*మకర సంక్రాంతి విశిష్టత *
🍀🌺🍀🌺🍀🌺🍀🌺*జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులున్నాయి. ఇందులో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడం వరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటి వరకూ దక్షిణాయనంలో సంచరిస్తూ వస్తున్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన శుభదినం కూడా ఇది.*
*సూర్యుడు హిందువులకు ప్రత్యక్ష బ్రహ్మ. కాలచక్రానికి అతీతంగా సంచరిస్తూ ఉండే పరమాత్మ స్వరూపం. ఉత్తరాయనంలో సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశి లోకి వచ్చే రోజు మకర సంక్రమణం జరుగు రోజు. అదే మకర సంక్రాంతి. భోగి తర్వాత రోజు వచ్చేదే సంక్రాంతి.*
*మకర సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణ శక్తి గలదని అర్థం. స్నానం దానం, పూజ అనే మూడు విధులు సంక్రాంతి పర్వదినాన నిర్వర్తించాలి. సూర్యోదయాకి ముందే నువ్వుల పిండితో శరీరాకి నలుగు పెట్టి తలంటి స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. ఆయనను శాంతింప చేయాలంటే నువ్వులు దానమివ్వాలి. వాతావరణ పరంగా చూస్తే మంచు కురిసే హేమంత ఋతువు, శీతకాలం బాధలు నివారించుకోవడానికి స్నాన జలంలో నువ్వులు కలపడం, నువ్వులు తినడం, తిలలతో దైవ పూజ అనేవి ఆచరించే విధులు. ఆయుర్వేద పరంగా చూస్తే చలికాలంలో శరీరానికి నువ్వులు మంచి చేస్తాయి. నువ్వులు ఉష్ణవర్థకమైనవే కాకుండా బలవర్ధక మైనట్టివి.*
*మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నంటిలోనూ ఇది విశిష్టమైనది. ఉత్తరాయణం దేవతలకు ఇష్టమైన కాలం. ఈ సమయంలో పూజ, పునష్కారాలు, యజ్ఞయా గాదులు చేసి దేవతలను మెప్పించాలి. అలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల నమ్మకం.
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment