఈ శరీరాన్నా లేక దీనిలో ఉన్న ఆత్మనా అని ప్రశ్నించాడు చండాలుడు. శరీరమైతే అందరిదీ పంచభూతాత్మకమే, ఆత్మను అయితే అది పరమాత్మ స్వరూపం.ఏది పక్కకు తొలగాలి? ఈ ప్రశ్నకు శంకరాచార్య అతన్ని తనలో దాగిఉన్న అజ్ఞానాన్ని తొలగించే పరమేశ్వరుడిగా గుర్తించి ప్రణమిల్లాడు. 

🍁రామాయణంలో చిత్రకూట పర్వతం నుంచి సీతా రామ లక్ష్మణులుదండకారణ్యానికి ప్రయాణం మొదలు పెట్టారు. ఆ సమయంలో శ్రీరాముడు చెప్పినమాటలు అందరికీ వర్తిస్తాయి.

🍁 'లక్ష్మణా! ఇప్పటివరకు మనకు సుమంత్రుడు,గుహుడు, భారద్వాజుడు అడవిలో దారి చూపించారు. ఇప్పుడు మనం ఒంటరిగా అడవిలో మార్గాన్ని వెతుకుతూ వెళ్ళాలి. దండకారణ్యం చేరడం మన లక్ష్యం. అడవిలో దారి తెలియదు కానీ దాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మనకన్నా ముందువారు ఏనుగును నడిపించి దారి ఏర్పాటు చేసి ఉంటారు. ఆ దారి కనిపెట్టి మనం నడవాలి. దారి గుర్తు కోసం మహర్షులు చెట్ల కొమ్మలకు తమ వస్త్రాలు కడతారు, ఆశ్రమాల జాడను దూరం నుంచి పొగ ద్వారా కనిపెట్టవచ్చు. మహర్షుల సహాయంతో మనం దండకారణ్యం చేరాలి??

🍁జీవన గమనం కూడా జనారణ్య ప్రయాణమే. ఒంటరిగానే సాగించాలి. మనతో చివరివరకు ఎవరూ తోడు రారు. మనకన్నా ముందు తరంవారు మార్గ నిర్దేశం చేసే ఉంచారు. దాన్ని తెలుసుకుని ప్రయాణం సాగించాలి.

🌻||కృష్ణం వందే జగద్గురుమ్||🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Friday, 25 August 2023

కొత్త కారు - పాత జ్ఞాపకం (28-Aug-23, Enlightenment Story)

కొత్త కారు - పాత జ్ఞాపకం

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఆడిటర్ వేణుగోపాల్ గారు సేలం నివాసి. మహాస్వామి వారికి పరమ భక్తుడు. కంచి శంకర మఠానికి కూడా అతనే ఆడిటర్. తన జీవితంలో ఏమి జరిగినా అది అంతా ‘పరమాచార్య అనుగ్రహం’ అనుకునే మనస్తత్వం కలవాడు. మహాస్వామి వారి అనుగ్రహం వల్లనే తను ఈ వృత్తిలో ఉన్నాడు. కొద్దిగా స్థిరత్వం పొందిన తరువాత వేణుగోపాల్ ఒక కార్ కొన్నారు. మహాస్వామి వారికి తన కొత్త కారును చూపించాలనే కోరికతో కార్లో కాంచీపురానికి బయలుదేరారు. శ్రీమఠం ముందు కారును నిలిపిన తరువాత మహాస్వామి వారి మఠంలో లేరని, వారు కలవైలో విడిది చేసి ఉన్నారని తెలిసింది. వెంటనే వారు కార్లో కలవై బయలుదేరిపోయారు. మహాస్వామి వారు విడిది చేసిన చోట బయట కారును నిలిపి లోనికి వెళ్ళారు.


మహాస్వామి వారు వేణుగోపాల్ ని చూసిన వెంటనే, అతను చెప్పకముందే మహాస్వామి వారు “ఏంటి కార్ కొన్నావా?” అని అడిగారు. మహాస్వామి వారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన త్రికాలవేదులు. 

ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఆడిటర్ “అవును పెరియవ” అని చిన్నగా సమాధానం చెప్పారు. మహాస్వామి వారికి ముందుగా తెలపకుండా కార్ కొన్నందుకు తప్పుచేసానేమో అని ఒకింత బాధపడ్డారు. కాని వారికి ఉన్నదాంట్లో సౌఖ్యంగా బ్రతకటం మహాస్వామి వారు ఎన్నడూ తప్పు పట్టేవారు కాదు. వారు మనసులో అలా అనుకున్న వెంటనే మహాస్వామి వారు,

“అది మంచి పనే. సరేలే కాని నువ్వు ఇప్పుడు నాకు ఒక పని చేసిపెట్టగలవా?” అని అడిగారు. వారు అవునన్నట్టు తల పంకించారు, మహాస్వామి చెప్పిన పని చేసి పెడతాను అని.

అప్పుడు మహాస్వామి వారు, “నువ్వు ఇక్కడి నుండి కొద్దిదూరం వెళ్ళి కుడి ప్రక్కకి తిరిగి అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళు. నీకు ఒక చెరువు కనపడుతుంది. ఒక ముసలివాడు ఆ చెరువు గట్టు పైన కూర్చొని ఉంటాడు. నువ్వు అతన్ని నీ కార్లో ఇక్కడకు తీసుకుని రావాలి. ఏమి, చేస్తావా?” అని అడిగారు. మహాస్వామి వారు ముగించక ముందే ఆడిటర్ గారు బయలుదేరిపోయారు. 

విల్లు నుండి వదిలిపెట్టిన బాణంలా ఆడిటర్ కార్లో దూసుకుని వెళ్ళిపోయారు. మహాస్వామి వారు చెప్పినట్టు గడ్డంతో ఉన్న ఒక ముసలాయన చెరువు గట్టు పైన కూర్చున్నాడు. మహాస్వామి వారు చెప్పినది ఇతన్ని తీసుకురమ్మననేనా అతనికి తెలియదు. మహాస్వామి వారు ఏమైనా చెపితే దానికి చాలా విషయం ఉంటుంది. ఆ వృద్దుడి దగ్గరకు వెళ్ళి మహాస్వామి వారు చెప్పిన విషయాలను చెప్పాడు. ”నన్ను పిలిచారా? అయితే ఖచ్చితంగా నేను నీతో వస్తాను” అని చెప్పి వయోభారం వల్ల వణుకుతూ ఆడిటర్ గారి కొత్త కారులో ఎక్కాడు. వారు కలవై చేరుకున్నారు మహాస్వామి వారి ముందు ఆ వృద్ధుడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

“ఏమి బావున్నావా?” అని మహాస్వామి వారు ఆ వృద్ధుడిని అడిగారు.“పర్లేదు బావున్నాను”

మహాస్వామి వారి సూచనలతో పాటు శ్రీమఠం సాంప్రదాయంతో గౌరవించారు. ఆ వృద్ధుని తృప్తి కొరకు పంచెలు, దుశ్శాలువలు కొద్ది పైకము ఇచ్చి, మహాస్వామి వారు ఆడిటర్ తో “ఇతనిని తీసుకుని వెళ్ళి ఎక్కడ దిగుతాడో అక్కడ వదిలి, నువ్వు తిరిగి రా” అని చెప్పారు. 

ఆ ముసలాయనకు మళ్ళా కార్ ప్రయాణం. అతను చెప్పిన చోట వారిని వదిలి, ఆడిటర్ గారు తిరిగి వచ్చారు. అతను ఆ వృద్ధుడు గురించి ఏమి అడగలేదు. మహాస్వామి వారు కూడా ఏమి చెప్పలేదు. ఆడిటర్ వేణుగోపాల్ మహాస్వామి వారు ముందు చేతులు కట్టుకుని నిలబడియున్నారు. ”నీవు తీసుకువచ్చిన అతను ఏవరో నీకు తెలియునా?” తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపారు. 

“నా చిన్నతనంలో హఠాత్తుగా ఒక రోజు నన్ను తన గుర్రపు బండిలో ఇక్కడకు తీసుకుని వచ్చాడు. ఎందుకు అని అప్పుడు నాకు తెలియదు. ఇక్కడకు వచ్చిన తరువాతనే నేను 68వ పీఠాధిపతిని అని చెప్పారు. నాకు అప్పుడు సంస్కృతము కూడా తెలియదు. వేదములు కూడా ఆమ్నాయం చేయలేదు. ఇక్కడకు వచ్చిన తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. నువ్వు గమనించావా. ఎన్ని సంవత్సరములు గడచిపోయాయో. ఈ మహాత్ముడే (వృద్ధుడు) నన్ను గుర్రపు బండిలో ఎక్కించుకుని ఇక్కడకు తీసుకుని వచ్చాడు. నన్ను ఎందుకు పిలిపించారో ఇతనికి కూడా తెలియదు. అతన్ని ఎలా మరచిపోగలను. హఠాత్తుగా గుర్తుకువచ్చాడు. అందుకే నీ కార్లో ఇక్కడికి తీసుకురమ్మన్నాను” అని అన్నారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Thursday, 24 August 2023

చెమటలు పట్టే విగ్రహం (26-Aug-23, Enlightenment Story)

 చెమటలు పట్టే విగ్రహం !!!

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు తమిళనాడులోని నాచ్చియార్ కోవెల్ అనే క్షేత్రంలో అదృశ్యరూపంలో సంచరిస్తూ వున్నాడని కొందరు యోగులు తెలియజేస్తూ వున్నారు.


108శ్రీ వైష్ణవ దేశాలలో ఒకటియైన తిరునాయూర్ అనే క్షేత్రంలో ఈ గరుత్మంతునికి సంబంధించిన ఒక అద్భుతవిషయం ఉన్నది. 

తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో వున్న తిరునాయూర్ అనే క్షేత్రంలో ఉత్సవమూర్తిగా వున్న గరుత్మంతుని విగ్రహం ఊరేగింపుసమయంలో వివిధ రకాల బరువులతో ఉండటం జరుతుంది. ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవెల్ అనే పేరుగూడా వున్నది.

ఈ క్షేత్రంలో వెలసిన మహావిష్ణువుకి సంవత్సరానికి 2సార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవంలో అమ్మవారు హంసవాహనం మీద ఊరేగింపుగా వెళుతూ వుండగా స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనక వెళుతూవుంటారు.

స్వామి వారు ఈ సమయంలో  ఒక చిక్కు పరిస్థితిలో పడతారు, అదేమిటంటే గరుడవాహనం యొక్క వేగం హంసవాహనం కన్నా అధికం తానెక్కిన గరుడ వాహనం వెళితే అమ్మవారు వెనక బడిపోతుంది.

అది గ్రహించిన గరుత్మంతుడు స్వామితో ఇలా అంటాడు, నేను అమ్మవారు ఎక్కిన హంస వాహనం కన్నా ముందుకి వెళ్లను, తగిన వేగంతో వెళ్తూ హంసవాహనం వెనకాలే వెళతాను. ఈ ఊరేగింపు లో ఒక విచిత్రం జరుగుతుంది. అదేంటంటే స్వామివారు అంతర ప్రాకారంలో గరుడవాహనం ఎక్కినప్పుడు అది తేలికగావుండి కేవలం నలుగురు మనుషులు మోస్తే కదులుతుంది.

అలా ముందుకు వచ్చిన గరుడవాహనం ఆ తరువాత ఉన్న 5ప్రాకారాలను దాటి దేవాలయ సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు జామితీయ పద్ధతిలో పెరుగుతుంది. 

2 వ ప్రాకారాన్ని దాటుతున్న గరుడవాహనాన్ని 8మంది మోయాల్సుంటుంది. 

3వ ప్రకారం దాటేటప్పుడు 16మంది మోయాల్సుంటుంది. 

4వ ప్రకారాన్ని దాటేటప్పుడు 32మంది మోయాల్సుంటుంది.

5వ ప్రాకారాన్ని దాటే ముందు 64 మంది మోయాల్సుంటుంది.

 5 ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు విపరీతంగా పెరిగిపోయు 120మంది మోయాల్సొస్తుంది. .

ప్రధానవీధుల్లోకొచ్చే సరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ వుండగా దాని వెనకాల 128మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ వుంటుంది.

ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ వూరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహంపైన చెమటలు కనిపిస్తాయి.

గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు వుండి క్రమంగా పెంచుకుంటూ పోయేసరికి అతడికి చెమట పడుతుందని భక్తులు విశ్వసిస్తారు.

తమిళనాడులో వున్న ఈ క్షేత్రంలోని ఈ గరుత్మంతుని కాలగారుడన్ అని పిలుస్తారు. ఈ అద్భుతఊరేగింపు దృశ్యం సంవత్సరానికి 2సార్లు జరుగుతుంది. 

మహాశక్తి వంతుడైన ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ఏవిధంగా ధరిస్తాడో తెలుసుకుందాం.

ఆదిశేషుడు – తన కంకణంగా

కర్కోటకుడు – తాను ధరించే పూలదండగా

పద్మనాభుడు – తన కుడిచెవి ఆభరణంగా

మహా పద్ముడు – ఎడమచేతి ఆభరణంగా

శంఖపాలుడు – తన కిరీటం ఆభరణంగా

గుళికుడు – కుడి చేయి గాజులాగా

తక్షకుడు – వడ్డాణంగా

వాసుకి – జంధ్యంగా

ఇక తొమ్మిదవ సర్పం..ఆయన యొక్క కంఠానికి అలంకరణగా చుట్టుకుని వుంటుంది.

🌻||కృష్ణం వందే జగద్గురుమ్||🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Sunday, 20 August 2023

భక్తి భావం (25-Aug-23, Enlightenment Story)

 *భక్తి భావం*

🍁🍁🍁🍁🍁🍁

పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరి నామస్మరణ చేస్తూ ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా భగవానుడిపై ఆపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్య మంగళ స్వరూపం చూసి తన్మయంతో స్తోత్రాలు చేశాడు భక్తుడు. స్వామికి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా. ఒక అరటి పండు కనిపించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలిచి పండు పడవేసి భక్తి పారవశ్యంలో.తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్త వత్సలుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. తర్వాత తన తప్పును తెలుసుకుని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు. మళ్లీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు.

కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి ప్రతి రోజూ ఒక డజను అరటిపళ్లు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు. బాధతో. ‘తండ్రి. అపరాధి అయిన ఈ భక్తుడిని కరుణించి దర్శనం ఇవ్వమ’ని వేడుకున్నాడు.

విష్ణుమూర్తి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటి పళ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకుని తొక్క పడవేసి పండు స్వామికి అందించాడు. కానీ, విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడలేదు. ఎంత బ్రతిమాలినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో. ‘నా భక్తిలో ఏదైనా లోపం ఉందా స్వామి. గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా.ఇప్పుడు ఇలా ఏమీ స్వీకరించటం లేదు. అని ప్రశ్నించాడు.

విష్ణుమూర్తి చిన్నగా నవ్వి.‘నాయనా.ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి తొక్క నివేదించినా స్వీకరించాను. ఇప్పుడు నీ మనసు అరటి పండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా. భక్తి రసహీనం కావడం వల్ల అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను’ అని సమాధానమిచ్చాడు. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయింది. భక్తి కలిగినపుడే కదా దేనికైనా విలువ అనుకుని. నిండు మనసుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.

 🌻||కృష్ణం వందే జగద్గురుమ్||🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

పూజకు పుష్పాలు (24-Aug-23, Enlightenment Story)

 *పూజకు పుష్పాలు*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

ఈశ్వరుడుకి భక్తితో ఓ పుష్పాన్ని సమర్పిస్తే చాలు భక్తులు కోరకుండానే ఆ బోలెనాధుడు వరాలిస్తాడు. అలాంటిది కొన్ని రకాల పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజిస్తే జీవితంలో ఎదురైన ఆటంకాలు, సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

వివిధ రకరాల పూలతో పూజిస్తే వచ్చే ప్రయోజనాలు. దేవుడికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మనలోని చెడు ఆలోచనలు తొలగి సుగుణాలు కలుగుతాయి. విధి నిర్వహణలో ఎదురైన సమస్యలు తొలగిపోతాయి.

  • సంపెంగ పూలను అర్పించి ప్రసాదం స్వీకరిస్తే క్షుద్ర విద్యలు పని చేయవు. శత్రు నివారణ సాధ్యమవుతుంది.
  • పారిజాతం పూలతో అర్చన చేస్తే కాలసర్ప దోషం నివారణ చెందడమే కాదు మనశ్శాంతి లభిస్తుంది.
  • రుద్రాక్ష పూలతో పూజిస్తే కష్టాలు ఎదురైనా అంతిమ విజయం మీదే అవుతుంది.
  • మొగలి పువ్వులతో పూజ చేస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపం తీరుతుంది.
  • లక్కి పూలతో పూజిస్తే భార్య, పిల్లలతో విభేదాలు లేకుండా హాయిగా ఉంటారు.
  • పద్మం లేదా కమలంతో అర్చన చేస్తే దారిద్య్రం నివారణ, శ్రీమంతులవుతారు.
  • మల్లెలతో పూజిస్తే రోగాల నుంచి విముక్తి లభించి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
  • కల్హర పుష్పంతో పూజిస్తే సమాజంతో గుర్తింపు, ఆకర్షణ పెరుగుతుంది.
  • గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కాల్పనిక సాహిత్యం వృద్ధి చెందుతుంది.
  • కలువలతో పూజిస్తే స్తంభన, మంత్ర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
  • కుంద పుష్పాలతో పూజించి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో తేజస్సు, కాంతి ప్రకాశిస్తుంది.
  • కనకాంబరాలతో పూజ చేయరాదు. అలా చేస్తే జీవితం పట్ల వైరాగ్యం కలుగుతుంది.
  • మాధవీ పుష్పాలతో పూజించే జ్యోతిషులు మాటలు అక్షర సత్యాలవుతాయి.
  • తుమ్మపూలతో శివుని పూజిస్తే భక్తి అధికమవుతుంది.
  • నందివర్థనాలతో శివుడికి పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయి.
  • కణగలె పుష్పాలను దేవుడికి అర్పిస్తే మనసును పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతిని వీటితో పూజిస్తే మాంత్రిక బాధలు తొలగి, విద్యా ప్రాప్తి, దుర్గాదేవిని పూజిస్తే అనుగ్రహంతోపాటు శత్రు నిర్మూలనం జరుగుతుంది.
  • పొద్దుతిరుగుడు పూలను పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

   🔱|| ఓం నమః శివాయ ||🔱

🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Friday, 18 August 2023

ఆవుకు విలువ కట్టలేము (23-Aug-23, Enlightenment Story)

ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు

అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు."సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు

రాజుగారు.మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!ఒక గడిలో ఒక గింజ -రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు .ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.రాజు సరే ! అని 

ఆ పని మంత్రికి పురమాయించాడు.ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..‘అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు.. వెఱ్ఱి పండితుడు.. గింజలకు గింజలు రెట్టింపు చేసుకు పోయినా ఎన్నివస్తాయి..?ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..

అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజుఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! 

అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.‘అలాగా.. ఏమిటా పద్యం..?’‘ఇదుగో.. వినండి మహారాజా !

’శర శశి షట్క చంద్ర శరసాయక రంధ్ర వియత్ నగాగ్ని భూధర గగనాబ్ధి వేద గిరితర్క పయోనిధి పద్మజాస్య కుం జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి స్తర మగు రెట్టికగుసంకలితంబు జగత్ప్రసిద్ధిగన్పద్యం

 విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’‘అదే మహారాజా ! మనదేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరములతో అనల్పార్థసాధకంగా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..’‘సరే… సరే.. విప్పి చెప్పు..’‘

ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..ఈ పద్యంలోశర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.గగన, వియత్ - 0(ఆకాశం గగనం శూన్యం)శశి, చంద్ర, తుహినాంశు -1 (చంద్రుడొకడే భూమికి )షట్కము - 6రంధ్ర - 9(నవరంధ్రాలు)నగ, గిరి, భూధర - 7అగ్ని - 3 (మూడగ్నులు; గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని,ఆహవనీయాగ్ని)అబ్ధి, పయోనిధి - 4వేద -4(చతుర్వేదములు)తర్క - 6( షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)పద్మజాస్య - 4 (పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)కుంజర - 8(అష్ట దిగ్గజములు)ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’శర శశి షట్క చంద్ర శర5 1 6 1 5సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ5 9 0 7 3ధర గగనాబ్ధి వేద గిరి7 0 4 4 7తర్క పయోనిధి పద్మజాస్య కుం6 4 4 జర తుహినాంశు సంఖ్యకు ని8 1జంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .

. ‘అంకానాం వామతో గతిః’ -కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.1,84,46,74,40,73,70,95,51,615ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..

పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటేసెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..అదీ సంగతి…వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…

నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? 

మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .ఆ పండితుడు"

 రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.


🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥





దేవుడు ఎదురుగానే ఉన్నాడు (22-Aug-23, Enlightenment Story)

  🌹దేవుడు ఎదురుగానే ఉన్నాడు🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు.

ఆ ఊళ్ళో ఒక గుడి వుండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది. ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి, తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు.

అందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు- “వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి, ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా వుంది. మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి!”

ఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు.  ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.

ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. “మీరు ఇంకా ఇక్కడే వున్నారా! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం, నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి!” అన్నారు.

కాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.

చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి. పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంత సేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటంలేదు, చలి గా వుంది, నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు.

“దేవుడా! నేను నీకు ఏమి తక్కువ చేసాను? రోజు శ్రద్ధగా పూజలు చేసాను. నిన్నే నమ్ముకున్నాను! అయినా నన్ను కాపాడడానికి రావేంటి!” అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు.

దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “మూర్ఖుడా! నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు. నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా?” అని మందలించి మాయమయిపోయాడు.

పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి, క్షమాపణ కోరాడు.

కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు. “పూజారి గారు! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ వుండడం మంచిది కాదు!” అన్నారు.

పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.

🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Thursday, 17 August 2023

మూగజీవాల ఆవేదన తెలుసుకునే జగద్గురువులు (21-Aug-23, Enlightenment Story)

 🌹మూగజీవాల ఆవేదన తెలుసుకునే జగద్గురువులు🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


ఒకసారి శృంగేరిలోని ఒక కుటుంబం శృంగేరీ వస్తూ మార్గమధ్యంలో  అక్కడి అడవిలో  కొంతమంది  వేటగాళ్ళు ఒక జింకను పట్టుకోవడాన్ని చూశారు. మాంసం కోసం వేటగాళ్ళు యువ జింకలను చంపేస్తారని తెలిసి, వారు ఆ జింక పిల్ల కోసం కొంత డబ్బు చెల్లించి ఇంటికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ జింక చేష్టలకు భరించ లేకపోయారు. గెంతడం, పరిగెత్తడం. వారి ఇంటి వద్ద ఉన్న అన్ని ఆస్తులను విచ్ఛిన్నం చేసింది ఆ జింక. 

దాని గొడవ పడలేక వారు ఆ జింకను శ్రీ నరసింహవనం(జగద్గురువుల నివాసం,సందర్శన స్థలం) వద్దకు తీసుకువచ్చారు. శ్రీ గురు చరణుల నిర్ణయం /సలహా మేరకు ఆ జింకపిల్లను వారి చెంత వదిలి సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. శ్రీ గురువులు దానికి "సీత" అని పేరు పెట్టారు. ప్రతి జింక సీత వలె అదృష్టవంతురాలు కాదు. పూర్వకాలంలో ఋషులు నెమళ్ళు మరియు జింకలను వారి సన్యాస ఆశ్రమంలోనే పెంచుకునేవారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజు, మేము (ఇక్కడ మేము అంటే ఈ విషయం చెప్పిన వారు) ఆ అదృష్ట జింకను జగద్గురువుల చెంత దానిని శృంగేరిలో చూడగలుగుతున్నాము. దాని పూర్వజన్మ సుకృతం.

ప్రతి రోజు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు సీత (ఆ జింక పేరు) శ్రీ గురు సమక్షంలోనే గడిపేది. ఎంతోతపః శక్తి కలిగిన  ఈ పవిత్ర ప్రదేశం లో ఉన్నప్పటికీ, సీతను తన కర్మ ఫలాల నుంచి తప్పించకూడదని విధి నిర్దేశించింది కాబోలు. ఒక రోజు, సీత నుండి కొత్తగా జన్మించిన దాని బిడ్డ  ఆ ప్రదేశము నుండి కనిపించకుండా పోయింది.  అది ఎక్కడికి వెళ్ళి వుంటుందో ఎవరూ గమనించలేదు, ఆలోచన లేదు. మఠ్ సిబ్బంది పిల్ల జింక కోసం ఎక్కడ వెతికినా ఫలించలేదు. సీత (తల్లి జింక) ఆ ప్రదేశం నుంచి ఎక్కడికీ వెళ్లడానికి నిరాకరించింది. సీత తనను తాను శ్రీ గురు చరణుల పాద పద్మములకు పరిమితంచేసుకున్నది. ఆ జింక నిత్యం గురువు గారిని చూడగానే విపరీతంగా కన్నీరు కార్చేది. తప్పిపోయిన తన పిల్ల కోసం ఆమె ఎంతో ఆరాటపడుతోందని స్వామివారు అర్థం చేసుకున్నారు. 

జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహా స్వామి వారు తప్పిపోయిన బిడ్డను దాని తల్లి చెంతకు తిరిగి వచ్చేటట్లు శ్రీ శారదాచంద్రమౌళీశ్వరులను, శ్రీ తోరణ గణపతిని అర్చించి ప్రార్థించారు. మరుసటి రోజు ‘పిల్ల జింక’ ను ఎవరో అజ్ఞాతులు నరసింహావనం లోపల విడిచి వెళ్లారు. అలా ఆ పిల్ల జింక  తిరిగి తల్లి చెంతకు చేరినది. 

సీతకు ఎంతో పారవశ్యం కలిగింది. నిత్యానుష్టాలను చేసుకుంటున్న జగద్గురువుల చెంతకు సీత తన పిల్లతో వచ్చి  జగద్గురువుల ఎదురుగా కూర్చుని తనపిల్ల తనదగ్గరకు వచ్చింది అన్నట్లు ఎంతో సంతోషంతో స్వామివారి పాదాలను నాలికతో నాకింది..పిల్లను నోట కరుచుకుని స్వామి వారి పాదాలకు తగిలేలా తాకించింది

మరుసటి రోజు, స్వామివారు సీతను, ఆమె చిన్నపిల్లను శ్రీ తోరణ గణపతి, శ్రీ శారదాంబ ఆలయాలకు  తీసుకెళ్ళి, శ్రీ గణపతికి 1008 తీపి కుడుములు, అమ్మవారికి సీత పేరుమీద అర్చన నివేదన చేసినారు. సీతకు మరియు ఆమె బిడ్డకు ప్రసాదం ఇచ్చి, “గణపతికి శ్రీ శారదాంబకు మీరు నమస్కారాన్ని తెలియజేయండి, వారు మీ బిడ్డను తీసుకొనిరాలేదా ? అని అన్నారు. సీత సంతోషంగా అమ్మవారికి, గణపతికి నమస్కరించింది. శృంగేరిలోని శ్రీ తోరణ గణపతి,శ్రీ శరదాంబా మందిరాల్లో మేమందరమూ ఇవన్నీ చూశాము.🙏🙏🙏🪷🕉️🌸💐

సర్వం శ్రీ గురుచరణ పాదారవిందార్పణమస్థు.🙏🌸.



🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Monday, 14 August 2023

జీవితంలో మనిషి తెలుసుకొని ఆచరించే నియమాలు (20-Aug-23, Enlightenment Story)

 🌹జీవితంలో మనిషి తెలుసుకొని ఆచరించే నియమాలు🌹

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

💝 కాలం కలసి రావాలి దేనికైనా. దేవుడు అందరికీ అవకాశాలను కల్పిస్తాడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.

💖 అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

💓 సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే.


❤️ ”సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది” అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

💕 ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలి.

💞 తాళం తో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు.

💖 తూటా కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు.

💓 సమాజంలో మనిషి సూదిలాగా బ్రతకాలి. కత్తెర లాగ కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే. కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. అందరిని కలుపుకుంటూ బ్రతకాలి. కత్తెర లాగా విడదీస్తూ కాదు.

💖 ”మనుష్యులు” ఒక్కపూట తినకపోతే తట్టుకోరు. ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే బలహీనత. నీరు తాగకపోతే, గాలి పీల్చకపోతే బతకలేరు. శరీరం వేడి రెండు డిగ్రీలు పెరిగితే జ్వరం. గుండె వత్తిడి పెరిగితే హై బీపి, తగ్గితే లో బీపి. దెబ్బ తగిలితే నొప్పి, కాలితే మంట. చలికి వణుకుతారు, ఎండకు నీరసపడతారు. నిద్రపోకపోతే అలసట,అతినిద్ర, ఊబకాయం. అన్నీ బలహీనతలే.

💞 ~ఐనా అహం, గర్వం, ఈర్ష్యా, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం మొదలైనవి. మూర్తీభవించినతనే మనిషి.

💖 నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

❤️ నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు కదా…! వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఎవరైనా.

💖 స్నేహితుణ్ణి దుఃఖసమయం లోనూ, యోధుణ్ణి యుద్ధంలోను, భార్యను పేదరికంలోనూ, గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి” అన్నారు మనవాళ్లు.

💖 ఓటమి లేనివాడికి అనుభవం రాదు. అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించాలి. గెలవాలన్న తపన, గెలవగలనన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే గెలుపుకు దగ్గర చేసే సాధనాలు.

💓 తాను “ఇతరులను మోసం చేయగలుగుతున్నాను కనుక చాలా తెలివి గలవాణ్ణి” అని అనుకుంటాడు మూర్ఖుడు. అది తన నాశనానికే దారితీస్తుందని గ్రహించని తెలివితక్కువ వాడు.

🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Sunday, 13 August 2023

దీపంలో ఉండే నవగ్రహాల శక్తి (19-Aug-23, Enlightenment Story)

*దీపంలో ఉండే నవగ్రహాల శక్తి *🪔🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మన సనాతన సంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురుని ఇవ్వడమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మిక మైన కార్యక్రమాల్లో మనందరం కుడా దీపాలు వెలిగిస్తాము. దీపాలకు కొండెక్కటానికి ముందు స్వస్తి చెప్పటం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెపుతుంది.



  • దీపపు ఎర్రని ప్రమిద సూర్యుడు🙏,
  • తెల్లని నెయ్యి అంశం చంద్రుడు , 
  • వెలిగే దీపం నిప్పు కుజుని అంశం,🙏
  • ప్రమీదలోని నెయ్యిని కాంతికి 
  • అనుసంధానం చేసే వత్తే బుధుడు.
  • దీపం జ్వాలలో ఉండే పసుపు రంగు  గురువు🙏,   
  • దీపం నుంచి వెలువడే తెల్లని కాంతి పుంజమే శుక్రుడు🙏                            
  • దీపం జ్వాలను వచ్చే నల్లని మసే శనీశ్వరుడు 
  • దీపం నీడ రాహువు 🙏
  • దీపం వెలిగించడం వల్ల  పొందే మోక్షమే కేతువు* 
  • కనుక దీపం లక్ష్మీ స్వరూపమే కాదు నవగ్రహ స్వరూపం కూడా.🙏🙏 
  • అంతేకాదు దీపం పంచభూతాల స్వరూపం కూడా.

ఎలాగంటే..

ప్రమిదపు మట్టి భూమి గాను నెయ్యి నీరు గాను అగ్నిజ్వాల నిప్పు గాను దీపం వెలగడానికి కారణమైన ఆక్సిజన్ గాలి గాను దీపపు కాంతిని ప్రసరింపజేసేది ఆకాశం గాను ఇలా పంచభూతాలు దీపంలో ఉన్నాయి.

దానివల్లనే మన పెద్దవాళ్లు ఇంట్లో దీపం వెలిగించి పంచభూతాల, నవగ్రహా కలయికతో అష్ట ఐశ్వర్యాలు పొందాలని ఈ విధంగా చెప్పారు.🙏

ప్రతి గృహిణి ఉదయం లేవగానే నిత్య కృత్యాలు పూర్తి చేసి బ్రహ్మ ముహూర్తంలో దీపాన్ని వెలిగించాలి.  సంధ్యా సమయం లో కూడా దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి. అయితే రోజు మొత్తంలో ఒకసారి కూడా దీపం పెట్టని ఇల్లు శవం తో సమానం. ఈ దీపం మనకు లక్ష్మి కటాక్షం మాత్రమె కాక మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్ర పరుస్తుంది. కరెంట్ బల్బ్ లు వచ్చాక సంధ్యా దీపాలను పెట్టడం అందరు మరచి పోయారు. సంధ్యా దీపాల వలన గాలిలో ఉన్న బాక్టీరియా ని నశి౦ప చేస్తాయి.

ఇంటి ముందు గడప దగ్గర దీపం పెట్టడమనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. అయితే దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యే లాగా చేస్తాయి. సృష్టిని నిద్ర లేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే, సంధ్యా దీపం సూర్యుని యొక్క ప్రతి రూపంగా చెపుతారు. లోకాన్ని చీకటి నుండి వెలుతురులోకి నడిపించటానికి దీపం ఉపయోగపడుతుంది. అందుకే దీపానికి నమస్కారం చేయాలి. దీపం మానవునిలోని రాగ, ద్వేషం, అసూయ, అహంకారంలను తొలగిస్తుంది.

శుభం కురుత్వం కళ్యాణం, “ఆరోగ్యం” ధన సంపదం.
శత్రువు బుద్ధి వినాశాయ, దీప జ్యోతిర్ నమోస్తుతే.
దీప జ్యోతిర్ పరబ్రహ్మ ,దీపం జ్యోతి జనార్ధనః.
దీపో హరతుమే పాపం సంధ్యా దీపం నమోస్తుతే


🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః🙏

🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

మానవ సంబంధం (18- Aug-23, Enlightenment Story)

 *మానవ సంబంధం*

🌹🌹🌹🌹🌹🌹🌹

'కూరగాయలమ్మా కూరగాయలూ' లచ్చిమి నెత్తి మీద గంపతో అరుస్తూ వీథిలో వెళ్తోంది. ఓ ఇంటి దగ్గర ఆగి మళ్లీ అరిచింది. ఇంట్లో నుంచి సుబ్బమ్మ బయటికి వచ్చి గంప కిందకు దింపడానికి సాయం చేసింది. అరుగు మీద పెట్టారు. పాలకూర ఒక్కోకట్ట ఆరు రూపాయలు చెప్పింది ఆమె. ఈమె రెండు రూపాయల నుంచి బేరంమొదలుపెట్టింది. ‘‘కుదరదమ్మా మేమూ బతకాలి కదా అయిదు రూపాయలకైతే ఇస్తా.’’ ‘‘మూడు రూపాయలకు కట్ట, అంతకుమించి పావలా కూడా ఇవ్వను.’’ ఆ ఇద్దరికీ తెలుసు, ఈమె సగానికి కోసి అడుగుతుందని ఆమెకు. 

అందుకే ఆమె ముందుగానే ఎక్కువ రేటు చెబుతుందని ఈమెకు. కాసేపు బేరమయ్యాక ‘ఫోవమ్మా, ఆ రేటుకు ఇవ్వలేను, నేను పోతున్నా’ అని గంప ఎత్తుకుని కొద్దిదూరం వెళ్లింది, వెనక్కి తిరిగి చూస్తూ ‘చివరకు నాలుగు రూపాయలయితే ఇస్తా’ అంది. ‘అక్కర్లేదు,ఇంకొకామె రోజూ వస్తోంది, ఆమె దగ్గర తీసుకుంటా’ అంది సుబ్బమ్మ. లచ్చిమి ఇంకాస్త దూరం వెళ్లింది తరువాత వెనక్కి తిరిగి మళ్లీ అదే అరుగు దగ్గరకు వచ్చింది. సుబ్బమ్మ తలుపు దగ్గరే ఉంది. ఆ నాలుగు పాలకూర కట్టల్ని నిశితంగా పరిశీలిస్తూ నాణ్యత, కట్టలో ఆకులు గట్రా సరిచూసుకుంటూ తనకు కావల్సినవే తీసుకుంది. 

చివరకు 12 రూపాయలు లచ్చిమి చేతిలో పెట్టింది.ఆమె లెక్క పెట్టకుండా తన నడుముకున్న చిన్న సంచీలోకి కుక్కేసింది. డీల్ అయిపోయింది.గంప నెత్తికెక్కడానికి సాయం చేయబోతూ ‘‘ఎందుకంత నీరసంగా కనిపిస్తున్నవ్ ? పొద్దుటి నుంచీ ఏమైనా తిన్నావా లేదా?’’ అడిగింది

 సుబ్బమ్మ. ‘లేదమ్మా ఇంట్లో సరుకుల్లేవ్. వెళ్లేటప్పుడు బియ్యం, ఉప్పూపప్పూ తీసుకుపోవాలి, వండుకోవాలి.’ కాసేపాగు అంటూ ఇంట్లోకి వెళ్లిన సుబ్బమ్మ విస్తరాకులో కాస్త అన్నం, పప్పు పెట్టుకుని బయటికి వచ్చి లచ్చిమికి ఇచ్చింది. ఓ చెంబులో నీళ్లు తెచ్చింది. ఆమె తిన్నది. ఆమె తింటూ ఉన్నంతసేపు ఇద్దరూలోకాభిరామాయణం, ఈతిబాధలు చెప్పుకున్నారు. చివరికి ఈమె గంప ఎత్తి ఆమె నెత్తి మీద పెట్టింది, ఆమె మెల్లిగా మరో వీథిలోకి వెళ్లిపోయింది. 

ఇది గమనిస్తున్న సుబ్బమ్మ బిడ్డ అడిగింది విసుగ్గా‘‘ఏంటి మమ్మీ ఆఫ్టరాల్, 3రూపాయల ధర దగ్గర అంతగా బేరమాడినవ్. ఆమె ఆకలిగా ఉందనగానే నువ్వే కడుపు నింపి పంపించావ్. నువ్వు అర్థం కావు’’. ‘‘అది కాదే తల్లీ పాలకూర దగ్గర నేను కస్టమర్, ఆమె ట్రేడర్. 

ఎక్కువ రేటు కోసం ఆమె ప్రయత్నం, తక్కువ రేటు ప్లస్ నాణ్యత నా తాపత్రయం. ఇది సహజం. అవసరం. వ్యాపారమంటేనే అంత.’’ ‘‘నువ్వు బేరమాడిన 3రూపాయలు ఎక్కువా. రూపాయల్లో నువ్వు పెట్టిన అన్నం విలువ ఎక్కువా?’’ ‘‘దేని దారి దానిదే. బేరసారాల్లో మానవత్వం ఉండదు. మానవత్వంలో బేరసారాలు ఉండకూడదు. ఒకటి ట్రేడర్ - కస్టమర్ బంధం. మరొకటి మానవ సంబంధం.’’ ‘‘ఏమో, నాకేమీ అర్థం కాలేదు. నీకే కాదు, చాలా మందికీ అర్థం కాదు. పద లోపలకు."


🌻సర్వేజనా సుఖినోభవంతు|🌻

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...