Wednesday 19 April 2023

రాముడు - ప్రారబ్ద కర్మ (28-Apr-23, Enlightenment Story)

 *రాముడు - ప్రారబ్ద కర్మ*

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

💝 మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే. ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో, పురాణాల లోనే కాకుండా నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం.

💖 రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి, కారణం , ఒక మహాపతివ్రత శాపం !

💓 దేవాసుర సంగ్రామం సమయంలో, మృతసంజీవనీ మంత్రబలంతో చావులేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిల్చుందాఋషి పత్ని !

💓 శ్రీమహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శనచక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త, మహా తపోధనుడు, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యావియోగం తో బాధపడాలి అని ! అందుకే రాముని వనవాసానికి కైక, లేదా మందర , లేదా దశరథుడు కారణంకాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది.



❤️ అంటే శ్రీరాముడిక్కూడా కర్మానుభవం తప్పలేదు. అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి, రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో తీరా కైకమ్మ వరాల విషయంగా, వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు... "ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తాను” అన్నాడు.

💖 అప్పుడు రాముడు తమ్మునితో “నాయనా! నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు ఇప్పుడు మౌనంగా ఉండటం ఆయన తప్పు కాదు. అతి బలీయం విధివిధానం! అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో. పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు. ఈ ప్రారబ్దకర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు. కనుక కోపాన్ని తగ్గించుకొని తండ్రిఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా!”అన్నాడు.

💓 భగవద్గీతలో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే ! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడమే భావ్యం !"అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి.

❤️ భగవద్గీతలోని 18 వ అధ్యాయం 61 వ శ్లోకంలో, “ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను !!"అని గీతాచార్యుడు చెప్పినట్టుగా, సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే.

💓 వారే కాదు… భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు.! దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే. ఆ కర్మల ఫలితం, సుఖమైనా, దుఃఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా అనుభవించ వలసిందే.

💞 వాలిని చెట్టుచాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రాముడు తన మరుజన్మ అయిన కృష్ణావతారంలో తన నిర్యాణంకోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో కర్మ ఫలితాన్ని తాను అనుభవించక తప్పలేదు.

💝 మరో దృష్టాంతం. ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా, జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో మిడతల వలె మాడిపోయారు.

💖 అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు, సమర్థత ఉండి, అన్యాయం జరగకుండా అడ్డుకునేశక్తి ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయినవాళ్లు కూడా అంతే పాపాత్ములు. కనుకనే శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞాశాలియైనా తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు

💝 రామాయణ భారత భాగవతాలన్నీ “సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి” అని బోధిస్తున్నాయని మనం గ్రహించాలి.

💖 దేవుడు మనిషికి రెండు వరాలు అనుగ్రహించాడు. ఒకటి జ్ఞానం, రెండు మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాల్లో సత్ప్రవర్తన, సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన ఈ మానవజన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా.

💓 పరపీడనం పాపాన్నీ, తాపాన్నీ కలిగిస్తుంది. నవ్వులాటకైనా ఏ ప్రాణినీ హింసించకూడదు. ఎందుకంటే అన్ని శరీరాల్లో ఉన్నది కూడా పరమాత్ముడే. అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ… మనలోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మరచిపోవద్దు.

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

No comments:

Post a Comment

ప్రయత్నలోపం పనికిరాదు (14-May-24, Enlightment Story)

  ప్రయత్నలోపం పనికిరాదు 🌺🍀🌺🍀 🌺 🌺 🌺🍀🌺 జీవితం అందరికీ  పూలపాన్పు కాదు. కొందరికి ముళ్లబాట. జీవిత పయనంలో  అవమానాలు, అవహేళనలు, సమస్యలు ఎ...