*అమ్మాయికి కాన్సర్ - రామారావు సాయం*
🍁🍁🍁 🍁🍁🍁 🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁
ఒక మహానగరంలో ఒక కుటుంబం జీవిస్తోంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని రామారావు, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. రామారావు ఒక సామాన్య ఉద్యోగి. అయినా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నదాంతో జీవిస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచింది.
ఒక రోజున రామారావు ఆఫీసుకు వెళ్లుతుంటే పిల్లలు బయటకు షికారు తీసుకు వెళతావా నాన్నా అని అడిగారు. అప్పుడు రామారావు కొంచెం ఆలోచించి సరే అని ఈరోజు నాకు బోనస్ వస్తుంది, అది తీసుకొని ఇంటి తొందరగా వస్తాను, మీరు రెడిగా ఉండండి అని పిల్లలకు , భార్యకు చెప్పి ఆఫీసుకి వెళ్ళాడు. చూస్తుండగా సాయంత్రం అయ్యింది. ఇంటి దగ్గర పిల్లలు స్కూలు నుంచి వచ్చి నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.
రామారావు ఆఫీసులో బోనస్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో రైల్వేస్టేషన్ దగ్గర ఒక కుటుంబం ఏడస్తూ అందరిని ఏదో అడుగుతున్నారు. ఆ విషయం ఏమిటో తెలుసుకుందామని రామారావు వాళ్ల దగ్గరకు వెళ్ళి ఎందుకు మీరు ఇలా భాధపడుతూ అందరిని ఏమి అడుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్లు మా అమ్మాయికి కాన్సర్, ఆపరేషన్ చేయాలి అన్నారు. కాని అంత డబ్బులేదు. అందుకని ఎవరైనా సాయం చేస్తారేమో అని అందరిని అడుగుతున్నాము.
దయచేసి మాకు మీరు డబ్బు సాయం చేసి మా పిల్లని బతికించండి అని పిల్ల తండ్రి ప్రాథేయపడ్డాడు. అది విని రామారావు మనసు కరిగి పిల్లలని ఈరోజు కాకపోతే వేరే ఎప్పుడైనా బయటకు తీసుకువెళ్ళవచ్చు. అదే ఇప్పుడు ఈ కుటుంబానికి నా బోనస్ డబ్బులు సాయం చేస్తే వాళ్ల అమ్మాయి ఆపరేషన్ కి డబ్బు సాయం చేస్తే ఆ అమ్మాయి బతుకుతుంది. ఆ కుటుంబం ఆనందంగా ఉంటారు. ఈ డబ్బు వాళ్లకి అవసరం. నా కుటంబం విలాసం కన్నా వాళ్ల అవసరం చాలా ముఖ్యం అని ఆలోచించి రామారావు తన దగ్గర ఉన్న బోనస్ ఆ అమ్మాయి వాళ్ల నాన్నకు ఇచ్చాడు. వాళ్ళు చాలా ఆనందించి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
తరువాత రామారావు కూడా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన రామారావుని చూసి పిల్లలు ఆనందంగా నాన్న మేము రెడీగా ఉన్నాం, షికారుకు వెళదామా అన్నారు. రామారావు పిల్లలకి ఏ సమాధానం చెప్పాలో తెలియక సాఫాలో కూర్చుండి పోయాడు. ఇంతలో రామారావు భార్య వచ్చి ఏమయ్యింది అలా కూర్చున్నారు, ఆఫీసులో ఏమయినా ప్రోబ్లమా అని అడిగింది. అప్పుడు రామారావు మంచి నీళ్లు తాగి అదేమి లేదు. నేను ఆఫీసునుంచి బోనస్ తీసుకుని వస్తుంటే రైల్వేస్టేషను దగ్గర ఒక కుటుంబం వాళ్ల అమ్మాయి ఆపరేషన్ కి డబ్బులు లేవని అందరిని అడుగుతున్నారు. కాని ఎవరు సాయం చేయలేదు. నాకు మాత్రం వాళ్ల పాపని చూస్తే జాలేసింది. అందకని ఆ డబ్బులు పాప ఆపరేషన్ కి సాయం చేసాను.
అంతే ఈ మాట పిల్లలు విని అంటే మనం ఇప్పుడు బయటకు వెళ్లమా నాన్న అని జాలిగా అడిగారు. అప్పుడు రామారావు భార్య పిల్లలకు నచ్చచెపుతూ పాపం ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదు కదా! అందుకే నాన్న వాళ్లకు డబ్బు సాయం చేసారు. మనం మళ్లీ ఎప్పుడైనా బయటకు వెళదాము అని పిల్లలకు నచ్చచెప్పింది.
దాంతో రామారావు కూడా పిల్లలతో ఇలా అన్నాడు. పిల్లలు ఇవాళ వెళ్లకపోయినా రేపు ఆదివారం మిమ్మల్ని తప్పకుండా బయటకు తీసుకువెళతాను అని ప్రామిస్ చేసాడు. దాంతో పిల్లలు కూడా బెట్టు చేయకుండా ఆడుకోవడానికి వెళ్లారు. ఇలా కొంత కాలం గడిచింది.
ఒక రోజు రామారావు భార్య వార్తలు చూద్దామని టీవీ పెట్టింది. ఒక వార్త విని రామారావు భార్య ఖంగుతింది. అదేంటంటే కొంతమంది కుటుంబంలో వాళ్లకి ఆరోగ్యాలు బాగాలేదని, కేన్సర్ అని ఇలా రకరకాలు కారణాలతో అందరి దగ్గర నటిస్తు డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్నారని అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండండి, మోసపోవద్దు అని వార్త చెప్పారు. ఇది విని రామారావు భార్య చూసారా మీరు జాలితోవాళ్లని నమ్మి డబ్బులు ఇచ్చారు. కాని వాళ్ళు మిమ్మల్ని ఎంత మోసంచేసారు. అనవసరంగా వాళ్లకి డబ్బులు ఇచ్చి అటు పిల్లలకి ఆనందం లేకుండా చేసారు. ఇపుడు ఏమయింది అని భార్య చిరు కోపంతో అంది. పిల్లలు కూడా నాన్న చూసావా. ఏంజరిగందో అనవసరంగా షికారు లేకుండా అయ్యింది అని అన్నాడు.
అపుడు రామారావు, పోనీలే నేను మోసపోయినా ఆ పాపకు కేన్సర్ లేదు. ఆనందంగా ఉంది. అంతే చాలు అన్నాడు.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment