Wednesday, 31 January 2024

మన్రో గంగాళాలు (01-Feb-24, Enlightenment Story)

 *మన్రో గంగాళాలు అంటే  ఏవో తెలుసా..?

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే.*తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి..?? ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..??


👉 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు.

👉 అపట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక, తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడా రామానుజా కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ కూడా జరిగినా ఆలయంలో పంచి పెట్టె ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.

👉 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. " THOMOS MUNRO " ..

👉 దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఎలుబడి కింద ఉండేది.

👉 ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు... మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు..

👉 ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా...ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.

👉 అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు( అవే వారికి భోజనాలు ).. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా , దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు.) ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది... స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని , శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని....

👉మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు  తినకుండా ఆదేశాలు ఇచ్చాడు..

👉 శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో...అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి , పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు.

👉 అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు దన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు.

👉 అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన కి, సనాతన ధర్మం పట్ల భక్తిని  గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల ,ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో..శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..

👉తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే  తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు......

👉 ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవ్యధతో  మంచం పట్టి నేరుగా నీ సేవలో  పాల్గొని అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు.

👉 అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు. ఈ గంగాళలను ఇప్పటికీ *మన్రో గంగాళాలు "* అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాల లో చలామణీలో ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు.

👉 తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాల లోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు.

భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడప కి, ప్రతి చెట్టు కి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️



No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...