నమ్మకానికి మరో రూపమే దేవుడు
🍀🌺🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺ఒకప్పుడు ఒక ప్రాంతంలో కర్ఫ్యూ విధించబడింది, అలా నిర్వహిస్తున్నప్పుడు, ఆ కర్ఫ్యూ వల్ల ఇంటి తలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితులు, అదే ప్రాంతంలో ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది! ఈ కర్ఫ్యూ వల్ల ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొర పెట్టు కోవడానికి మోకాళ్ళ మీద మొకరిల్లి ప్రార్థన చేస్తోంది…
ప్రార్థనలో భాగంగా ఆవిడ దేవునితో, "భగవంతుడా ..! ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు పక్షితో ఆహారాన్ని సమకూర్చావని విన్నాను, అలాగే నా మనవడి ఆకలి కూడా తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను" అన్నది.
ఆ మాట విన్న తన మనవడు భగవంతుడు పంపే పక్షి తనకు ఆహారాన్ని తెస్తుందని నమ్మి , పక్షి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి ఉండాలని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.
అయితే… ఆ కిటికీ పక్కనే కాపలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపుమీద కొట్టి లోపలికి తొంగి చూశాడు. లోపల ఓ పసి పిల్లవాడు బిక్క మోహం వేసుకుని అతనివంక బెదురుగా చూస్తుంటే ..
ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ..!?" అన్నాడు.
ఆ పిల్లవాడు "మా బామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు పక్షితో ఆహారం పంపుతాడని అంటుంది" అన్నాడు. అందుకే కిటికీ తలుపు తీసాను అన్నాడు.
అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ఓ ముసలావిడని చూసి ఆ పిల్ల వాడితో "ఆకలి వేస్తుందా? " అని అడిగి "మీ బామ్మ చెప్పిన పక్షిని నేనే ..! నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపు కొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.
ఆ పోలీసు ఒక మూసి ఉన్న పచారి కొట్టు తీయించి పప్పులు, ఉప్పులు, బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.
ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు ఆ పోలీసు ద్వారా ఆకలి తీర్చాడు.
ఒకరిది ప్రార్థన ..!
ఇంకొకరిది విశ్వాసం ..!
మరొకరిది ప్రేమ పూరిత సహాయం ..!
దిక్కు లేని వారికి దేవుడే దిక్కు!
ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తు చేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన ..!
’నమ్మకం’ ఆచిన్న పిల్ల వాడు తన మామ్మ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచి మరీ వెతకడం ..!
నమ్మకానికి మరో రూపమే.. ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తన వంతు ‘సహాయం’ చేయడం ..!
పాలలో పెరుగు, వెన్న, నెయ్యి దాగి ఉన్నట్లు నీ నమ్మకం లో ఎన్నో మహా అద్భుతాలు దాగి ఉన్నాయి! అవి చూడాలంటే… కాస్తంత ఓపిక, మనోధైర్యం కష్టపడే తత్వం ఉంటే చాలు!
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment