*రామాయణం 108 ప్రశ్నలు –జవాబులతో*
🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀*రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనుపెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి...*
*1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?* : వాల్మీకి
*2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?* : నారదుడు.
*3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?* : తమసా నది.
4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? : 24,000.
*5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?* : కుశలవులు.
*6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?* : సరయూ నది.
*7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?* : కోసల రాజ్యం.
*8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?* : సుమంత్రుడు.
*9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?* : కౌసల్య, సుమిత్ర, కైకేయి.
*10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?* : పుత్రకామేష్ఠి.
*11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?* : కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
*12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?* : జాంబవంతుడు.
*13. వాలి ఎవరి అంశతో జన్మించెను?* : దేవేంద్రుడు.
*14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?* : హనుమంతుడు.
*15. కౌసల్య కుమారుని పేరేమిటి?* : శ్రీరాముడు.
*16. భరతుని తల్లి పేరేమిటి?* : కైకేయి.
*17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?* : లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
*18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?* : వసిష్ఠుడు.
*19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?* : 16 సంవత్సరములు.
*20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?* : మారీచ, సుబాహులు.
*21. రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?* : బల-అతిబల.
*22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?* : సిద్ధాశ్రమం.
*23. తాటక భర్త పేరేమిటి?* : సుందుడు.
*24. తాటకను శపించిన మహర్షి ఎవరు?* : అగస్త్యుడు.
*25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?* : భగీరథుడు.
*26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?* : జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.
*27. అహల్య భర్త ఎవరు?* : గౌతమ మహర్షి.
*28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?* : శతానందుడు.
*29. సీత ఎవరికి జన్మించెను?* : నాగటి చాలున జనకునికి దొరికెను.
*30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?* : దేవరాతుడు.
*31. శివధనుస్సును తయారు చేసినదెవరు?* : విశ్వకర్మ.
*32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?* : మాండవి, శృతకీర్తి.
*33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?* : జనకుడు.
*34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?* : కుశధ్వజుడు.
*35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?* : వైష్ణవ ధనుస్సు.
*36. భరతుని మేనమామ పేరు ఏమిటి?* : యుధాజిత్తు.
*37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?* : మంధర.
*38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?* : గిరివ్రజపురం, మేనమామ యింట.
*39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?* : శృంగిబేరపురం.
*40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?* : గారచెట్టు.
*41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?* : భారద్వాజ ముని.
*42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?* : మాల్యవతీ.
*43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?* : తైలద్రోణములో.
*44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?* : జాబాలి.
*45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?* : నందిగ్రామము.
*46. అత్రిమహాముని భార్య ఎవరు?* : అనసూయ.
*47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?* : విరాధుడు.
*48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?* : అగస్త్యుడు.
*49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?* : గోదావరి.
*50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?* : శూర్ఫణఖ.
*51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?* : జనస్థానము.
*52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?* : మారీచుడు.
*53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?* : బంగారులేడి.
*54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?* : జటాయువు.
*55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?*: దక్షిణపు దిక్కు.
*56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?* : కబంధుని.
*57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?* : మతంగ వనం, పంపానదీ.
*58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?* : ఋష్యమూక పర్వతం.
*59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?* : హనుమంతుడు.
*60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?* : అగ్ని సాక్షిగా.
*61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?* : కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
*62. సుగ్రీవుని భార్య పేరు?* : రుమ.
*63. వాలి భార్యపేరు?* : తార.
*64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?* : కిష్కింధ.
*65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?* : మాయావి.
*66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?* : దుందుభి.
*67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?* : మతంగముని.
*68. వాలి కుమారుని పేరేమిటి?* : అంగదుడు.
*69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?* : ఏడు.
*70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?* : ప్రసవణగిరి.
*71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "తూర్పు" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?* : వినతుడు.
*72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "దక్షిణ" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?* : అంగదుడు.
*73. సుగ్రీవునికి, సీతాన్వేషణ కోసం "పశ్చిమ" దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?* : మామగారు, తార తండ్రి.
*74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "ఉత్తర" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?* : శతబలుడు.
*75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?* : మాసం (ఒక నెల).
*76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?* : దక్షిణ దిక్కు.
*77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?* : తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
*78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?* : స్వయంప్రభ.
*79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?*: సంపాతి.
*80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?* : పుంజికస్థల.
*81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?* : మహేంద్రపర్వతము.
*82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?* : మైనాకుడు.
*83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?* : సురస.
*84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?* : సింహిక.
*85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?* : నూరు యోజనములు.
*86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?* : లంబ పర్వతం.
*87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?* : అశోక వనం.
*88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?* : పన్నెండు
*89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?* : త్రిజట.
*90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?* : రామ కథ.
*91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?* : చూడామణి.
*92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?* : ఎనభై వేలమంది.
*93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?* : ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
*94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?* : విభీషణుడు.
*95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?* : మధువనం.
*96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?* : మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
*97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?* : ఆలింగన సౌభాగ్యం.
*98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?* : నలుడు
*99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?* : నికుంభిల.
*100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?* : అగస్త్యుడు.
*101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?* : ఇంద్రుడు.
*102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?* : మాతలి.
*103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?* : కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
*104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?* : హనుమంతుడు.
*105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?* : శత్రుంజయం.
*106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?* : స్వయంగా తన భవనమునే యిచ్చెను.
*107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?* : బ్రహ్మ.
*108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?* : తన మెడలోని ముత్యాలహారం.
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment