*పంచపునీతాలు*
🍀🌺🍀🌺🍀🌺
మానవుడు జీవితంలో పైకి రావాలంటే ఐదు విధాలుగా పునీతమవ్వాలి.వాటినే పంచపునీతాలు అంటారు... అవి...
వాక్ శుద్ధి దేహ శుద్ధి భాండ శుద్ధి కర్మ శుద్ధి మనఃశ్శుద్ధి*వాక్ శుద్ధి*
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు.
కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు.పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ,పరోక్షంగా కానీ నిందించకూడదు.
మంచిగా,నెమ్మదిగా,ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
*దేహ శుద్ధి*
మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ,
రెండు పూటలా స్నానం చెయ్యాలి.చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
*భాండ శుద్ధి*
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం, అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి.
స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
*కర్మ శుద్ధి*
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు.
తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.
*మన: శ్శుద్ధి*
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది.
ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి.దీని వల్ల దుఃఖం చేకూరుతుంది ....
కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...
ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !! యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !! గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
భక్తి ప్రవేశిస్తే మనిషి మహాత్ముడవుతాడు !!..
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment