Saturday 29 June 2024

భగవంతుని అనుగ్రహం (30-June-24, Enlightment Story)

 భగవంతుని అనుగ్రహం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!. మనం రైల్వే స్టేషన్‌కు చేరుకునే వరకు, మన సామాను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బండి లేదా సైకిల్ రిక్షా లేదా టాక్సీలో తీసుకెళ్తాం!!...

ఇవేవీ లేని పక్షంలో లగేజీని తలపై మోయాల్సి వస్తుంది,  స్టేషన్‌కు చేరుకుని రైలులో కూర్చున్నాక, రైలు మన లగేజీతో పాటు మనల్ని తీసుకువెళుతుంది!!...

రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజీని తలపై పెట్టుకుంటామా! అలా పెట్టుకుంటే అంతటి కన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది?? మనల్ని మోసే రైలు మన లగేజిని మోయాలేదా?!




అలాగే మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, అప్పుడు నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి.అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, అయన మనకు మంచిదానినే యిస్తాడు.

ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday 28 June 2024

తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? (29-June-24, Enlightment Story)

మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలము

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు.


చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటివరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్యఫలం ఏపాటి సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు.


తపోఫలమా? సత్సాంగత్య ఫలమా? ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మవద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు.

ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు.

విశ్వామిత్రుడు వెంటనే ‘నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు.

అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్కపూట సమయంతో పాటు మేం చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు.

వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని ‘మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చ’ని అంటాడు.అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని ప్రశ్నించారు. ‘మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు అన్నాడు.

వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్యఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహించారు.

చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో?

ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మనమధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా అదే పని. ఏ ఇద్దరు కలిసినా అదే తీరు. ‘చరవాణి’ తోనే మాట్లాడుకుంటున్నారు. చరవాణితోనే గడుపుతున్నారు. దానితోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు మాట్లాడేదెప్పుడు?

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday 27 June 2024

ఇ మెయిల్ ID లేదు (28-June-24, Enlightment Story)

ఇ మెయిల్ ID లేదు 

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

రమేష్ ఒక పెద్ద కంపెనీలో ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి ఇంటర్వూకి వెళ్ళాడు.ఇంటర్వూ చేసే అతను నేలను తుడిచి చూపించమన్నాడు.రమేష్ శుభ్రంగా నేలను తుడిచాడు.ఇంటర్వూ చేసే అతను బావుందన్నట్టుగా తలాడించి నీకు జాబ్ ఇస్తున్నాను.నీ ఇ మెయిల్ ID ఇవ్వు.నీకు అప్లికేషన్ ఫార్మ్ పంపిస్తా.దాన్ని ఫిలప్ చేసి పంపించు అన్నాడు.రమేష్ ఒక క్షణం ఆగి చెప్పాడు.నాకు కంప్యూటర్ లేదు.ఇ మెయిల్ ID లేదు అని.అలా అయితే జాబ్ ఎలా ఇస్తాను.మా పద్ధతి అయితే ఇదే అని చెప్పాడు ఇంటర్వూ అతను.సరే అన్నట్టు తలాడించి బయటకు వెళ్ళాడు రమేష్.


అప్పుడు అతని జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి.ఎదురుగా కూరల మార్కెట్.ఆ వంద రూపాయలతో టమోటాలు కొన్నాడు.ఇంటింటికీ తిరిగి వాటిని అమ్మాడు.అన్నీ అమ్ముడయ్యేసరికి రెండు గంటలు పట్టింది.మళ్ళీ వచ్చిన లాభం, డబ్బులు కూడా కలిపి ఇంకా ఎక్కువ టమోటాలు కొన్నాడు.వేరే కాలనీకి వెళ్ళి కష్టపడి అన్నీ అమ్మాడు.అలా ఇంకోసారి చేసాడు.కష్టాన్ని సవాలుగా తీసుకున్నాడే కానీ అలసటను లెక్క చెయ్యలేదు.రాత్రికి ఇల్లు చేరేటప్పటికి చేతిలో మూడు వందలు ఉన్నాయి.వంద పెట్టుబడికి కష్టాన్ని జోడిస్తే రెండింతల లాభం మరియు పెట్టుబడి కూడా తిరిగి సంపాదించగలిగాడు రమేష్.

అదే కొనసాగించాడు.కొన్ని నెలలకి కూరల బండి కొనుక్కున్నాడు.తరువాత ఇంకొన్ని నెలలకి  ట్రాలీ కొనుక్కున్నాడు.చివరికి కూరలు అమ్మే సూపర్ మార్కెట్ తెరిచాడు.అలా కొన్నేళ్ళకు కష్టపడి లాభానికిలాభం సంపాదించుకుంటూ కష్టేఫలిలా స్వయంకృషితో ఓ కంపెనీ స్థాపించాడు.సరైన ప్రణాళిక , కష్టం కలిస్తే విజయం తప్పక సొంతం అవుతుంది అని చేసి చూపించాడు.

ఇక ఒక రోజున ఇంక తన కుటుంబానికి అవసరం అనిపించి ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుందామని ఒక ఏజెంట్ ని ఇంటికి పిలిచి అతనితో చర్చించి ఒక మంచి పాలసీ ని కుదుర్చుకున్నాడు.ఇన్స్యూరెన్స్ అతను సార్ మీ ఇ మెయిల్ ID చెప్పండి అన్నాడు.మళ్ళీ అప్పటిలానే రమేష్ ఒక క్షణం ఆగి నాకు ఇ మెయిల్ ID లేదు అన్నాడు.పాలసీ అతను ఆశ్చర్యంగా.ఇంత పెద్ద స్థానానికి వచ్చారు.ఒక పెద్ద సంస్థకు యజమాని మీరు.మీకు ఇ మెయిల్ ID లేదా ఒకవేళ ఉండుంటే ఇంకెంత బావుంటుందో ఊహించండి అన్నాడు.దానికి రమేష్ తలూపుతూ ఊ అవును ఇ మెయిల్ ID ఉండి ఉంటే నేను ఆఫీస్ బాయ్ గా ఉండేవాణ్ణి అని అన్నాడు అర్ధం కాక పాలసీ అతను తల గోక్కున్నాడు.

ఒక్కోసారి ఊహించని ఒక ప్రారంభం ఒక మనిషిని మంచి ఎత్తులకు  తీసుకెళ్ళగలదు కాకపోతే ఎంత కష్టపడితే అంత విజయం సాధించగలము.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

ఇది క‌దా జీవితమంటే (27-June-24, Enlightment Story)

 ఇది క‌దా జీవితమంటే..!*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

వారం రోజుల కింద‌ట తెగిన చెప్పు కుట్టిద్దామంటే విజ‌య‌వాడ‌లో కుట్టేవారిని క‌నిపెట్ట‌డం పెద్ద టాస్కే అయ్యింది. మొత్తానికి అయ్య‌ప్ప‌న‌గ‌ర్ రోడ్డులో ఇవాళ ఒకాయ‌న్ని ప‌ట్టుకుని చెప్పు కుట్టించుకున్నాను. అన్నిచోట్లా ఇర‌వై రూపాయ‌లు తీసుకుంటుంటే ఆయ‌న ప‌ది రూపాయ‌లే తీసుకున్నాడు. స‌రే ప‌నేం లేదు క‌దా అని ఆయ‌నతో కాసేపు మాట్లాడాను. 


ఆయ‌న తాత‌, తండ్రుల‌ది కూడా ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు. ఇంతకీ మీ పిల్ల‌లు ఏం చేస్తున్నారు? అని అడిగితే చెప్పాడు అస‌లు విష‌యం. వాళ్ల‌బ్బాయి ఇంజ‌నీరింగ్ చ‌దివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అల్లుడు బ్యాంక్ ఉద్యోగి. య‌న‌మ‌ల‌కుదురులో 7 సెంట్ల‌లో సొంతిల్లు. నెల‌కు వ‌చ్చే అద్దెలు 25వేలు.  నున్న‌లో ఎక‌రం మామిడి తోట‌. ఇన్ని ఉండి ఎందుకు ఇంకా చెప్పులు కుడుతున్నావ‌ని అడిగితే --


ఒక‌ప్పుడు ఈ ప‌నే మాకు అన్నం పెట్టింది. మా నాన్న ఈ ప‌నిచేసే అప్ప‌ట్లో రేటు త‌క్క‌వని నున్న‌లో మూడెక‌రాలు కొంటే నా వాటా ఎక‌రం వ‌చ్చింది. మా చిన్న‌ప్పుడు మా నాన్న చెప్పులు కుడితే డ‌బ్బులకు బ‌దులు వ‌డ్లు ఇచ్చేవారు. అవి స‌రిపోక మా అమ్మ వ‌రి కోసిన పొలాల్లో ప‌రిగె ఏరుకొచ్చి అందులో గింజ‌లను వేరుచేసి మాకు అన్నం పెట్టేది. మేం త‌ర‌త‌రాలుగా ఆధార‌ప‌డి బ్ర‌తికిన ప‌ని ఇది. డ‌బ్బులున్నా ఈ ప‌నిచేస్తేనే నాకు సంతృప్తిగా ఉంటుంది "  అని ఆయ‌న చెప్పిన మాట‌లు అద్భుతంగా అనిపించాయి. మీరు ఎప్పుడైనా రండి ఉద‌యం నుంచి సాయంత్రం ఏడింటిదాకా ఇక్క‌డే ఉంటాన‌ని చెప్పాడు. 



వెనక కావాల్సినంత ఆదాయం ఉంద‌న్న ధీమా లేదు. ఒక‌రోజు కుట్ట‌క‌పోతే ఏంకాదులే అనే ఆలోచ‌న లేదు. అందుకే ఆదివారం కూడా అక్క‌డే ఉన్నాడు. నా త‌ర్వాత మ‌రొకాయన వ‌చ్చి 200 నోటుకు చిల్ల‌ర ఉందా? అని అడిగితే ఫ‌ర్లేదు స‌ర్ ఈసారి వ‌చ్చిన‌ప్పుడు ఇవ్వండి అని ముందు చెప్పు తీసుకుని కుట్టేశాడు.


సింపుల్‌గా ఉండే ధ‌న‌వంతులు మ‌న‌కు రోల్‌మోడ‌ల్‌. సుధా నారాయ‌ణ మూర్తి సాదాసీదా నేత చీర క‌ట్టుకుంటే అదొక ఆశ్చ‌ర్యం మ‌న‌కి. సెల‌బ్రిటీలు రోడ్డు ప‌క్క‌న ధాబాలో తింటే అదీ ఒక వార్తే. అలా ఉండ‌టం వారి గొప్ప‌త‌న‌మే. ఈ చెప్పులు కుట్టే ఆయ‌న కూడా ఆ కోవ‌కి చెందిన వాడే. ఆయ‌నకు చ‌దువు లేదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగాడు. పిల్ల‌ల్ని చ‌దివించుకున్నాడు. ఇవాళ కూర్చుని తినే స్థితికి చేరాడు. అలాగ‌ని అన్నం పెట్టిన వృత్తిని వ‌దల్లేదు. 59ఏళ్ల ఆ ముస‌లాయ‌నకు ప‌ళ్లు ఊడిపోయే ద‌శ వ‌చ్చింది, అందుకే మాట స్ప‌ష్టంగా రావ‌ట్లేదు. నిరంత‌ర క‌ష్టం వ‌ల్ల ఒంట్లో ఇంకెలాంటి రోగాలు చేర‌లేదు. ఉద‌యం అన్నం తిని రావ‌డం. మ‌ధ్యాహ్నం భోజ‌నానికి వెళ్లొచ్చి మ‌ళ్లీ రాత్రి వ‌ర‌కూ అక్క‌డే చెప్పులు కుట్ట‌డం. ఇదే సంతృప్తి అంటున్నాడు. 


ఆయ‌న వైపు నుంచి చూస్తే ఆయ‌న‌కిదే విలాస‌వంత‌మైన జీవితం. ఈ మ‌ధ్య ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో చూశా. ప‌చ్చ‌ని పొలాల మ‌ధ్య‌లో చిన్న పంపుసెట్ లాంటి ఇంట్లో ఒకాయ‌న ద‌ర్జాగా కూర్చున్న ఫొటో అది. ఈ ఆనందం ఎంత పెద్ద బంగ‌ళా ఉన్నా వ‌స్తుందా? అనేది ప్ర‌శ్న‌.  


*విలాసం, ఆనందం అనేవి న‌చ్చిన జీవన విధానంతో వ‌స్తాయి త‌ప్ప, కేవలం డబ్బు వల్ల మాత్రమే రావు.*



🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday 20 June 2024

గ్లాసుడు మజ్జిగపులుసు (21-June-24, Enlightment Story)

గ్లాసుడు మజ్జిగపులుసు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

భార్య : ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది.
భర్త : అవునా, అలాగైతే దాన్నేం చేస్తావు?


భార్య : ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే.
భర్త : అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి..."

భార్య : "ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే!"
భర్త : "ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి.తినడానికీ రుచిగ ఉంటుంది."


భార్య : "గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను, వ్రాసుకోండి."
భర్త : "సరే చెప్పు..."

భార్య : "ఊఁ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ, జీలకర్ర.."
భర్త : "సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా?"

భార్య : "ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ..."
భర్త : "బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు?"

భార్య : "మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తరా? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి."
భర్త : "సరే... బయల్దేరనా?"

భార్య : "అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడ పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు..."
భర్త : "ఇవన్నీ మజ్జిగ పులుసుకు ఎందుకే?"

భార్య : "ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం.."
భర్త : "ఇక చాలా?"

భార్య : "కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి."
భర్త : "హల్వాకు ఇంగువ వేస్తారా?"

భార్య : "అబ్బా.... హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి?"
భర్త : "ఇకనైనా వెళ్ళనా?"

భార్య : "ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్..."
భర్త : "సరే.. బయల్దేరుతున్నాను."

భార్య : "అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు."
భర్త : "నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను."

భార్య : "ఎందుకు? మార్కెట్ కు పోరా?"
భర్త : "నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను.."

భార్య : "ఏమిటండీ, మీరే చెప్పారుగా..."
భర్త : ఓసి... నీ అమ్మ కడుపు మాడా బుద్ధి లేక చెప్పానే ..!

అట్లుంటది మరి వీళ్లతో 😉😂😆


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday 19 June 2024

మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే (20-June-24, Enlightment Story)

మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషము గాని ఉండదు. అందరి పట్ల సమభావనతో ఉంటారు. మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు .మన జన్మలకి మనమే కారణము.మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములు ,అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి.


ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి. విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలి నీరు పోసేవారు ఉండాలి వాటిని పరిరక్షించేవారు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు.


మనము భక్తి చేత గాని, ధ్యానం చేత గాని ,కర్మ చేత గాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మొర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము. భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి .

సహనముతో సాధించుకోవాలి. ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు. అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది.

ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు, కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తాడు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి.

మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి.

కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడితో సంబంధం ఏర్పడింది అని అర్థము. మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే.

ఆత్మ దర్శనం
 🪴🪴🪴🪴
సహజముగా మనమంతా ఆత్మ-స్వరూపులము,ఆనందస్వరూపులము. కానీ ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆనందం గురించి బయట ఎక్కడో వెతుక్కుంటున్నాము. అంటే మన గురించి మనమే వెతుక్కుంటున్నాం. ఇదే ఆశ్చర్యం.

ఆధ్యాత్మిక విద్య కేవలం వినడం తోనే సరిపోదు. దానిని ఆచరణలో పెట్టినపుడే పూర్తిగా అవగతమౌతుంది. తెల్లటి బట్టకు ఏ రంగు వేసినా చక్కగా అంటుతుంది. అలాగే సారవంతమైన భూమిలో ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది. సాత్వికమైన హృదయంలో ఆధ్యాత్మికత తొందరగా నాటుకుంటుంది.

ఆత్మ అనేది అవ్యక్తము. కనపడదు. వినపడదు. తాకబడదు. ఇంద్రియములకు, మనసుకు అతీతమైనది. సూక్ష్మమైనది.

ఆత్మ దర్శనం కావాలంటే ముందు హృదయం నిర్మలంగా ఉండాలి. ఆత్మ గురించి విచారణ చేయాలి. పురాణేతిహాసాలను, గ్రంధములను చదవాలి సద్గురువును ఆశ్రయించాలి. సరైన సాధనలు చేయాలి. తద్వారా ఆత్మ స్వరూపాన్ని గుర్తించాలి. అపుడే నిజమైన మనశ్శాంతి, ఆత్మానందము


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday 18 June 2024

మనిషి సంఘజీవి (19-June-24, Enlightment Story)

మనిషి సంఘజీవి

🌺🍀🌺🍀🌺

మనిషికి ఇతరుల సహకారమవసరము, తప్పదు.

మనిషి సంఘజీవి.తానొక్కడే కూచుని తినకూడదని పూర్వము అతిథి లేందే భోజనం చేయకూడదని నియమం వుండేది.కొన్ని ఊర్లలో మధ్యాహ్నం,రాత్రీ  ఆఖరి రైలూ,బస్సూ వెళ్ళిపోయే వరకూ భోజనం చేసేవారుకారు.(అప్పుడు యిన్ని రైళ్ళూ.బస్సులూ ఉండేవి కావు) అందులో ఎవరైనా దిగి యింటికి భోజనానినికి వస్తారేమో నని ఎదురు చూసి మరీ భోజనం చేసేవారు.ఇద్దరు యజమానులు అతిథుల కోసం వీధిలో తిరుగుతూ ఒకరు కనబడితే మీరు మాయింటికి రావాలంటే మాయింటికి రావాలని దెబ్బలాడు కున్నారట.


ఈ విధానాన్ననుసరించే వనభోజనాలు ఏర్పడ్డాయి.కార్తీక మాసాలు వనభోజనం చెయ్యాలని అందరూ కలిసి వనభోజనానికి వెళ్తారు.అది యిప్పటికీ కొనసాగుతూంది.అందరూ కలిసి వనానికి వెళ్లి అక్కడే వండుకొని అక్కడే భోజనాలు చేస్తారు.దినమంతా ఆటపాటలతో సరదాగా గడుపుతారు.అదొక ఆనందం.సంతోషాల సరాగాల్ని నంజుకుంటూ తిన్న భోజనం ముందు ఒక్కడే త్రాగిన అమృతం కూడా బలాదూరే.

అందుకే "విందు భోజనం పసందు భోజనం ఏటి ఒడ్డు తోటలోన మేటి భోజనం అంటూ 'బాలభారతం' చిత్రం లో చిన్ననాటి కురు,పాండవుల్ని వనభోజనానికి పంపిస్తూ కమ్మటి పాటను వండి వార్చారు ఆరుద్రగారు.నేతిగారెలు,నేతిబూరెలు,జాతివడ్ల పులిహోర, పరవాన్నాలు,  అప్పడాలు, దప్పళాలు ,ఆవకూరలు,పేరు చెప్పగానే నోరూరే పిండివంటలు,బొబ్బట్లు,మినపట్లు ,నంజుళ్ళు,దబ్బకాయ లంతేసి పెద్ద లడ్డుండలు,

పులుపు తీపి కారాలు ముక్కు దాకా బాగా కలిపి కొట్టి తిన్నదే కమ్మని విందు,"అంటూ నోరూరేలా, నోరూరించేలా  వర్ణించిన కవి, సహపంక్తి భోజనానం లోని సందేశాన్ని

అభిరుచుల మేళవింపే నిండుభోజనం, అన్నదమ్ములారగించు దండి భోజనం,ఒంటిపిల్లి రాసాసిది ఉత్త భోజనం, అన్న బంతిలోన భోజనం పండగౌను పంక్తి  భోజనం,సహపంక్తి భోజనం. అని తేటతెల్లం చేశారు.

ఈనాటి వురుకూ పరుగుల జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి వనభోజనాలు,సహపంక్తి భోజనాలు లాంటి ఆటవిడుపు అవసరం. కొన్నిచోట్ల సమారాధనలు,సంతర్పణలు జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు మేమంతా కలిసి యింట్లో  పులుసన్నం,పెరుగన్నం,అప్పడాలు,వడియాలు,చేసుకొని
ఎడ్లబళ్ళు కట్టుకొని మావూరి ఏటి ఒడ్డుకు వెళ్ళేవాళ్ళం.

అరటి ఆకుల్లో భోజనం శ్రేష్టం. 

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

భగవంతుని అనుగ్రహం (30-June-24, Enlightment Story)

  భగవంతుని అనుగ్రహం 🌺🍀🌺🍀 🌺 🌺🍀🌺🍀 భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!. మనం రైల్వే స్టేషన్‌కు చేరుకునే వర...