*ఆ బాలుడు మందమతిగా ఉండేవాడు. చదువు అబ్బలేదు. చదివింది గుర్తుండేది కాదు. ఇక చదవండి*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
కుమారుడికి చదువు యోగం లేదేమోనని తల్లిదండ్రులు మథనపడేవారు. ఇంతలో ఆ అబ్బాయికి బాబాయి వరసయ్యే వారి దూరపు బంధువు ఒకరు వాళ్లింటికి వచ్చాడు. తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొడుకుకు సరస్వతీ కటాక్షం కలిగేదెప్పుడోనని బాధపడ్డారు. అది చూసి బాధపడిన బంధువు బాలుణ్ణి తానుండే రాయవేలూరుకు తీసుకువెళ్లాడు. వారి ఇలవేల్పు శోళింగపురం యోగనరసింహస్వామి. ఆయన ఆ స్వామిలో శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ నిరంతరం రామమంత్రాన్ని జపించేవారు. రామమంత్రంపై ఆయనకు అంత గురి. అందుకే ఓ శుభ సమయాన తన అన్న కుమారుడికి కూడా ‘ *_రామతారక మంత్రం_*’ ఉపదేశించాడు. ప్రతి నిత్యం ఆ మంత్రాన్ని జపించ మని సూచించాడు.
ఆ రోజు నుంచీ బాలుడు ఉదయం లేచినప్పటి నుంచి నిరవధికంగా రామనామాన్ని జపించనారంభించాడు. దాని ప్రభావంతో ఏకసంథాగ్రాహిగా మారిపోయాడు. అక్షరంముక్క రాదని అందాకా ఎగతాళికి గురైన ఆ బాలుడు అనతి కాలంలోనే తరగతిలో అత్యుత్తమ విద్యార్థిగా గురువుల మన్ననలు అందుకున్నాడు. ఎన్నో విశ్వవిద్యాలయాల పట్టాలు పొందాడు. చదువే రాదేమో అనుకుంటే.. చదువు చెప్పే అధ్యాపకుడయ్యాడు. ఆనక ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయ్యాడు. భారత రెండో రాష్ట్రపతిగానూ ప్రకాశించాడు. రామనామంతో తల రాతనే మార్చుకున్న ఆ మహానుభావుడు మరెవరో కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్. వారికి రామనామ ఉపదేశాన్ని ప్రసాదించిన వారు సర్వేపల్లి నరసింహన్. కాలాంతరంలో వారే రమణ మహర్షి ప్రత్యక్ష శిష్యులైన స్వామి ప్రణవానంద.
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*Anjaneya Stuti -ఆంజనేయ స్తుతి*
ReplyDelete*నమో ఆంజనేయం నమో దివ్య కాయం*
*నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం*
*నమో నిఖిలారక్షాకరం రుద్రా రూపం*
*నమో మారుతిమ్ రామ దూతం నమామి*
*నమో వానరేశం నమో దివ్యభాసం*