కర్మ , తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺*ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది. ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే, ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు*
*దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి.రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు. ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.*
*అతడి పరిస్థితి,తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను*కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు*
*భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు*
*సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త *వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది *దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు*
మిత్రులారా *జీవతం చాలా నేర్పిస్తుంది*
*నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది*
*అహంకారం అసలు పనికిరాదు*
*జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు, ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని*
*నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.*
*మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది మిత్రులారా!
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment