*సత్పురుషుడు "గంధం చెక్క" లాంటివాడు (నీతి కథ)*
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺
గంధం చెక్కను నరికినా, అరగదీసినా,కాండాన్ని తొలిచినా సుగంధాన్నే ఇస్తుంది. సత్పురుషుడు గంథం చెక్క లాంటివాడు.తనను పట్టించుకోకున్నా,తనకు విలువ ఇవ్వకున్నా,తనను హేళన చేసినా సమాజ శ్రేయస్సుకే పాటుపడుతాడు. అలాంటి ఓ గొప్ప సత్పురుషుని కథ ఇది...!!!*కథ ప్రారంభం :-*
పూర్వం గంగవరం అనే గ్రామంలో సుశాంతుడు అనే ఒక సత్పురుషుడు ఉండేవాడు.ఊళ్ళోవారు పెట్టిన భిక్షను స్వీకరిస్తూ, ఊరు ప్రక్కనున్న నదిలో స్నానం చేస్తూ త్రికాలముల యందు లోక కళ్యాణం కోసం ఉపాసించేవాడు. ఆ ఊళ్ళో సకాలంలో వర్షాలు పడుతూ ఊరంతా సుభిక్షంగా ఉండేది. కానీ ఇతడి నిస్వార్థ సాధనను అర్థం చేసుకోని గ్రామస్తులు ఇతడిని సోమరిపోతూ అని,అసమర్థుడని హేళన చేసేవారు. అయినా ఇదేమి పట్టించుకోక సుశాంతుడు తన లోక కళ్యాణ సాధనను కొనసాగిస్తూ ఉన్నాడు...!!!
ఇలా సాగుతుండగా ఒకరోజు ఊళ్ళోవాళ్ళందరూ నది ఆవల ఒడ్డునున్న రత్నపురం అనే గ్రామానికి పెళ్లి కోసమేనని పడవలో బయలుదేరారు...!!! పడవ బయలుదేరుతుందనగా ఈ సుశాంతుఁడు పరుపరుగున పడవను చేరుకొని నేను కూడా నది ఆవలకు వస్తానన్నాడు. ఇది విన్న గ్రామస్తులు "ఒరేయ్ అక్కడ కూడా బిచ్చమెత్తుకుంటావా...??!!" అని ఈ నిస్వార్థ సాధకుడిని అవమానపరిచి, పడవలో చోటులేదని చెప్పారు. అయినా సరే నేను వస్తాను అని సుశాంతుఁడు పట్టుబడితే, వీడిని క్షోభకు గురి చేయాలన్న ఆలోచనతో సరే మాతో ఆవల ఒడ్డుకు రా, కానీ ఈ పడవలో నీ రెండుకాళ్లు పట్టవు ఒంటి కాలి మీద నిల్చొని రావాల్సి ఉంటుంది అన్నారు. అప్పుడు సాధకుడు సంతోషంతో సరేయని ఆ పడవలో ఎక్కి తన ఒక కాలి మడిమతో నిల్చున్నాడు, ప్రయాణం ప్రారంభమయ్యింది...!!!
ఇక ఆవలి ఒడ్డు వంద అడుగుల దూరంలో ఉందనగా అధిక బరువుతో పడవ ఊగడం మొదలయింది. పడవ ఎక్కడ నీట మునుగుతుందో అన్న భయంతో పడవలో ఉన్న గ్రామస్తులు భయంతో వణూకుతూ ఉన్నారు...!!!
ఈ అధిక బరువుకు కారణం వీడేయని భావించి కోపంతో గ్రామస్తులు సాధకుడిని పడవ నుండి నీటిలోకి నెట్టేయబోయారు, భయపడకండి ఎవ్వరికీ ఏమీకాదు అని సుశాంతుఁడు ఎంతజెప్పినా వినకుండా పాపం అతడిని పడవ నుండి నెట్టేశారు. అదృష్టవశాత్తు నదిలో పడ్డ అతడు ప్రక్కనే ఉన్న ఒక బండరాయిని చేరి ప్రాణం దక్కించుకున్నాడు. ఆవేదనతో ఏడుస్తూ "భగవంతుడా నన్ను మన్నించు చివరి వరకూ ప్రయత్నించాను కానీ వీలు కాలేదు" అని ఈశ్వరుడికి మొరపెట్టుకున్నాడు...!!!
సుశాంతుఁడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక పడవలో ఉన్న గ్రామస్తులు విచిత్రపోయారు. అంతలోనే క్షణం కూడా గడవక ముందే పడవలోకి నీళ్లు చేరి పడవ మునిగిపోయి గ్రామస్తులంతా చనిపోయారు...!!!
సుశాంతుడనే సాధకుడిని పడవలో నుండి నెట్టేయగానే పడవలోకి నీళ్లు వచ్చి పడవ ఎందుకు మునిగిపోయిందో తెలుసా...???
సుశాంతుఁడు అప్పటి వరకు పడవలో ఒంటి కాలు మడిమతో నిల్చున్నది "ఆ పడవలో ఉన్న రంధ్రం పైన...!!! "
పడవలో కన్నం పడ్డదన్న సంగతిని తన యోగ దృష్టితో ముందే గ్రహించి, ఊరువాళ్ళు వద్దన్నా అవమాన పరిచినా గ్రామస్థులను కాపాడాలని పడవలోనే వస్తానన్నాడు...!!! కానీ ఏమి చేస్తాము, వినాశ కాలే విపరీత బుధ్ధి అన్నట్టు పిచ్చెక్కిన అహంకారంతో ఈ సాధకుడిని తక్కువంచనా వేసి అందరూ మృత్యు ఒడికి చేరుకున్నారు...!!!
….............................
*కథలో నీతి :-*
ధన ధాన్య సంపద ఉంది కదాయని సత్పురుషులను, సాధకులను హేళన చేయవద్దు...!!!
సాధకులు సాధన చేస్తున్నారు కాబట్టే, మనం వర్షపు చినుకులను చుస్తున్నాము...!!!
సత్పురుషులు సాధన చేస్తున్నారు కాబట్టే, మనం అన్నం మెతుకును చుస్తున్నాము...!!!
సాధువులు సాధన చేస్తున్నారు కాబట్టే, మనం ప్రాణ వాయువును పీల్చగలుతున్నాము...!!!
మన సంపద, మన ఆస్తులు,మన ఐశ్వర్యాలు ఇవి అన్నీ సత్పురుషుల కాలి గోటికి కూడా సరితూగవు."*
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment